Thalapathy Vijay: 15 ఏళ్ల తర్వాత విజ‌య్ త్రిష‌ సినిమా

లోకేష్ కనకరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో తలపతి విజ‌య్ (thalapathy vijay) నటిస్తున్న లియో (leo)సినిమా గురించి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా కొన్ని లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. లియో చిత్రంలో త్రిష, (trisha) ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా నటిస్తున్నారు.  లియోని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై […]

Share:

లోకేష్ కనకరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో తలపతి విజ‌య్ (thalapathy vijay) నటిస్తున్న లియో (leo)సినిమా గురించి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా కొన్ని లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. లియో చిత్రంలో త్రిష, (trisha) ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా నటిస్తున్నారు.  లియోని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు, దీనికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే 15 సంవత్సరాల తర్వాత త్రిష మళ్లీ విజయ్  జతకట్టారు. 

15 ఏళ్ల తర్వాత విజయ్-త్రిష సినిమా: 

ముఖ్యంగా లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతి ఒక్కరిని తప్పకుండా అలరిస్తుందని త్రిష ఆశాభావం వ్యక్తం చేసింది. సినిమా గురించి ప్రత్యేకించి ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ, సినిమాలో విజయ్  (lokesh kanagaraj) పక్కన తన కెమిస్ట్రీ ఎప్పటిలాగే బాగుంటుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిజంగా విజయ్ తో నాలుగు సినిమాలు చేసిన తర్వాత, త్రిష మరొకసారి విజయ సినిమాలో కనిపించనుంది. నిజంగా విజయ్ తో  (lokesh kanagaraj) పనిచేయడం తనకి చాలా బాగుంటుందని, తాము ఇద్దరు మంచి స్నేహితులని, తాము ఇద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని, ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్న లియో సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని త్రిష లియో సినిమాకు సంబంధించి ఆశాభావం వ్యక్తం చేసింది. విజయ్ నిజానికి చాలా కూల్ గా ఉండే వ్యక్తిత్వంగల మనిషి అని, తన హార్డ్ వర్క్, తను ప్రతి సీనులో చూపించే డెడికేషన్ చాలా బాగుంటుందని, మళ్లీ ఆయనతో మరిన్ని చిత్రాలను తీసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని, విజయ్ గురించి మాట్లాడింది త్రిష. గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన గిల్లీ, కురువి, తిరుపాచి, ఆతి బ్లాక్ బస్టర్ హిట్. వీళ్ళిద్దరు మరోసారి కలిసి నటిస్తుండడంతో లియో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Read More: లియో సెన్సార్ పూర్తి.. 13 క‌ట్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

ఇక త్రిష విషయానికొస్తే మనకు తెలిసిందే, తను వర్షం సినిమాతో టాలీవుడ్ కుర్ర కారు మనసు దోచుకుంది. తర్వాత అతడు సినిమాతో మహేష్ బాబు తో కూడా నటించింది. త్రిష టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష యాక్టింగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. త్రిష నాగార్జునతో కింగ్. రవితేజతో కృష్ణ లాంటి సినిమాలో నటించింది. చిరంజీవితో స్టాలిన్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు సినిమాలు నటించట్లేదు. అయినా ఇప్పటికీ తెలుగులో త్రిష కు మంచి క్రేజ్ ఉంది. తను సినిమా చేస్తానంటే నిర్మాతలు రెడీగా ఉన్నారు. తన సినీ కెరీర్లో చిన్నచిన్న వివాదాలు ఉన్నప్పటికీ త్రిష తన కెరీర్ లో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. 

ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే తన మొదటి సినిమా సందీప్ కిషన్ తో చేసిన నగరం. తను తర్వాత ఖైదీ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ గారితో తను చేసిన విక్రమ్ బ్లాక్ బస్టర్. లోకివర్స్ అనే అనే సినిమాటిక్ యూనివర్స్ ని లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేశాడు. తను ఇంతకుముందు తలపతి విజయ్ తో మాస్టర్ అనే సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్.