గంగవ్వ విమానం ఎక్కింది
ఒకప్పుడు రోజుకూలీ చేసేది, 62 సంవత్సరాల వయసులో మొదటిసారి విమానం ఎక్కింది

మిల్కూరి గంగవ్వ, 62 ఏళ్ల యూట్యూబర్, మొదటిసారి విమానంలో ప్రయాణించడం ద్వారా మీ కలలను సాకారం చేసుకోవడానికి వయసు అడ్డు కాదని నిరూపించింది. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా, రోజు కూలీగా పనిచేసేది గంగవ్వ. తెలంగాణ గ్రామీణ జీవనం, సంస్కృతిని ప్రదర్శించే “మై విలేజ్ షో” అనే యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించడం ద్వారా పేరు పొందింది. ఈ మధ్య  ఆమె మొదటిసారి విమానం ఎక్కినట్లు వచ్చిన  వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో మన లక్ష్యాలను సాధించడానికి వయస్సు […]

Share:

మిల్కూరి గంగవ్వ, 62 ఏళ్ల యూట్యూబర్, మొదటిసారి విమానంలో ప్రయాణించడం ద్వారా మీ కలలను సాకారం చేసుకోవడానికి వయసు అడ్డు కాదని నిరూపించింది. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా, రోజు కూలీగా పనిచేసేది గంగవ్వ. తెలంగాణ గ్రామీణ జీవనం, సంస్కృతిని ప్రదర్శించే “మై విలేజ్ షో” అనే యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించడం ద్వారా పేరు పొందింది. ఈ మధ్య  ఆమె మొదటిసారి విమానం ఎక్కినట్లు వచ్చిన  వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో మన లక్ష్యాలను సాధించడానికి వయస్సు ఎలాంటి అవరోధం కాదని చూపుతుంది. ఇలా ఈ వయసులో కూడా గంగవ్వ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. 

ఆమె అమాయకత్వం, ఆమె తెలంగాణా యాస, తన మాటలు గంగవ్వను సెలబ్రిటీని చేశాయి. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన గంగవ్వ ఓ యూట్యూబర్ ద్వారా సోషల్ మీడియా పరిచయమైంది. చిన్న చిన్న వీడియోలతో తన యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టిన గంగవ్వ తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయ్యింది. దినసరి కూలీ అయిన గంగవ్వ తెలంగాణ పల్లె జీవనాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను చిత్రించింది. యూట్యూబ్ ఛానెల్ మై విలేజ్ షో ద్వారా ఆమె పేరు ప్రపంచానికి తెలిసింది. ఛానల్ పుణ్యమా అని తన ఊరు దాటి సిటీ చేరుకుంది.

మిల్కూరి గంగవ్వ విమానం ఎక్కడం అనుభవం లేక ఉత్సాహం, భయాందోళనలతో కలిసి విమానంలోకి అడుగుపెడుతున్నట్లు ఆ వీడియోలో చూడవచ్చు. ఆమె విమానాన్ని చూసి ఆకర్షితురాలైంది. ఎంతో సంతోషించింది. సీటు బెల్ట్‌ పీటుకోవడానికి ఎంతో కష్టపడింది. ఫ్లైట్ ఎక్కినప్పుడు, చెవులు నొప్పి వచ్చాయని అంది గంగవ్వ.  ఆమె మొదట్లో ఎత్తును చూసి భయపడింది. గంగవ్వ తన తెలంగాణా మాండలికంలో తన అనుభవాన్ని వివరించింది. వీడియోలో ఆమె సంతోషంగా, తన మొదటి విమాన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నది. ఈ సందర్భంగా తీసుకున్న వీడియో, సెల్ఫీలు వైరల్ అయ్యాయి. ఫిబ్రవరి 16 న విమాన ప్రయాణం చేసిన గంగవ్వ ఇషా ఫౌండేషన్ వారు శివరాత్రి సందర్భంగా నిర్వహించిన శివరాత్రి వేడుకలలో పాల్గొనడానికి వెళ్లిందని తెలిసింది.

వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ 2019లో మల్లేశం అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించింది. ఈమె తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్‌బాస్‌లోని 19 మంది హౌస్‌మేట్స్‌లో ఒకరుగా కనిపించి కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.

భాష అర్థం కాకపోయినా నెటిజన్లు ఈ వీడియోని ప్రశంసల ముంచెత్తారు. ఒక వ్యాఖ్యాత ఇలా వ్రాశాడు, “చాలా బాగుంది బ్రో. మీ భాష నాకు అర్థం కాలేదు కానీ మీరు చాలా గొప్ప పని చేశారు, నేను మా అమ్మను ఫ్లైట్‌లో తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. అని రాశారు. మరొకరు ఇలా కామెంట్ చేశారు, “కథ మొత్తం చెప్పడానికి కొన్నిసార్లు మొహంలో భావాలు చాలు.” చాలా మంది ప్రేక్షకులు గంగవ్వను ఆమె స్ఫూర్తిదాయకమైన కథకు ప్రశంసించారు. కష్టపడి పనిచేస్తే, కలలు సాకారం చేసుకోవాలనే కోరిక  ఉంటే విజయం ఏ వయసులోనైనా వస్తుందని కొందరు కామెంట్లు పెట్టారు.