ప్రభాస్ ‘కల్కి 2898 AD’ గ్లిమ్స్ పై రాజమౌళి ప్రశంసల వర్షం

హిట్టు కోసం ఆకలితో ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ : ‘బాహుబలి’ సిరీస్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిలించింది. రీసెంట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం కూడా భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. దీనితో ప్రభాస్ కి ఇప్పుడు అర్జెంటు గా ఒక్క హిట్ కావలి. ఫ్యాన్స్ ఆయన నుండి బాహుబలి […]

Share:

హిట్టు కోసం ఆకలితో ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ :

‘బాహుబలి’ సిరీస్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిలించింది. రీసెంట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం కూడా భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. దీనితో ప్రభాస్ కి ఇప్పుడు అర్జెంటు గా ఒక్క హిట్ కావలి. ఫ్యాన్స్ ఆయన నుండి బాహుబలి రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్  ని ఆశిస్తున్నారు. ప్రభాస్ ఆబొయ్యే రెండు సినిమాలు ‘సలార్’ , ‘కల్కి 2898’ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. ‘సలార్’ చిత్రం మీద అభిమానుల్లో మరియు ట్రేడ్ లో ఎప్పటి నుండో గట్టి నమ్మకం ఉంది కానీ, ‘ప్రాజెక్ట్ K’  అలియాస్ ‘కల్కి 2898’ పై ఆ రేంజ్ అంచనాలు లేవు. కారణం ఈ సినిమాకి దర్శకుడు కొత్తవాడు అవ్వడం వల్లే.

కల్కి గ్లిమ్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ :

ఈ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ గతం లో ‘మహానటి’ అనే సినిమా తీసాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకుంది. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ కానీ, ఒక స్టార్ హీరో సినిమాని మ్యానేజ్ చేయగలడా?, గతం లో సుజిత్ కి కూడా ‘రన్ రాజా రన్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. కానీ ‘సాహూ’ లాంటి భారీ బడ్జెట్ మూవీ ని మ్యానేజ్ చెయ్యలేకపోయాడు. అలాగే నాగ అశ్విన్ ఈ భారీ బడ్జెట్ ‘ప్రాజెక్ట్ K’ ని సరిగా హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానం అభిమానులతో పాటుగా , ప్రేక్షకుల్లో కూడా ఉండేది. మొన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఘోరమైన నెగటివ్ రెస్పాన్స్ రావడం తో, ఈ సినిమా కూడా ఎత్తిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే గ్లిమ్స్ వీడియో వచ్చిందో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ లో ఉన్న అంచనాలు మొత్తం మారిపోయాయి.

కల్కి గ్లిమ్స్ పై రాజమౌళి ప్రశంసల వర్షం :

అభిమానుల దగ్గర నుండి సినీ సెలెబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు ఈ గ్లిమ్స్ వీడియో పై ప్రశంసల వర్షం కురిపించారు. వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకడు. ట్విటర్ లో ఆయన ఈ గ్లిమ్స్ వీడియో పై స్పందిస్తూ ‘ కల్కి టీజర్ అద్భుతంగా ఉంది, ఒక కొత్త డైరెక్టర్ అయ్యుండి కూడా ఈ రేంజ్ విజన్ తో సినిమా తియ్యడం అనేది మామూలు విషయం కాదు, మా డార్లింగ్ ప్రభాస్ అదరగొట్టేసాడు,అంత బానే ఉంది కానీ విడుదలతేదీ ఎప్పుడు?’ అని ఒక ట్వీట్ వేసాడు. దీనికి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రిప్లై ఇస్తూ ‘ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎవరు అడుగుతున్నారో ఒకసారి చూడండి’ అని అంటాడు. దానికి రాజమౌళి ఫన్నీ గా బ్రహ్మానందం గిఫ్ రిప్లై ఇస్తాడు. విజన్ కి తగ్గట్టు ఔట్పుట్ రప్పించుకోవడం లో రాజమౌళి ని మించిన డైరెక్టర్ ఇండియాలోనే లేడు. అలాంటి డైరెక్టర్ నుండి నాగ అశ్విన్ విజన్ విషయం లో ప్రశంసలు అందుకున్నదంటే మామూలు విషయం కాదు. చూడాలి మరి ఈ సినిమా తో నాగ అశ్విన్ ఎన్ని అద్భుతాలు సృష్టించబోతున్నాడు అనేది. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 14 వ తేదీన విడుదల చేద్దాం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండడం తో సమ్మర్ దాకా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.