SSMB29 మహేష్ పోస్టర్ రిలీజ్ కి సిద్ధం 

మహేష్ బాబు తన రాబోయే అడ్వెంచర్ SSMB29 సినిమా ఆగస్టు 9న, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ కానుంది. వి విజయేంద్ర ప్రసాద్, తన స్క్రిప్ట్ గురించి ఇటీవల అప్డేట్ ఇచ్చారు.  మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా ఈ పోస్టర్లో మహేష్ బాబు లుక్ ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని, ఫాన్స్ పోస్టర్ గురించి ఆసక్తిగా ఎదురు చూడాలని సినిమా వర్గాలు వెల్లడించాయి. […]

Share:

మహేష్ బాబు తన రాబోయే అడ్వెంచర్ SSMB29 సినిమా ఆగస్టు 9న, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ కానుంది. వి విజయేంద్ర ప్రసాద్, తన స్క్రిప్ట్ గురించి ఇటీవల అప్డేట్ ఇచ్చారు.  మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా ఈ పోస్టర్లో మహేష్ బాబు లుక్ ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని, ఫాన్స్ పోస్టర్ గురించి ఆసక్తిగా ఎదురు చూడాలని సినిమా వర్గాలు వెల్లడించాయి.

“నాటు నాటు” పాటలకు ఆస్కార్‌ను గెలుచుకుని, ప్రపంచాన్ని “నాటు నాటు” పాటకు డాన్స్ వేయించిన తర్వాత, తండ్రీ కొడుకులు V విజయేంద్ర ప్రసాద్ మరియు SS రాజమౌళి తమ అభిమానులకు మరో అద్భుతమైన చక్కని కథను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఐకానిక్ హాలీవుడ్ ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్ తరహాలో తమ తదుపరి చిత్రం స్క్రిప్ట్ జూలై నాటికి పూర్తవుతుందని ఇటీవలి ఇంటరాక్షన్‌లో ప్రసాద్ వెల్లడించారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ మహేష్ బాబు మెయిన్ రోల్లో నటించనున్నారు. 

సినిమా గురించి  విజయేంద్ర మాటల్లో: 

RRR మరియు బాహుబలి ఫ్రాంచైజ్కి ఏమాత్రం తగ్గకుండా, ప్రసాద్రా ద్వారా బోయే యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో కూడా SS రాజమౌళి చిత్రీకరణ చాలా చక్కగా కనిపిస్తుంది. మిడ్-డేతో ఇంటరాక్షన్ సందర్భంగా, ప్రసాద్ సినిమా ఫ్రాంచైజీగా మారే అవకాశం ఉంది అని కూడా పంచుకున్నారు. అంతే కాకుండా, “ఇది ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలో ఉంటుంది. ఇది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ [1981] వంటి అనేక రకాల ఫీలింగ్స్తో కూడిన అడ్వెంచర్-యాక్షన్ డ్రామా అవుతుంది. జూలై నాటికి నా స్క్రిప్ట్ పూర్తి కావాలి, ఆ తర్వాత, మేము దీన్ని ఫ్రాంచైజీగా చేయాలని అనుకుంటున్నాము, కానీ ఎవరికి తెలుసు? మేము క్లైమాక్స్‌ను ఓపెన్-ఎండ్‌గా వదిలివేస్తున్నాము, ఎందుకంటే మాకు కూడా దీనికి సీక్వెల్ తీసే ఆలోచన ఉంది.” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

సెప్టెంబర్ 2022లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో రాజమౌళి మహేష్ బాబుతో తన తదుపరి చిత్రం ప్రపంచాన్ని ఆకర్షితులను చేసే ఒక ప్రత్యేకమైన యాక్షన్-అడ్వెంచర్ అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ “మహేష్ బాబుతో నా నెక్స్ట్ రాబోయే చిత్రం గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్‌గా ఉంటుంది. ఇది భారతీయ మూలాలతో జేమ్స్ బాండ్ అలాగే ఇండియానా జోన్స్ సినిమాలా మీ ముందుకు రాబోతుంది.” అని చెప్పారు.

V విజయేంద్ర ప్రసాద్ మొదటిసారిగా 2021లో జంగిల్ అడ్వెంచర్ ఆలోచన గురించి చాలా ఆసక్తిగా కొన్ని విషయాలను పంచుకున్నారు. పింక్‌విల్లాతో మాట్లాడుతున్న మాటల్లో, అతను ఇలా అన్నాడు, “ప్రస్తుతం దాని గురించి మాట్లాడేందుకు చాలా ఆత్రుతగా ఉందని, అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్, మహేష్ బాబు పుట్టినరోజున విడుదల కానుండని వెల్లడించారు. మహేష్ బాబు చివరిసారిగా ‘సర్కారు వారి పాట’లో కనిపించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా తెరకెక్కనున్న గుంటూరు కారం విడుదల కోసం మహేష్  ప్రస్తుతం ఎదురుచూస్తున్నాడు. త్రివిక్రమ్‌ డైరెక్షన్లో మహేష్‌ సినిమా రావడం ఇది మూడోసారి. 

మహేష్ సినిమా వివరాలు:

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే “గుంటూరు కారం” సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే ప్రజెక్టు నుంచి తప్పుకున్నాక ఆమె స్థానంలో మీనాక్షి చౌదరితో టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించింది. శ్రీలీల తొలి కథానాయిక అని టాక్. ఎస్ థమన్ సంగీత స్వరకర్త.