తమన్నా ‘కావాలా’ సాంగ్‌పై ప్రియుడి రియాక్ష‌న్‌

ప్రస్తుతం జైలర్ సినిమా నుంచి విడుదలైన కావాలా సాంగ్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇందులో నటించిన తమన్నా తన డాన్స్ తో అందరినీ అలరించింది. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా గురించి ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. మరో పక్క తమన్నా డాన్స్ చూసిన తర్వాత, ఈ సినిమా గురించి అభిమానుల్లో మరింత ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. తమన్నా డాన్స్:  కావాలా సాంగ్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరు కళ్ళు […]

Share:

ప్రస్తుతం జైలర్ సినిమా నుంచి విడుదలైన కావాలా సాంగ్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇందులో నటించిన తమన్నా తన డాన్స్ తో అందరినీ అలరించింది. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా గురించి ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. మరో పక్క తమన్నా డాన్స్ చూసిన తర్వాత, ఈ సినిమా గురించి అభిమానుల్లో మరింత ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

తమన్నా డాన్స్: 

కావాలా సాంగ్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరు కళ్ళు తమన్నా మీదే ఉన్నాయి. ఈ పాటలో మనకి తమన్నా అలాగే రజనీకాంత్ కనిపిస్తారు. ఎప్పటిలాగే రజినీకాంత్ తన బాడీ లాంగ్వేజ్ తో అందర్నీ ఆకట్టుకోగా, తమన్న డాన్స్ తో పాటకు మరింత మెరుగులు తెచ్చింది. శిల్పారావ్ మెస్మరైజింగ్ వాయిస్ ఈ పాటకు ప్లస్ పాయింట్. ఏది ఏమైనాప్పటికీ ఇప్పుడు తమన్నా డాన్స్ మీద కామెంట్లు వర్షం కురుస్తున్నాయి. 

విజయ్ వర్మ సపోర్ట్: 

మరోపక్క తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ, తన గర్ల్ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో తమన్నా డాన్స్ షేర్ చేయడం కూడా జరిగింది. అంతేకాదు, ఆ పోస్టులో, డాన్స్ లో ఉన్న ఫైర్ గురించి ఎక్సయిట్ అవుతూ మురిసిపోయాడు విజయ్ వర్మ. 

తమన్నా-విజయ్ వర్మ రిలేషన్షిప్: 

అయితే ప్రస్తుతం విడుదలైన లాస్ట్ స్టోరీస్ 2లో తమన్నా- విజయ్ వర్మ జంటగా కనిపిస్తారు. అంతేకాకుండా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమర్స్ కూడా బయటికి వచ్చాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో, వీరిద్దరూ జంటగా కనిపించారు ఇది వారి రిలేషన్షిప్ ని మరింత నిరూపిస్తూ బయటికి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న తమన్నా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ , ” నేను నటించిన ఎన్నో మూవీస్ అలాగే సిరీస్ లో చాలామంది కోస్టార్స్ తో నటించడం జరిగింది. కానీ ఇది ప్రత్యేకమని చెప్పాలి. నేను నాతో పాటు చేసే కోస్టార్ విజయ్తో చాలా బాగా కలిసిపోయాను అంతేకాకుండా మా ఇద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ పండింది. ఈ సిరీస్ నాకు ఒక కొత్త కోస్టార్ తో పాటు, నాకు ఎంతో దగ్గర అయ్యే ప్రత్యేకమైన మనిషిని తెచ్చిపెట్టింది” అని తమన్నా తన మనసులో మాట బయట పెట్టింది.

వారి రిలేషన్‌షిప్ పుకార్లు ప్రారంభమైనప్పటి నుండి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు మరియు ఇటీవలే వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. విజయ్ వర్మ మరియు తమన్నా భాటియాల సంబంధం ఇప్పుడు ఓపెన్ అయింది. వారు తమ రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి, బి-టౌన్‌లో ఇతర గురించి ప్రత్యేకమైన టాపిక్ గా మారింది. ఇప్పుడు, లస్ట్ స్టోరీస్ 2 విడుదల కావడంతో, అభిమానులు వారి అద్భుతమైన కెమిస్ట్రీని తెరపై నేరుగా ఆస్వాదిస్తున్నారు. 

తమన్నా నటించిన మరిన్ని సినిమాలు: 

తమన్నా తన మొదటి సినిమా నుంచి ప్రస్తుతం జైలర్ సినిమా వరకు ప్రతి సినిమాలో తనదైన శైలి  చూపిస్తూ ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం తమన్న నటించిన కొన్ని వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 ఆకర్షియంగా నిలుస్తున్నాయి.