హీరోయిన్ గా అడుగు పెట్టక ముందే బ్రాండ్ అంబాసిడర్ గా షారుక్ ఖాన్ కూతురు సుహానా

షారుక్ ఖాన్ కూతురుగా సుహానా ఖాన్ అందరికీ సుపరిచితమే.. ఇప్పటికే బాలీవుడ్ పార్టీలో కనిపిస్తూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని విపరీతంగా పెంచుకుంది.. త్వరలోనే ది ఆచరిస్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనుంది సుహానా.. కాగా హీరోయిన్ అవ్వకముందే సుహానా ఖాన్ ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైంది.. మేకప్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్ మేబెల్‌లైన్‌ […]

Share:

షారుక్ ఖాన్ కూతురుగా సుహానా ఖాన్ అందరికీ సుపరిచితమే.. ఇప్పటికే బాలీవుడ్ పార్టీలో కనిపిస్తూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని విపరీతంగా పెంచుకుంది.. త్వరలోనే ది ఆచరిస్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనుంది సుహానా.. కాగా హీరోయిన్ అవ్వకముందే సుహానా ఖాన్ ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైంది.. మేకప్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్ మేబెల్‌లైన్‌ కు సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల నియమితమైంది.. కాగా మేబెల్‌లైన్‌ కి సంబంధించిన ఓ ఈవెంట్ ను నిర్వహించగా అందులో సుహానా ఈ యాడ్ కి నటించిన ఓ వీడియోను రిలీజ్ చేసి, సుహానా ఖాన్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ ఈవెంట్ లో రెడ్ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా కనిపించింది సుహనా.. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్లందరినీ తన మాటలతో అట్రాక్ట్ చేసింది. పద్ధతిగా మాట్లాడి సుహానా ఖాన్ అందర్నీ మెప్పించింది. బాలీవుడ్ స్టార్ కిడ్ అయినా కూడా చాలా చక్కగా మాట్లాడటంతో సుహానాకి మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా సుహానా మొదటిసారి స్టేజి మీద మాట్లాడిన కూడా ఏమాత్రం తడబాటు లేకుండా తను చెప్పాలనుకున్న మాటలను సూటిగా స్పష్టంగా చెప్పేసింది. దాంతో ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. షారుక్ అభిమానులు సుహానాని తెగ పొగిడేస్తున్నారు. సుహానా ఇలా ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా నిలవడం మొదటిసారి స్టేజిపై చాలా పద్ధతిగా మాట్లాడడం అందరూ సుహానాన్ని అభినందిస్తున్నారు.

 ఈ వీడియో పై షారుక్ ఖాన్ కూడా స్పందించారు. తన కూతుర్ని ఉద్దేశిస్తూ ఈ ఈవెంట్లో తన కూతురికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి ఎమోషనల్ వర్డ్స్ రాసుకొచ్చారు. షారుక్ తన కూతురు సుహానా ఖాన్ వీడియోని షేర్ చేసి మేబెల్‌లైన్‌ యాడ్ కు నా అభినందనలు. బేటా.. చాలా చక్కగా దుస్తులు ధరించావు, చాలా బాగా మాట్లాడావు, బాగా నటించావు, నేను కూడా ఇందులో కొంచెం క్రెడిట్ తీసుకుంటాను. నేను నిన్ను చాలా బాగా పెంచాను కాబట్టి. లవ్ యు మై లిటిల్ లేడీ అని పోస్ట్ చేశారు షారుక్ ఖాన్. తండ్రి షారుక్ ఖాన్ చేసిన ఈ పోస్ట్ కి సుహానా కూడా స్పందిస్తూ.. సో క్యూట్ అంటూ రిప్లై ఇచ్చింది. దాంతో అభిమానులు నెటిజన్లు సుహానా తో పాటు షారుక్ ని కూడా పొగిడేస్తున్నారు. ఇద్దరినీ అభినందిస్తూ సోషల్ మీడియాలో వరుస కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కళ్ళముందే కన్న కూతురు ఎదుగుదల చూసిన తండ్రిగా షారుఖ్ ఖాన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.