అలియా భట్‌కు సుస్మితా సేన్ మద్దతు

బాలీవుడ్ తారలు ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటారు. దీని కారణంగా వారి వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉండవు. అభిమానులు తమ పరిమితులను మరచిపోవడం,తారల ప్రైవసీని గౌరవించ లేకపోవడం చాలా సార్లు చూసినదే. తాజాగా నటి అలియా భట్‌కు చాలా ఇబ్బందికరమైన సంఘటన జరిగింది. అలియా భట్ యొక్క కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో అలియా తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చూడవచ్చు. ఎవరో తన ఫోటో తీస్తున్నారనే విషయం ఆమెకు పూర్తిగా […]

Share:

బాలీవుడ్ తారలు ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటారు. దీని కారణంగా వారి వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉండవు.

అభిమానులు తమ పరిమితులను మరచిపోవడం,తారల ప్రైవసీని గౌరవించ లేకపోవడం చాలా సార్లు చూసినదే.

తాజాగా నటి అలియా భట్‌కు చాలా ఇబ్బందికరమైన సంఘటన జరిగింది. అలియా భట్ యొక్క కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో అలియా తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చూడవచ్చు. ఎవరో తన ఫోటో తీస్తున్నారనే విషయం ఆమెకు పూర్తిగా తెలియనట్టుగా ఉంది. ఈ చిత్రాలను ఒక మీడియా సంస్థ “ప్రత్యేకమైనవి” అని లీక్ చేసింది.

అలియా భట్ ఈ చిత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రైవసీ గురించి ప్రశ్నలను లేవనెత్తింది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చిత్రాలను పంచుకున్న మీడియా హౌస్ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ, “తమాషా చేస్తున్నారా? నేను నా ఇంట్లో ఉన్నాను, మధ్యాహ్నం నా గదిలో కూర్చున్నాను. అప్పుడు నన్ను ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది. తల ఎత్తి చూసేసరికి పక్కనే ఉన్న బిల్డింగ్ పై కప్పు మీద కెమెరాలు పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఇటువంటి చర్యలను ఎలా సమర్థిస్తారు? ఎలా అనుమతిస్తారు?” అని ప్రశ్నలు వేసింది. ఇది ఒకరి ప్రైవసీపై దాడి అని కూడా అంది. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది కానీ ఈరోజు మీరు అన్ని హద్దులు దాటారు అంటూ.. దీనిపై చర్యలు తీసుకోవలసిందిగా ముంబయి పోలీసులను అలియా భట్ కోరింది. 

ఈ పోస్ట్ విషయంలో పలువురు బాలీవుడ్ తారలు అలియాకు మద్దతు పలుకగా.. అదే ప్రక్రియలో నటి మరియు మాజీ అందాల భామ సుస్మితా సేన్ కూడా ఛాయాచిత్రకారుల సంస్కృతిని విమర్శిస్తూ పోస్ట్ చేసింది.

ప్రైవసీకి సంబంధించిన పోస్ట్ సెలబ్రిటీలకు అపోహ అని పేర్కొంటూ సుస్మిత అలియాకు మద్దతుగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రచయిత హ్యూమా తన్వీర్ రాసిన నోట్‌ను తను షేర్ చేసింది. ఆ పోస్ట్ లో “సెలబ్రిటీల వ్యక్తిగత మరియు సామాజిక జీవితాల మధ్య తరచుగా అస్పష్టమైన రేఖల” గురించి ఉంది.

హ్యూమా రాసిన నోట్‌లో ఇలా ఉంది: ఇంటర్నెట్, టెక్నాలజీ మరియు సోషల్ మీడియా ద్వారా చిన్నదైన ప్రపంచంలో ప్రైవసీ దొరకటం చాలా కష్టం. మీరు ఒక సెలబ్రిటీ అయితే.. అది మరింత ఘోరంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ సంస్కృతి చాలా ఉచ్చస్థితిలో ఉంది. అందువల్ల దాచగలిగేది చాలా తక్కువ.

“మనందరికీ ప్రైవసీ అవసరం ఉన్నందున, సెలబ్రిటీల ప్రైవేట్ మరియు పబ్లిక్ జీవితాల మధ్య తప్పకుండా తేడా ఉండాలి. ఈ విభజన రేఖపై మీడియా చొరబడడం మానుకోవాలి. ఛానెల్ రేటింగ్‌లను పెంచడానికి, గరిష్ట వీక్షకుల సంఖ్యను సంపాదించడానికి ఇటువంటి వార్తలను ఉపయోగించడం ఏ విధంగానూ న్యాయం కాదు” అని కూడా హ్యూమా రాసిన నోట్‌లో ఉంది.

ఆలియా భట్ మంగళవారం సాయంత్రం తన పోస్ట్‌లో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేసింది. తన గోప్యతకు భంగం కలిగించినందుకు, ఫోటోగ్రాఫర్ పై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవలసిందిగా ఖార్ పోలీసులు అలియాను కోరినట్లు వార్తా సంస్థ ఎఎన్ఐ నివేదించింది.

కొన్ని సంవత్సరాల క్రితం, అనుష్క శర్మ కూడా తన అనుమతి లేకుండా తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న చిత్రాలను పంచుకున్నందుకు మీడియా హౌస్‌లను నిందించింది.