రజనీకాంత్ తో తమన్నా స్టెప్పులు

తమన్నా భాటియా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూనే ఉంది. ఈసారి జైలర్ పాట కావాలా తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. తమన్నా భాటియా, రజనీకాంత్ డాన్స్ చేసిన ఈ పాటని గురువారం విడుదల చేశారు.  ఆకట్టుకుంటున్న తమన్నా స్టెప్పులు: రజనీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాలో కావాలా అనే పాటను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా స్టెప్పులు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి.  రజనీకాంత్ తో కలిసి తమన్నా స్టెప్పులు […]

Share:

తమన్నా భాటియా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూనే ఉంది. ఈసారి జైలర్ పాట కావాలా తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. తమన్నా భాటియా, రజనీకాంత్ డాన్స్ చేసిన ఈ పాటని గురువారం విడుదల చేశారు. 

ఆకట్టుకుంటున్న తమన్నా స్టెప్పులు:

రజనీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాలో కావాలా అనే పాటను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా స్టెప్పులు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి.  రజనీకాంత్ తో కలిసి తమన్నా స్టెప్పులు వేయడం సినిమా పై అంచనాలను మరింత పెంచింది.  కావాలా అనే పాటని శిల్పారావు, అనిరుద్ రవిచంద్రన్ పాడారు. ఈ పాట లిరిక్స్ని అరుణ్ రాజా కామరాజ్ రాశాడు. ఈ పాట అందర్నీ ఇంప్రెస్ చేస్తుంది.ఈ కావాలా అనే పాట ట్రాక్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని ఫాన్స్ అంటున్నారు. రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ మధ్యనే చేశాడు. జైలర్ సినిమాలో రజనీకాంత్ జైలర్ ముత్తు వెల్ పాండ్యన్ గా కనిపిస్తాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రమ్యకృష్ణ, యోగి బాబు లాంటి స్టార్స్ ఉన్నారు. 

ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ప్రోమో కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల అవుతుంది. 

తమన్నా జైలర్ కు ప్లస్ అవుతుందా? 

రీసెంట్ గా జీకర్దా అనే వెబ్ సిరీస్ తో తమన్నా గ్లామర్ గేట్లు తెరిచేసింది, ఇంకా బాయ్ ఫ్రెండ్  విజయ్ వర్మ తో చేసిన లస్ట్ స్టోరీస్ 2 లో మరింత రెచ్చిపోయింది. ఈ రెండు సీరిస్ లతో తమన్నాకుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. తమన్నా జైలర్ సినిమాలో నటిస్తుండడం జైలర్ సినిమాకు ప్లస్సే అవుతుంది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో తో నటించడం తమన్నా కెరీర్ కి కూడా ప్లస్ అవుతుంది. తమన్నా తన కెరీర్ ప్రారంభంలో

చాలా ఎత్తు పలాలు చూసింది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ తమన్నా తొలి సినిమా. ఆ సినిమా తనకు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత చాలాకాలం బ్రేక్ కోసం ఎదురు చూసింది. అదే టైంలో శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ లో నటించింది. ఈ సినిమా విజయంతో తమన్నా ఓవర్ నైట్ స్టార్ అయింది. అక్కడి నుంచి తమన్నా వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్కసారిగా ఇండస్ట్రీలో చాలామందికి తన కాల్ షీట్ దొరకని పరిస్థితి వచ్చింది. రామ్ చరణ్ తో రచ్చ, కార్తితో ఆవారా, నాగచైతన్యతో 100% లవ్ ఇలా అన్ని పెద్ద చిత్రాల్లో తనే కనిపించింది. తమన్నా సమంత లాంటి స్టార్స్ కి మంచి పోటీ ఇచ్చింది. ఇంకా తమన్నా రవితేజతో బెంగాల్ టైగర్, నాగార్జున కార్తీతో కలిసి ఊపిరి లాంటి సినిమాల్లో కూడా నటించింది. తమన్నా తెలుగులో మహేష్ బాబు లాంటి స్టార్స్ హీరోస్తో కూడా నటించింది. జైలర్ సినిమా తమన్నాకు మంచి విజయం అందించాలని కోరుకుందాం.