బోయపాటితో సూర్య సినిమా చేయబోతున్నారా?

బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ కి సంబంధించి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక తమిళ్ స్టార్ సూర్య సినిమాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో ఆచితూచి ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక వైవిధ్యమైన కథనం కనిపిస్తే సూర్య తప్పకుండా ముందుకు వెళ్తాడు అన్న సంగతి తెలిసిందే. సింగం హీరో సూర్య బోయపాటి శ్రీను తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  బోయపాటితో సూర్య క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా […]

Share:

బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ కి సంబంధించి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక తమిళ్ స్టార్ సూర్య సినిమాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో ఆచితూచి ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక వైవిధ్యమైన కథనం కనిపిస్తే సూర్య తప్పకుండా ముందుకు వెళ్తాడు అన్న సంగతి తెలిసిందే. సింగం హీరో సూర్య బోయపాటి శ్రీను తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

బోయపాటితో సూర్య క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా ?

తమిళ్లో సూర్యకు బీభత్సమైన క్రేజ్ ఉంది, సింగం సినిమా ఫ్రాంచైజ్ తో సూర్యకు బీభత్సమైన మాస్ క్రేజ్ ఉంది. ఇప్పుడు సూర్య కొత్త చిత్రం కోసం బోయపాటి శ్రీను తో చేతులు కలపబోతున్నాడని అంటున్నారు. ఈ బజ్ ఇంటర్నెట్లో బీభత్సమైన క్రేజ్ ని క్రియేట్ చేసింది. ఫాన్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూర్య, బోయపాటి సినిమా అనగానే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సింగం సినిమాలతో సూర్య మాస్ ప్రేక్షకులను బాగా అలరించాడు. బోయపాటి శ్రీను అంటేనే మాస్ సినిమాలు. బోయపాటి శ్రీనుతో సూర్య సినిమా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. కానీ ఈ సినిమా కన్ఫార్మ్ ఐతే మాస్ అభిమానులకు పండగే అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఈ సినిమాకి తెలుగులో, తమిళంలో మంచి క్రేజ్ వస్తుంది.

సూర్య, బోయపాటి ల అప్ కమింగ్ ప్రాజెక్ట్స్

సూర్య ప్రస్తుతం కంగువా అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా 2d ,3d వెర్షన్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పది భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇక బోయపాటి విషయానికొస్తే తను డైరెక్ట్ చేసిన స్కంద రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాలో రామ్ పోతినేని , శ్రీ లీల జంటగా నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా  మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కి రెడీగా ఉంది. స్కంద సినిమాలో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేస్తున్నారనే బజ్ ఉంది.

బోయపాటి శ్రీను  ఫిల్మోగ్రఫీ

భద్ర అనే సినిమాతో బోయపాటి శ్రీను డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమాలో హీరోగా రవితేజ నటించాడు, ఈ సినిమాలో మీరాజాస్మిన్ హీరోయిన్. భద్ర సినిమాతో బోయపాటి శ్రీను తనకంటూ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు. లవ్ స్టోరీ లో మాస్ ని మిక్స్ చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. బోయపాటి శ్రీను రెండో సినిమా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తులసి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఈ సినిమా వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని అందించింది. ఇక బోయపాటి మూడో సినిమా సింహా ఈ సినిమాలో బాలకృష్ణ హీరో. హీరోయిన్ గా నయనతార నటించింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సింహా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేసింది. ఇక బోయపాటి నాల్గవ సినిమా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. 

ఇక బోయపాటి ఐదవ చిత్రం లెజెండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. బోయపాటి శ్రీను సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే పేరు ఉంది. సూర్యతో, బోయపాటి శ్రీను  సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. అలాగే త్వరలో రిలీజ్ అవుతున్న స్కంద కు ఆల్ ద బెస్ట్.