నటనను మాత్రమే చూడండి వయసుని కాదు: తమన్నా

ప్రస్తుతం తమన్నా తెలుగు తమిళ్ సినిమాలో బిజీగా ఉంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి పక్కన నటించి, మరోపక్క జైలర్ సినిమాలో రజనీకాంత్ పక్కన నటించింది తమన్నా. అయితే ప్రస్తుతం 60 ప్లస్ ఏజ్ ఉన్న నటులతో నటిస్తున్న తమన్న వయసు గురించి వస్తున్న కామెంట్స్ మీద స్పందించింది. అంతే కాకుండా సినిమాలో కనిపిస్తున్న నటీ నటునలు మాత్రమే చూడాలని, వారి వయసు కాదని స్పందించింది తమన్నా. ఒకవేళ వయసు మ్యాటర్ అనుకుంటే, వయస్సు గురించి మాట్లాడవలసి […]

Share:

ప్రస్తుతం తమన్నా తెలుగు తమిళ్ సినిమాలో బిజీగా ఉంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి పక్కన నటించి, మరోపక్క జైలర్ సినిమాలో రజనీకాంత్ పక్కన నటించింది తమన్నా. అయితే ప్రస్తుతం 60 ప్లస్ ఏజ్ ఉన్న నటులతో నటిస్తున్న తమన్న వయసు గురించి వస్తున్న కామెంట్స్ మీద స్పందించింది. అంతే కాకుండా సినిమాలో కనిపిస్తున్న నటీ నటునలు మాత్రమే చూడాలని, వారి వయసు కాదని స్పందించింది తమన్నా. ఒకవేళ వయసు మ్యాటర్ అనుకుంటే, వయస్సు గురించి మాట్లాడవలసి వస్తే, 60 సంవత్సరాల వయస్సులో కూడా టామ్ క్రూజ్ విన్యాసాలు నిజంగా ఆకట్టుకుంటాయని, ఏజ్ గ్యాప్ గురించి క్రిటిక్స్ చేసే వాదనలను కొట్టి పడేసింది తమన్న. 

బోలా శంకర్ సినిమా: 

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం వేదాళం రీమేక్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జతగా నటిస్తూ ఉండగా, మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. బోలా శంకర్ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, మరియు ఉత్తేజ్ కూడా నటించారు.

భారీ అంచనాల మధ్య, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన క్షణం నుంచి ఎన్నో ఆదరాభిమానాలను అందుకుంది అంతేకాకుండా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ పవర్-ప్యాక్డ్ యాక్షన్ అంతే కాకుండా బ్యాగ్రౌండ్ లో వినిపించ మాస్ మ్యూజిక్ ర్యాంపేజ్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. భోళా శంకర్ ఈ సంవత్సరం ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. అదే రోజున విడుదలవుతున్న రజనీకాంత్ జైలర్‌ మూవీకి గట్టి పోటీ ఇవ్వనుంది. 

విజయ్ వర్మ మరియు తమన్నా రిలేషన్‌షిప్ పుకార్లు ప్రారంభమైనప్పటి నుండి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. విజయ్ వర్మ మరియు తమన్నా భాటియాల సంబంధం ఇప్పుడు ఓపెన్ అయింది. వారు తమ రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి, బి-టౌన్‌లో ఇతర గురించి ప్రత్యేకమైన టాపిక్ గా మారింది. ఇప్పుడు, లస్ట్ స్టోరీస్ 2 విడుదల కావడంతో, అభిమానులు వారి అద్భుతమైన కెమిస్ట్రీని తెరపై నేరుగా ఆస్వాదిస్తున్నారు. 

తమన్నా సినిమాలు: 

రజనీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాలో కావాలా అనే పాటను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా స్టెప్పులు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి.  రజనీకాంత్ తో కలిసి తమన్నా స్టెప్పులు వేయడం సినిమా పై అంచనాలను మరింత పెంచింది. 

శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ లో నటించింది తమన్నా. ఈ సినిమా విజయంతో తమన్నా ఓవర్ నైట్ స్టార్ అయింది. అక్కడి నుంచి తమన్నా వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్కసారిగా ఇండస్ట్రీలో చాలామందికి తన కాల్ షీట్ దొరకని పరిస్థితి వచ్చింది. రామ్ చరణ్ తో రచ్చ, కార్తితో ఆవారా, నాగచైతన్యతో 100% లవ్ ఇలా అన్ని పెద్ద చిత్రాల్లో తనే కనిపించింది. తమన్నా సమంత లాంటి స్టార్స్ కి మంచి పోటీ ఇచ్చింది. ఇంకా తమన్నా రవితేజతో బెంగాల్ టైగర్, నాగార్జున కార్తీతో కలిసి ఊపిరి లాంటి సినిమాల్లో కూడా నటించింది. తమన్నా తెలుగులో మహేష్ బాబు లాంటి స్టార్స్ హీరోస్తో కూడా నటించింది. అంతేకాకుండా తను వెబ్ సిరీస్లో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె అకౌంట్లో ఉన్న బోలా శంకర్, జైలర్ సినిమాలు తమన్నాకు మంచి విజయం అందించాలని కోరుకుందాం.