Telugu Movies: తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడరు..

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలు అంటూ విభేదాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా (Pan India) సినిమాలు ఉనికిలోకి వచ్చాయో ఆ రోజులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ అన్ని రకాల సినిమాలను చూస్తున్నారు. అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు. తెలుగు సినిమాలు (Telugu Movies) కూడా ఇటు బాలీవుడ్ లోనూ అటు వరల్డ్ వైడ్ గా కూడా ఆడుతుతన్నాయి. అనేక అవార్డులను కొల్లగొడుతున్నాయి. కానీ తమిళనాట […]

Share:

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలు అంటూ విభేదాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా (Pan India) సినిమాలు ఉనికిలోకి వచ్చాయో ఆ రోజులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ అన్ని రకాల సినిమాలను చూస్తున్నారు. అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు. తెలుగు సినిమాలు (Telugu Movies) కూడా ఇటు బాలీవుడ్ లోనూ అటు వరల్డ్ వైడ్ గా కూడా ఆడుతుతన్నాయి. అనేక అవార్డులను కొల్లగొడుతున్నాయి. కానీ తమిళనాట మాత్రం తెలుగు సినిమాల (Telugu Movies) ను అక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదట. ఈ విషయాలను ప్రముఖ ఎగ్జిబిటర్ తెలియజేశారు. ఎగ్జిబిటర్ చెప్పారు కావున ఆయన వద్ద తప్పకుండా లెక్కలుంటాయని మనం నమ్మి తీరాల్సిందే. ఎవరో బయటి వారు చెబితే నమ్మకపోయినా కానీ ఎగ్జిబిటర్ చెప్పారు కాబట్టి తప్పకుండా నమ్మి తీరాల్సిందే. 

జైలర్ ఇక్కడలా.. కానీ మన మూవీలు ఎలా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన రీసెంట్ మూవీ జైలర్ (Jailer) తెలుగు నాట రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. పలు స్ట్రెయిట్ సినిమాలకు పోటీగా ఈ మూవీ కూడా వసూళ్లు రాబట్టింది. అలా తెలుగు ప్రేక్షకులు తమకు కంటెంట్ నచ్చితే ఏ భాషా చిత్రమయినా సరే చూస్తారని ప్రముఖ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ (Sunil Narang) తెలిపారు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం అలా సినిమాలను ఎంజాయ్ చేయలేరని ఆయన తెలిపారు. రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీనే తీసుకుంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 మిలియన్ పౌండ్ల ను వసూలు చేసింది. అంతే కాకుండా తమిళ స్టార్ విజయ్ (Vijay) నుంచి ఇటీవల విడుదల చేసిన లియో ( Leo ) కూడా రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీ దాదాపుగా ఇప్పటికే 20 మిలియన్ పౌండ్లను వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా తమిళం నుంచి వచ్చిన అనేక మంది స్టార్లు ఇక్కడ పట్టు సాధిస్తున్నారు. తమిళంలో కూడా పెద్ద హీరోగా గుర్తింపు లేని విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమాకి మన తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆయన నుంచి వచ్చిన ‘బిచ్చగాడు 2’ మూవీకి రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందించారు. ఈ మూవీ దాదాపు 15 మిలియన్ పౌండ్లను కలెక్ట్ చేసిందని సమాచారం. ఇలా తమిళం నుంచి వచ్చిన అరవ సినిమాలను మన తెలుగు అభిమానులు ఎంతో ఆదరిస్తూ హిట్ చేస్తున్నారు. అంతే కాకుండా వారికి రికార్డు స్థాయి కలెక్షన్లను కూడా అందిస్తున్నారు. కానీ తమిళ ప్రేక్షకులు అలా ఉండరని మనం చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రముఖ ఎగ్జిబిటర్ ప్రస్తావించారు. 

వారు ఓపెన్ మైండ్ తో ఉండకపోవచ్చు.. 

తెలుగు ప్రేక్షకులంత ఓపెన్ మైండ్ తో తమిళ ప్రేక్షకులు (Tamil audience) ఉండకపోవచ్చునని ప్రముఖ ఎగ్జిబిటర్-డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు తమిళం, హిందీ లేదా మలయాళం వంటి వివిధ భాషల సినిమాలను తక్షణమే ఆదరిస్తారని, కంటెంట్ వారిని ఆకట్టుకుంటే అది ఏ భాషా చిత్రమైనా దానిని హిట్ చేస్తారని చెప్పుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ, తెలుగు చిత్రాలను (Telugu Movies) తమిళ ప్రేక్షకులు ఆ రీతిలో ఆదరించట్లేదని ఆయన తెలిపారు. తమకు స్పందన కూడా ఆ విధంగా రావట్లేదని వెల్లడించారు. వాస్తవానికి, సూర్య, కార్తీ, ధనుష్ మరియు విక్రమ్ వంటి తమిళ స్టార్లు తెలుగులో వాళ్ల మార్కెట్‌ ను బిల్డ్ చేసుకోగలిగారని ఇక్కడి స్ట్రెయిట్ హీరోలతో సమానంగా వారి మార్కెట్ ఉందని అన్నారు. కానీ మన స్టార్లు తమిళంలో మార్కెట్ ఏర్పాటు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. 

పరిస్థితులు మెరుగుపడొచ్చు.. 

రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన సూపర్ స్టార్లు కూడా అప్పుడు తమిళంలో మార్కెట్ విస్తరించుకుంటారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు చాలా తెలుగు సినిమాలు (Telugu Movies)  పాన్-ఇండియన్‌ గా మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తమిళ తారలను వారి నటన మరియు వారి కొత్తదనం కోసం మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఉత్తర భారతదేశంలోని ప్రేక్షకులను మన తారలు గెలుచుకున్నందున, తమిళ ప్రేక్షకులు కూడా మన చిత్రాలను ఇష్టపడతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఆ సినిమాలకు మినహాయింపు 

దర్శకధీరుడు రాజమౌలి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ దానితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియన్ సెన్సేషన్ పుష్ప (Pushpa) మూవీ తప్పా తమిళంలో మన తెలుగు సినిమాలు అంతగా ఆడిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కోలీవుడ్ లో మన స్టార్లు తమ సత్తా చాటాలని అక్కడ కూడా వారు మార్కెట్ ను విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలా జరిగితేనే తెలుగు సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని లేకపోతే సినిమా అనేది ఫెయిల్యూర్ లా మిగిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించి ‘భరత్ అనే నేను’ మూవీ తమిళనాడులో 8 మిలియన్ పౌండ్ల మార్కును అధిగమించింది, అయితే చిరంజీవి, బాలకృష్ణ మరియు రవితేజ వంటి ఇతర తారలు పొరుగు రాష్ట్రంలో అదే మ్యాజిక్‌ను పునరావృతం చేయలేకపోయారు. వారు తమ సినిమాలను తమిళంలో రిలీజ్ చేసినా కానీ అవి పెద్దగా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.