దేశంలోనే అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్‌తో చ‌రిత్ర సృష్టించిన రజనీకాంత్..!

మనిషికి సాధించాలనే తపన ఉండాలి కానీ  తప్పనిసరిగా అనుకున్నది సాధించవచ్చు.  అది లేకుంటే ముందుకెళ్లడం చాలా కష్టం. అలాంటి దానికి ప్రధాన ఉదాహరణ రజనీకాంత్. తమిళనాడులో బస్ కండక్టర్ గా చేసే రజినీకాంత్  తన డిఫరెంట్ స్టైల్ తో, నటన రంగంలోకి అడుగుపెట్టి  సూపర్ స్టార్ గా ఎదిగారు. 8 పదుల వయసుకు దగ్గరికి వస్తున్న  ఇంకా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వసూళ్లలో దూసుకుపోతున్నారు. అలాంటి రజిని మరో రికార్డు క్రియేట్ చేశారు. […]

Share:

మనిషికి సాధించాలనే తపన ఉండాలి కానీ  తప్పనిసరిగా అనుకున్నది సాధించవచ్చు.  అది లేకుంటే ముందుకెళ్లడం చాలా కష్టం. అలాంటి దానికి ప్రధాన ఉదాహరణ రజనీకాంత్. తమిళనాడులో బస్ కండక్టర్ గా చేసే రజినీకాంత్  తన డిఫరెంట్ స్టైల్ తో, నటన రంగంలోకి అడుగుపెట్టి  సూపర్ స్టార్ గా ఎదిగారు. 8 పదుల వయసుకు దగ్గరికి వస్తున్న  ఇంకా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వసూళ్లలో దూసుకుపోతున్నారు.

అలాంటి రజిని మరో రికార్డు క్రియేట్ చేశారు. ఏకంగా జైలర్ సినిమాకు 110 కోట్ల పారితోషకం తీసుకోవడమే కాకుండా 100 కోట్లు అదనపు చెక్కు కూడా అందుకున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. రజనీకాంత్ చూడటానికి అంతగా అందమే ఉండదు. ఆయన కంటే అందం, దేహ దారుడ్యం కలిగిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అయినా రజనీకాంత్ సినిమాల వైపే చూస్తుంటారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆయన నటించడమే కాదు అందులో జీవిస్తారు. ఏది చేసినా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అందుకే రజనీకాంత్ కు ఇంత వయసు వచ్చిన  ఆయన సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ, ఇతర దేశాలలో కూడా దూసుకుపోతున్నాయి.  

సాధారణంగా రజనీకాంత్ సినిమా వస్తుంది అంటే  తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి కాలేజీలు,  కంపెనీలు, స్కూల్స్ కూడా సెలవులు ప్రకటిస్తారు. అంతటి క్రేజ్ ఉన్న ఈ హీరో  తాజాగా నటించి రిలీజ్ అయిన సినిమా జైలర్.

దీనికి 110 కోట్ల పారితోషకం తీసుకున్నారు. అయితే ఈ చిత్రం ఓవరాలిగా 650 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్ రజనీకాంత్ కి అదనంగా  100 కోట్ల సింగిల్ చెక్ ఇచ్చాడు. అంటే ఆయన పారితోషం, ఈ 100 కోట్లు కలిపితే ఆయన రెమ్యూనరేషన్ 210  కోట్లు అవుతుంది. ఈ విధమైన పారితోషకం ఇండియాలో ఏ స్టార్ హీరో కూడా తీసుకోలేదు. ఫస్ట్ టైం రజనీకాంత్ అందుకోవడంతో మరో రికార్డ్ ఆయన సొంతమైంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్ ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, మోహన్ లాల్ కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయని చెప్పాలి. వీటన్నింటిని బట్టి చూస్తే ఈసారి రజినీకాంత్ ఖాతాలో సాలిడ్ హిట్ పక్కా అన్నట్టుగా అనిపిస్తుంది.

ఇక ఇందులో శివరాజ్ కుమార్, సునీల్, జాకీష్రాఫ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నటించిన రజినీకాంత్ , తమన్నా, మోహన్ లాల్ పారితోషకాలు లీక్ అవ్వడమే కాదు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇకపోతే సినిమా బడ్జెట్ కి కాస్టింగ్ రెమినరేషన్స్ 60% ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా ₹110 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నారట మరొకవైపు మోహన్ లాల్ ₹8 కోట్లు తీసుకుంటుండగా శివరాజ్ కుమార్ , జాకీ ష్రాఫ్ లకు ₹4కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఇందులో హీరోయిన్ గా తమన్నాకు ₹3 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక యోగి బాబుకి కోటి రూపాయలు, రమ్యకృష్ణ కి ₹8లక్షలు, సునీల్ కి ₹70 లక్షల వరకు పారితోషకం అందించారట. ఇతర నటీనటులకు మరో ₹2 కోట్ల వరకు ఖర్చు అయ్యి ఉంటుందని, టెక్నీషియన్లకు ఇంకో ₹5 కోట్ల వరకు ఖర్చయింటుందని సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు ₹150 కోట్ల వరకు పారితోషకం రూపంలోనే నిర్మాతలు అందించగా.. మొత్తం బడ్జెట్ ₹225 కోట్లు అయినట్లు తెలుస్తోంది.