నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది ఆయనే: సుప్రియ

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేమస్ గా మారింది. యూట్యూబ్ లో తాను చేసిన కొన్ని వీడియోస్ ద్వారా, నాగచైతన్య తో కలిసి ఫుడ్ బ్లాగ్ వంటివి చేయడం ద్వారా ఇటీవల కాలంలో ఆమె పేరు తెలియని వారు లేరు. ఈ మధ్యకాలంలో ఆమె కన్నడ సినిమా బాయ్స్ హాస్టల్ ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాలనుకుంది. అయితే ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి […]

Share:

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేమస్ గా మారింది. యూట్యూబ్ లో తాను చేసిన కొన్ని వీడియోస్ ద్వారా, నాగచైతన్య తో కలిసి ఫుడ్ బ్లాగ్ వంటివి చేయడం ద్వారా ఇటీవల కాలంలో ఆమె పేరు తెలియని వారు లేరు. ఈ మధ్యకాలంలో ఆమె కన్నడ సినిమా బాయ్స్ హాస్టల్ ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాలనుకుంది. అయితే ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి కన్నడలో కాకుండా తెలుగు రాష్ట్రాలలో నాగచైతన్య తరఫునుంచి కూడా ప్రమోషన్ అయితే జరిగింది. పెద్ద బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ వారు కన్నడ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు సపోర్ట్ చేశారు. 

అన్నపూర్ణ స్టూడియోస్ కి థాంక్స్ చెప్పిన సుప్రియ: 

బాయ్స్ హాస్టల్ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం తనకి చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు తనకు ఎంతగానో సహాయపడిన అన్నపూర్ణ స్టూడియోస్ కి థాంక్స్ చెప్పింది సుప్రియ. అంతేకాకుండా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ వారికి, అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి చిన్న సినిమాల ద్వారా మంచి మోటివేషన్ అందించేందుకు తనకి ఎంతగానో సపోర్ట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ ఆలోచన చాలా గొప్పది అంటూ మాట్లాడారు సుప్రియ. 

ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ గురించి నాగచైతన్య చాలా కృషి చేసాడని తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలకు దూరం చేయకుండా మరింత దగ్గర చేయడానికి తనవంతు సహాయం చేశాడని, నాగచైతన్య గురించి చెప్పుకొచ్చింది సుప్రియ. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవడానికి నాగచైతన్య చేసిన ప్రమోషన్ తనకి ఎంతగానో సహాయపడిందని, లేదంటే చిన్న సినిమాలు ప్రమోషన్ కోసం మరింత కష్టపడాల్సి వచ్చేది అంటూ మాట్లాడారు. 

శనివారం రోజున రిలీజ్: 

బాయ్స్ హాస్టల్ సినిమా ప్రత్యేకించి విద్యార్థులకు సంబంధించింది కాబట్టి, ఎక్కువగా విద్యార్థులు ఇటువంటి సినిమాలను చూసేందుకు మక్కువ చూపిస్తారు కాబట్టి, విద్యార్థులు ఖాళీగా ఉన్న సమయంలోనే బాయ్స్ హాస్టల్ సినిమా రిలీజ్ అవ్వాలని తాము నిర్ణయించుకున్నట్టు తెలిపింది సుప్రియ. అందుకే రిలీజ్ డేట్ శనివారం పూట వచ్చేటట్లు ప్లాన్ చేసామని చెప్పింది. ముఖ్యంగా విద్యార్థులు తప్పకుండా చూడవలసిన సినిమా బాయ్స్ హాస్టల్ అని, ఈ సినిమా ద్వారా విద్యార్థులు ఎంతో కొంత నేర్చుకుంటారని ఆమె తాపత్రయ పడింది. అందుకే విద్యార్థులు ఎక్కువగా చూసే ఈ సినిమా మాక్సిమం అన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యేలా చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 

నాగార్జున సపోర్ట్: 

అన్నపూర్ణ స్టూడియోస్ కి వెన్నుముక్కగా ఉన్న నాగార్జున తనకి ఎంతగానో సపోర్ట్ ఇచ్చారని మాట్లాడింది సుప్రియ. తప్పకుండా అవకాశం దొరికితే ఆయనతో కూడా వర్క్ చేయాలి అనేది తన కోరిక అని చెప్పింది. ఆయన తమ బ్యానర్ లోనే కాకుండా ఇతర బ్యానర్లను కూడా ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తాడని, మంచి స్క్రిప్ట్ దొరికితే మళ్ళీ తాను నాగచైతన్యా, నిఖిల్ తో కలిసి సినిమా చేసే ఆలోచన ఉంది అంటూ నాగార్జున సినిమాలు గురించి మాట్లాడుతూ తమ ఆలోచన బయటపెట్టింది సుప్రియ. 

నేషనల్ అవార్డు హవా: 

తెలుగు సినిమాలకి నేషనల్ అవార్డ్స్ వచ్చినందుకు సుప్రియ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. RRR సినిమా ప్రత్యేకంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి ఆస్కార్ గెలుచుకున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసింది సుప్రియ. అంతేకాకుండా పుష్ప సినిమాలో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్కి, తనవైపు నుంచి అభినందనలు తెలిపింది.