Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ కేసులో 36వ వ్యక్తికి బెయిల్

Sushant Singh Rajput: 2020 లాక్ డౌన్ పరిస్థితుల్లో జూన్ నెలలో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput), తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది

Share:

Sushant Singh Rajput: 2020 లాక్ డౌన్ పరిస్థితుల్లో జూన్ నెలలో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput), తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ హీరో కి సంబంధించిన కొన్ని చాట్స్ అనేవి ఇప్పటికీ సిబిఐ చేతులకి అందలేదు. వాటి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నట్లు సిబిఐ అధికారులు ఇటీవల వెల్లడించారు. అయితే ఇటీవల ముంబై హైకోర్టు (High court) తీసుకున్న నిర్ణయం ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) కేసు (Case)లో, డ్రగ్ విషయాలకు సంబంధించి అరెస్ట్ అయినా 36 మందికి బెయిల్ (Bail) మంజూరు చేసింది. 

కేసులో 36వ వ్యక్తికి బెయిల్: 

డ్రగ్స్ (Drugs) కేసు (Case)లో అనుజ్ కేశ్వానీకి బాంబే హైకోర్టు (High court)  శుక్రవారం బెయిల్ (Bail) మంజూరు చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మరణానంతరం డ్రగ్స్ (Drugs) కేసు (Case)లో కేశ్వాని మూడేళ్ల క్రితం అరెస్టయ్యారు. జూన్ 14, 2020న దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో చనిపోయినట్లు గుర్తించిన తర్వాత, 2020 నుండి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఈ కేసు (Case)ను దర్యాప్తు ముమ్మరం చేసింది. ముంబయిలోని ఖార్‌లో నివాసం ఉంటున్న కేశ్వాని (31)ని 2020 సెప్టెంబర్‌లో డ్రగ్స్ (Drugs) చలామణి చేస్తున్న ఆరోపణలపై అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ (Drugs) అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం, నిందితుడు అటువంటి నేరానికి పాల్పడలేదని విశ్వసించడానికి కారణాలు ఉన్నాయని, కోర్టు సంతృప్తిగా లేనప్పటికీ నిందితుడికి, జస్టిస్ కార్నిక్ బెయిల్ (Bail) మంజూరు చేయడం జరిగింది

 

ఈ కేసు (Case)లో నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్‌తో సహా మొత్తం 36 మంది నిందితులుగా ఉన్నారు. చక్రవర్తిలు.. 33 మంది ఇతర నిందితులకు వివిధ కోర్టులు బెయిల్ (Bail) మంజూరు చేయగా, ఎన్‌సిబి దాడిలో అతని నివాసంలో డ్రగ్స్ (Drugs) దొరకడంతో ఇప్పటివరకు కేశ్వాని కస్టడీలోనే ఉన్నారు. జితేంద్ర జైన్, మహ్మద్ ఆజం జుమ్మన్ షేక్ అని ఇద్దరు నిందితులకు 2022లో జస్టిస్ కార్నిక్ ద్వారా బెయిల్ (Bail) మంజూరు చేయడం జరిగింది. 

సుశాంత్ సింగ్ ఆత్మహత్య : 

2020 లాక్ డౌన్ (Lockdown) పరిస్థితుల్లో జూన్ నెలలో, సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్, తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ హీరో కి సంబంధించిన కొన్ని చాట్స్ అనేవి ఇప్పటికీ సిబిఐ చేతులకి అందలేదు. వాటి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నట్లు సిబిఐ అధికారులు ఇటీవల వెల్లడించారు. 

 

సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్ తొలగించిన చాట్‌లు, పోస్ట్‌లు మరియు ఇమెయిల్‌లకు సంబంధించిన వివరాలను కోరుతూ, 2021లో సోషల్ మీడియా దిగ్గజాలను CBI అధికారిక అభ్యర్థనను పంపింది. అయితే వాటిని ఇప్పటికీ పొందలేనట్టు సిబిఐ అధికారులు ఇటీవల వెల్లడించారు. సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్ సూసైడ్ కేసు (Case విషయంలో, ఫేస్‌బుక్ మరియు గూగుల్ నుండి ప్రతిస్పందనల కోసం తాము ఇంకా ఎదురుచూస్తున్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తెలిపింది. సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్ తొలగించిన చాట్‌లు, పోస్ట్‌లు మరియు ఇమెయిల్‌లకు సంబంధించిన వివరాలను కోరుతూ, 2021లో సోషల్ మీడియా దిగ్గజాలను CBI అధికారిక అభ్యర్థనను పంపింది. ఈ సోషల్ మీడియాలో డిలీట్ చేయబడిన సుశాంత్ రాజ్ పుత్ ఛాట్స్ ఆధారాల ద్వారా, జూన్ 2020లో నిజంగా ఏమి జరిగి ఉంటుందో, అసలు సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తప్పకుండా తెలుసుకోవచ్చని ఆలోచనలో ఉంది. సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) ఆత్మహత్య (Suicide) అనంతరం కొన్ని అభయోగాలు కారణంగా రియా చక్రబోర్తి (Rhea Chakraborty) తీవ్ర విమర్శలకు గురైంది. అంతేకాకుండా డ్రగ్స్ (Drugs) కేసు (Case విషయంలో, ఆమె 28 రోజులు జైలు (Jail) జీవితాన్ని గడపాల్సి వచ్చింది.