ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బరిలో దిల్ రాజు, సి. కళ్యాణ్ 

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెన్షియల్ పోస్ట్ గురించి పోటాపోటీగా పోటీ చేస్తున్నారు, దిల్ రాజు, సి. కళ్యాణ్. అయితే జూలై 30న ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే, ఇద్దరు ప్రముఖుల మధ్య గట్టి పోటీ నెలకొనబోతోంది.  పోటీ మొదలైంది:  అయితే ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో దిల్ రాజు వైస్ ప్రెసిడెంట్గా చాంబర్కి పనిచేశారు అంతేకాకుండా సి. కళ్యాణ్ కూడా మాజీ ప్రెసిడెంట్గా కొన్ని సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తోంది. […]

Share:

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెన్షియల్ పోస్ట్ గురించి పోటాపోటీగా పోటీ చేస్తున్నారు, దిల్ రాజు, సి. కళ్యాణ్. అయితే జూలై 30న ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే, ఇద్దరు ప్రముఖుల మధ్య గట్టి పోటీ నెలకొనబోతోంది. 

పోటీ మొదలైంది: 

అయితే ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో దిల్ రాజు వైస్ ప్రెసిడెంట్గా చాంబర్కి పనిచేశారు అంతేకాకుండా సి. కళ్యాణ్ కూడా మాజీ ప్రెసిడెంట్గా కొన్ని సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జూలై 30వ తారీఖున జరగబోతున్న ఎన్నికలలో ప్రెసిడెంట్ బరిలో మళ్లీ దిల్ రాజు అలాగే సి కళ్యాణ్ మధ్య గట్టి పోటీ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కూడా ఎన్నికల గురించి రెడీ అవుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 

అయితే ప్రస్తుతానికి, 1200 మంది నిర్మాతలు ఏకగ్రీవంగా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, నిర్మాత రామ్ మోహన్ రావు పేరు మొదట్లో వినిపించింది. తరువాత, సి కళ్యాణ్ ఎన్నిక బరిలోకి అడుగు పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరోపక్క దిల్ రాజు చాలా ప్రజాదరణ పొందిన నిర్మాత- డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రెసిడెంట్ పదవి మీద మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగు ఫిలిం చాంబర్లోని అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అనుకుంటున్నప్పటికీ, ఎక్కువ మంది సభ్యులు పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో, ఎన్నికల విషయంలో ఎవరు ప్రెసిడెంట్గా నిలుస్తారనేది చెప్పడానికి కష్టమే అంటున్నారు సినీ వర్గాలు.

హామీ ఇస్తున్నారు:

గత 20 ఏళ్లుగా చురుకైన నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా చురుగ్గా ఉంటూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు, తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో, ప్రస్తుతానికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు సభ్యులు భావిస్తున్నారు. 

సి కళ్యాణ్ ప్యానెల్ వారు, తాము 300 చిన్న నిర్మాతలకు సహకారిగా ఉన్నట్లు, తమ వంతు వారికోసం కృషి చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వారికి ఎల్లప్పుడూ  అందుబాటులో ఉండే, కావాల్సిన సహకారం అందించినట్లు చెప్పారు. చిన్న సినిమాలు నెమ్మదిగా కనుమరుగైపోతున్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1000 బేస్ సింగిల్ థియేటర్లలో, చిన్న సినిమాల కోసం 5వ షో ఏర్పాటు కోసం, తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

దిల్ రాజు కొత్త సినిమా: 

నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల సినిమా గేమ్ చేంజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.కైరా అద్వానీ- రామ్ చరణ్  జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

అయితే ప్రస్తుతం, రామ్ చరణ్ – కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన హైప్ తెచ్చుకున్న ఒక చిత్రం. ఈ సినిమా విడుదలపై రామ్ చరణ్ అభిమానులు ఇంకా ఎగ్జైటింగ్‌గా ఉన్నప్పటికీ, చిత్ర బృందం నుండి ఎటువంటి అప్‌డేట్‌లు లేవు. దర్శకుడు శంకర్ మరియు నటుడు రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ వృత్తిపరమైన కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు, నివేదికల ప్రకారం, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని శైలేష్ కొలను చిత్రీకరించనున్నారు అని అంటున్నారు.