దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైందా? 

తమిళ స్టార్ హిరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారంటూ తమిళనాడులో హడావిడి మొదలైంది. తమిళనాట రాజకీయాల్లో సినీతారల సందడి కొత్తేమీకాదు. అయితే కరుణానిధి, జయలలితల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ దాదాపుగా లేరనే చెప్పొచ్చు. కమల్ హాసన్ పార్టీపెట్టినా కూడా చేదు అనుభవమే ఎదురైంది. రజనీకాంత్ లాంటి లెజెండ్ హీరో కూడా రాజకీయాల్లోకి తొలుత వద్దామనుకున్నా తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుం తమిళ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ జోరుగానే ప్రచారం సాగుతోంది. తాజాగా […]

Share:

తమిళ స్టార్ హిరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారంటూ తమిళనాడులో హడావిడి మొదలైంది. తమిళనాట రాజకీయాల్లో సినీతారల సందడి కొత్తేమీకాదు. అయితే కరుణానిధి, జయలలితల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ దాదాపుగా లేరనే చెప్పొచ్చు. కమల్ హాసన్ పార్టీపెట్టినా కూడా చేదు అనుభవమే ఎదురైంది. రజనీకాంత్ లాంటి లెజెండ్ హీరో కూడా రాజకీయాల్లోకి తొలుత వద్దామనుకున్నా తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుం తమిళ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ జోరుగానే ప్రచారం సాగుతోంది. తాజాగా విజయ్ మక్కల్ ఇయక్కంతో దళపతి జరిపిన సమావేశం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. 

ఇక తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ తన అభిమాన సంఘం మక్కల్ ఇయక్కంతో సమావేశమయ్యారు. ఇది తమిళ రాజకీయాల్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ సిద్ధమైయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కోసమే ఈ సమావేశంలో చర్చ జరిగిందని చర్చల్లో పాల్గొన్న అభిమానులు తెలిపారు.  

అందరూ విజయ్ అభిమానులే:

ఈ సమావేశానికి హాజరైన అభిమానులు చెప్పిన సమాచారం ప్రకారం … తమ అభిమాన హీరో పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ముఖ్యవిషయాలు ఈ సమావేశంలో చర్చించామన్నారు.  తమ హీరో పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలిపారు. ఒకవేళ  విజయ్ రాజకీయాల్లోకి వస్తే సినీ కెరీర్ ను ఏం చేస్తారనే చర్చ వచ్చిందనీ, ఒకవేళ అదే జరిగితే పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పేస్తారన్నారు. నూటికి నూరు శాతం ప్రజాలకోసం పనిచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. స్టార్ హీరో కనక సినిమాల్లో కనిపించకపోతే అది కచ్చితంగా విజయ్ అభిమానులకు నిరాశ కలిగించే అంశమనే చెప్పాలి. 

విజయ్ పొలిటికల్ ఎంట్రీ జరిగితే అతనికి విజయ్ అభిమానులే కాకుండా అజిత్, రజనీకాంత్, ఇతర హీరోల అభిమానులు కూడా మద్దతుగా నిలుస్తారని చెప్పారు, ప్రపంచ వ్యాప్తంగా విజయ్ కి అభిమానులు ఉన్నారనీ వారంతా విజయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని వీఎంఐ తెలిపింది. 

సినిమాలను బై బై:

ఒకవైపు విజయ రాజకీయాల్లోకి రావడానికి తమ సర్వశక్తులూ ఉపయోగిస్తామంటున్న ఫ్యాన్స్ కి ఇకపై తమ అభిమాన హీరోను తెరమీద చూసే అవకాశం ఉండకపోవడం తమకు బాధ కలిగించే విషయమని చెప్తున్నారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తే తమ అభిమాన హీరో పాటలు, ఫైట్లు, సినిమాలు అన్ని మిస్ అవుతాం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా కూడా తమ హీరో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని తమ భావిస్తున్నామన్నారు. ఇది తమ చిరకాల కల అని కూడా తెలిపారు. ప్రస్తుతం విజయ్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వీటి షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత తన రాజకీయ రంగ ప్రవేశం కోసం అభిమానులకు క్లారటీ వచ్చే అవకాశం ఉంది.  ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న దళపతి 68 విజయ్ నటించే చివరి సినిమా అయ్యే అవకాశం ఉంది. 

అయితే ఫ్యాన్స్ తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావాలని తెలపడం, అభిమాన సంఘాలతో సమావేశాలు జరపడం లాంటివే తప్ప ఇప్పటివరకూ విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన విషయాలు పబ్లిక్ లో చెప్పింది లేదు. సో దళపతి నోటివెంట పొలిటికల్ ఎంట్రీ మాట వచ్చేవరకూ అభిమానులు వెయిట్ చేయక తప్పదు.