ఇంకా వీడని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్టరీ

2020 లాక్ డౌన్ పరిస్థితుల్లో జూన్ నెలలో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ హీరో కి సంబంధించిన కొన్ని చాట్స్ అనేవి ఇప్పటికీ సిబిఐ చేతులకి అందలేదు. వాటి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలగించిన చాట్‌లు, పోస్ట్‌లు మరియు ఇమెయిల్‌లకు సంబంధించిన వివరాలను కోరుతూ, 2021లో సోషల్ మీడియా దిగ్గజాలను CBI అధికారిక అభ్యర్థనను పంపింది. అయితే […]

Share:

2020 లాక్ డౌన్ పరిస్థితుల్లో జూన్ నెలలో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ హీరో కి సంబంధించిన కొన్ని చాట్స్ అనేవి ఇప్పటికీ సిబిఐ చేతులకి అందలేదు. వాటి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలగించిన చాట్‌లు, పోస్ట్‌లు మరియు ఇమెయిల్‌లకు సంబంధించిన వివరాలను కోరుతూ, 2021లో సోషల్ మీడియా దిగ్గజాలను CBI అధికారిక అభ్యర్థనను పంపింది. అయితే వాటిని ఇప్పటికీ పొందలేనట్టు సిబిఐ అధికారులు వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు విషయంలో, ఫేస్‌బుక్ మరియు గూగుల్ నుండి ప్రతిస్పందనల కోసం తాము ఇంకా ఎదురుచూస్తున్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తెలిపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలగించిన చాట్‌లు, పోస్ట్‌లు మరియు ఇమెయిల్‌లకు సంబంధించిన వివరాలను కోరుతూ, 2021లో సోషల్ మీడియా దిగ్గజాలను CBI అధికారిక అభ్యర్థనను పంపింది. ఈ సోషల్ మీడియాలో డిలీట్ చేయబడిన సుశాంత్ రాజ్ పుత్ ఛాట్స్ ఆధారాల ద్వారా, జూన్ 2020లో నిజంగా ఏమి జరిగి ఉంటుందో, అసలు సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తప్పకుండా తెలుసుకోవచ్చని ఆలోచనలో ఉంది.

” 2021లో, సుశాంత్ కి సంబంధించిన చాట్స్ గురించి సోషల్ మీడియా దిగిజాలను అడగడం జరిగింది కానీ, ఇప్పటికీ US నుండి రాబోయే రిప్లై కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాము, ఇది తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఇది కేసు క్లోజ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. కేసు ప్రస్తుతానికి, దీని కారణంగానే ఇంకా పెండింగ్‌లో ఉంది” అని ఒక సీబీఐ అధికారి తెలిపారు. 

దేవేంద్ర ఫడ్నవీస్ మాటల్లో:

ఈ కేసులో సాక్ష్యాధారాల పరిశీలిస్తున్నామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంలో మాట్లాడుతూ, “మొదట, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. అయితే, ఈ కేసుకు సంబంధించి తమ వద్ద గణనీయమైన సాక్ష్యాలు ఉన్నాయని కొందరు వ్యక్తులు నొక్కి చెప్పారు. ఇదే నేపథ్యంలో, మేము వారిని సంప్రదించి, సాక్ష్యాలను పోలీసులకు సమర్పించమని చెప్పడం కూడా జరిగింది, ”అని అతను రిపబ్లిక్‌కి చెప్పారు.

“ప్రస్తుతం, మేము సమర్పించిన సాక్షాలు అనేవి ప్రస్తుతానికి ఎంతవరకు భరత్ అనే నేను పరిశీలించే పనిలో ఉన్నాము. నిజానికి దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా దర్యాప్తు జరుగుతున్న సమయంలో, మరిన్ని విషయాలు నేను తెలియజేయాలనుకోవట్లేదు, ”అని రాజకీయవేత్త చెప్పారు. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం:

జూన్ 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ నేపథ్యంలో అక్కడ ముంబై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైన తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లను రప్పించారు. అయితే మూడు సంవత్సరాల అయినప్పటికీ ఇంకా ఈ కేసులో పురోగతి కనిపించకపోవడం గమనార్హం. నిజానికి అప్పట్లో సుశాంత్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు కూడా తీయడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికి, సుశాంత్ తమ ప్రేక్షకులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. 2020లో సుశాంత్ మరణ విషయం వినగానే చాలామంది దుఃఖంలో మునిగిపోయారు. ఇండియాలోనే కాకుండా పలు దేశాలలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు చనిపోయాడు అతనికి న్యాయం జరిగేలా నినాదాలు కూడా వినిపించాయి. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన సినిమాలు: 

ఎంఎస్ ధోని, చిచ్చోరే, కేదార్నాథ్, రాబతా, చందమామ దుర్గే, సంచరియా, షుడ్ దేశి రొమాన్స్, చివరి సినిమా దిల్ బేచారా.