ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన సుస్మిత

తన అందంతో చందంతో ఎంతో మందిని సుస్మితా తన అభిమానులుగా చేసుకుంది. కొంత మంది ఆమె గ్లామర్ మెచ్చి ఫ్యాన్స్‌గా మారితే.. మరికొంత మంది ఆమె నటనకు ముగ్ధులయ్యారు. ఇలా సుస్మితా ఒక్క భాషలో అని కాకుండా.. అనేక భాషల్లో నటించి మెప్పించింది. అక్కడి వారిని తన అభిమానులుగా చేసుకుంది. గుబులు రేపిన గుండెపోటు సుస్మితా సేన్‌కు ఇటీవల గుండె పోటు వచ్చింది. ఈ వార్త బయటకు తెలియగానే ఆమె అభిమానులతో పాటు అందరు సినీ లవర్స్ […]

Share:

తన అందంతో చందంతో ఎంతో మందిని సుస్మితా తన అభిమానులుగా చేసుకుంది. కొంత మంది ఆమె గ్లామర్ మెచ్చి ఫ్యాన్స్‌గా మారితే.. మరికొంత మంది ఆమె నటనకు ముగ్ధులయ్యారు. ఇలా సుస్మితా ఒక్క భాషలో అని కాకుండా.. అనేక భాషల్లో నటించి మెప్పించింది. అక్కడి వారిని తన అభిమానులుగా చేసుకుంది.

గుబులు రేపిన గుండెపోటు

సుస్మితా సేన్‌కు ఇటీవల గుండె పోటు వచ్చింది. ఈ వార్త బయటకు తెలియగానే ఆమె అభిమానులతో పాటు అందరు సినీ లవర్స్ ఎంతో కలత చెందారు. ఎలాగైనా సరే అందాల తార సస్మితా కోలుకుని తిరిగి క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడికి పూజలు చేశారు. తనకు గుండెపోటు వచ్చినపుడు ఏం జరిగిందనేది.. ఈ మధ్య సస్మితా వెల్లడించింది. తన ప్రైవసీని గౌరవించి.. గుండెపోటుతో ముంబై ఆస్పత్రిలో చేరినట్లు ఎవరికీ తెలియకుండా చూసుకున్నందుకు నానావతి ఆస్పత్రి వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆమె గురువారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా.. తనకు కొన్ని రోజుల క్రితం గుండెపోటు వచ్చినట్లు వెల్లడించింది. అప్పటి దాకా ఎవరికీ ఈ విషయం తెలియలేదు. ఈ దునియాలో ఏ చిన్న విషయం జరిగినా కానీ.. సెకండ్లలో తెలిసిపోతుంది. కానీ, సుస్మితా సేన్ వంటి స్టార్‌కు గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో జాయిన్ అయితే అసలు ఎవ్వరికీ విషయం తెలియకపోవడం విశేషం. అంత ప్రైవసీని మెయింటేన్ చేసిన ముంబై నానావతి ఆస్పత్రి సిబ్బందిని ఎంత పొగిడినా తక్కువే  అవుతుంది. అటువంటి సిబ్బందికి సుస్మిత కూడా ధన్యవాదాలు తెలిపింది. యాంజియోప్లాస్టీ, స్టంట్ ప్లేస్‌మెంట్ చేయించుకున్నట్లు ఆమె పేర్కొంది. తనకు సకాలంలో చికిత్స చేసి సిబ్బంది హెల్ప్ చేశారని పేర్కొంది.

హాస్పిటల్ స్టాఫ్ ఎంత మంచివారూ..

సుస్మిత వంటి పెద్ద స్టార్ తమ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకన్నా కానీ.. నానావతి సిబ్బంది ఎక్కడ విషయం బయటకు చెప్పలేదు. ఏ చిన్న విషయం జరిగినా కానీ.. ఈ రోజుల్లో ఇట్టే తెలిసిపోతుంది. అటువంటిది సుస్మిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా సిబ్బంది ఎవరితో కూడా విషయం చెప్పకపోవడం గమనార్హం. అటువంటి సిబ్బందికి థ్యాంక్స్ కాక మరేం చెప్పినా కానీ తక్కువే అవుతుంది. ముంబైలోని నానావతి ఆస్పపత్రిలో మొత్తం వైద్యుల బృందానికి అలాగే భద్రత సిబ్బందికి కూడా ఈ సీనియర్ హీరోయిన్ ధన్యవాదాలు తెలిపింది. తాను ఆస్పత్రిలో చేరిన విషయాన్ని చాలా నిశ్శబ్దంగా, ప్రైవేట్‌గా ఉంచినందుకు వారికి సుస్మిత.. ధ్యానావాదాలు  తెలిపింది. తనకు ట్రీట్‌మెంట్ చేసిన వైద్య సిబ్బందిని, ఆస్పత్రిలో పని చేసే ఇతర సిబ్బందిని గౌరవిస్తున్నట్లు తెలిపింది. ఆమె డిశ్చార్జి అయిన తర్వాత ఆస్పత్రిలో ఉన్న ఐసీయూ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపింది.  

ఆమె ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్టులో సుస్మితా ఇలా రాసుకొచ్చింది. మీకు నా అభినందనలు.. నేను ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని.. తనకు ట్రీట్‌మెంట్ జరుగుతోందని.. ఎవరికీ తెలియకుండా.. నేను డిశ్చార్జ్ అయ్యే వరకు గోప్యతను కాపాడారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనకు ఇష్టమైన కార్డియాలజిస్ట్(గుండె సంబంధిత జబ్బుల డాక్టర్) కోసం కూడా ఒక సందేశాన్ని రాసింది. ఆ కార్టియాలజిస్ట్ ఎంతో విశాలమైన మనసును కలిగి ఉందని చెప్పింది. తనకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా ఇవన్నీ చేసినందుకు ధన్యవాదాలని పేర్కొంది. తాను సేఫ్‌గా ఉండాలని ప్రార్థనలు చేసిన అభిమానులందరికీ సుస్మితా థ్యాంక్స్ చెప్పింది. ఈ పోస్ట్‌లో సుస్మిత చాలా మంది వ్యక్తులకు ధన్యవాదాలు తెలిపింది. తాను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది.