కొత్త రికార్డ్స్ సృష్టించిన మహేష్ బాబు శ్రీమంతుడు 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా, శ్రీమంతుడు, 2015లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు శ్రీమంతుడు మూవీ ఒక కొత్త చరిత్రను సృష్టించింది.  రికార్డ్ సృష్టించిన శ్రీమంతుడు:  ఎనిమిది సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైన […]

Share:

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా, శ్రీమంతుడు, 2015లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు శ్రీమంతుడు మూవీ ఒక కొత్త చరిత్రను సృష్టించింది. 

రికార్డ్ సృష్టించిన శ్రీమంతుడు: 

ఎనిమిది సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన ఈ శ్రీమంతుడు సినిమా, మరో కొత్త రికార్డ్ సృష్టించడం జరిగింది. యూట్యూబ్ లో ప్రస్తుతం ఈ సినిమా పూర్తిగా చూసిన వారి సంఖ్య 200 మిలియన్లకు చేరిందంటే, శ్రీమంతుడు సినిమా ఎంత పాపులర్ హిట్ అయిందో, ఎంతటి రికార్డు సొంతం చేసుకుందో చెప్పనవసరం లేదు. అంతేకాకుండా యూట్యూబ్ లో పెట్టిన తెలుగు సినిమాలలో శ్రీమంతుడు సినిమా ఎక్కువగా లైక్స్ పొందింది. 8 సంవత్సరాల క్రితం ప్రేక్షకులను ఎంతో అలరించిన శ్రీమంతుడు ప్రస్తుతం యూట్యూబ్ లో పాపులర్ అవడం నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన ఆనందాన్ని తెచ్చి పెట్టింది. మరో పక్క సినిమా సిబ్బంది కూడా తాము తీసిన శ్రీమంతుడు సినిమా ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా మరోచరిత్ర సృష్టించడం అదృష్టం అంటూ, తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సినిమా నిజానికి ఒక పల్లెటూరు వాతావరణం గుర్తుచేస్తుంది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తన తండ్రి పుట్టిన ఊరుని దత్తత తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ఊరిని బాగుపరచాలని తాపత్రయంతో తాను చేసిన కృషి అందరికీ కనిపిస్తుంది. ఈ సినిమా ప్రత్యేకించి పల్లె వాతావరణం గుర్తు చేయడమే కాకుండా, పల్లెటూరు ప్రత్యేకతలను మానవ బంధాలను మరొకసారి గుర్తు చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన శృతిహాసన్, శృతిహాసన్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. 

మహేష్ బాబు సినిమాతో పోటీపడనున్న మరిన్ని సినిమాలు:

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే “గుంటూరు కారం” సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే ప్రజెక్టు నుంచి తప్పుకున్నాక ఆమె స్థానంలో మీనాక్షి చౌదరితో టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించింది. శ్రీలీల తొలి కథానాయిక అని టాక్. ఎస్ థమన్ సంగీత స్వరకర్త. 

మహేష్ బాబు తన రాబోయే అడ్వెంచర్ SSMB29 సినిమా ఆగస్టు 9న, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ అవ్వడమే కాకుండా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. వి విజయేంద్ర ప్రసాద్, తన స్క్రిప్ట్ గురించి ఇటీవల అప్డేట్ ఇచ్చారు.  మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా ఈ పోస్టర్ లో మహేష్ బాబు లుక్ ముందు ఎప్పుడూ చూడనట్టి విధంగా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందని మహేష్ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుండగా, ఇప్పుడు కొత్తగా నాగార్జున సినిమా కూడా దీనికి పోటీగా విడుదలవుతుంది. సంక్రాంతికి రవితేజ ఈగల్ కూడా వస్తుందని అంటున్నారు. అలాగే ప్రభాస్ కల్కి కూడా సంక్రాంతికి రెడీగా ఉందని అంటున్నారు. ఈసారి సంక్రాంతి పోటీ భారీగానే ఉంటుందనిపిస్తుంది. టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీ భారీగానే ఉంటుంది. ఈసారి అది మరింత పెరిగింది. నాగార్జున, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్లు తమ సినిమాలను సంక్రాంతికి రెడీగా ఉంచడంతో సినిమా లవర్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు.