యాంకర్ సుమ గొప్ప మనసు.. వారికి రూ.5 లక్షల విరాళం!

Telugu Anchor Suma: తెలుగు ప్రజలకు "సుమ కనకాల" ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మూవీ ఆడియో రిలీజ్ వేడుక అయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా వేదికలపై తన మాటలు, యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది.

Courtesy: x

Share:

తెలుగు ప్రజలకు "సుమ కనకాల"(Telugu Anchor Suma) ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మూవీ ఆడియో రిలీజ్ వేడుక అయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా వేదికలపై తన మాటలు, యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఇలా తన వాక్చాతుర్యంతో యాంకరింగ్‌లో తనకంటూ సుమ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల, తన వారసుడిగా కుమారుడు రోషన్ కనకాలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవన్నీ  పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సుమ తన ధాత్రుత్వాన్ని చాటుతోంది. వీలు దొరికినపుడల్లా పేదలకు సాయం చేస్తూ సేవా కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా మరోసారి ఆమె తన గొప్ప మనసును చాటుకున్నారు. 

రూ.5 లక్షల విరాళం అందించిన సుమ:
ప్రతి ఏటా సామాజిక సేవలో ముందుంటూ క్రిస్మస్ పండగ సందర్భంగా బహుమతులు అందజేస్తూ వస్తున్నారు. తాజాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో రూ.5 లక్షల విరాళం అందించి తన ఉదారతను చాటుకున్నారు. యాంకర్ సుమ కొంతకాలంగా ఫెస్టివల్ ఫర్ జాయ్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొరోనా సమయంలో కూడా ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు సుమ నిర్వహించారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందించారు సుమ. ఈమేరకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు రూ.5 లక్షల చెక్ అందజేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు ఈ సాయం అందజేసినట్లు సుమ తెలిపింది. ఇక విరాళాన్ని సుమ క‌న‌కాల తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ సహా ఇతర అసోసియేషన్ సభ్యులకు అందజే శారు. దీంతో సుమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సుమ ఆ మధ్యన జయమ్మ పంచాయతీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేకపోయింది. సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా చేస్తున్న మూవీ బాబుల్ గమ్. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రవికాంత్ పేరెపు తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాతో సుమ కొడుకు రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.