శ్రీకాంత్ అడ్డాల స్ట్రాటజీ మార్చాల్సిందేనా.. 

శ్రీకాంత్ అడ్డాల సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలన్నీ కూడా ప్రత్యేకించి ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయి ఉంటాయి. కానీ శ్రీకాంత్ అడ్డాల ఇటీవల తీసిన కొన్ని యాక్షన్ చిత్రాలు అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాయి అని చెప్పుకోవాలి. అందుకే శ్రీకాంత్ అడ్డాల తప్పకుండా తమ స్ట్రాటజీ మార్చి కుటుంబ కథ చిత్రాల మీద ఎక్కువగా దృష్టి పెడితే బాగుంటుంది అని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడుతున్నారు.  యాక్షన్ కలిసి రాలేదు:  తన తాజా యాక్షన్ […]

Share:

శ్రీకాంత్ అడ్డాల సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలన్నీ కూడా ప్రత్యేకించి ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయి ఉంటాయి. కానీ శ్రీకాంత్ అడ్డాల ఇటీవల తీసిన కొన్ని యాక్షన్ చిత్రాలు అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాయి అని చెప్పుకోవాలి. అందుకే శ్రీకాంత్ అడ్డాల తప్పకుండా తమ స్ట్రాటజీ మార్చి కుటుంబ కథ చిత్రాల మీద ఎక్కువగా దృష్టి పెడితే బాగుంటుంది అని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడుతున్నారు. 

యాక్షన్ కలిసి రాలేదు: 

తన తాజా యాక్షన్ చిత్రం ‘పెద్ద కాపు’ బాక్సాఫీస్ వద్ద తన ముందు సినిమాల లాగా ఆడలేనందున, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన వ్యూహాన్ని మళ్లీ రూపొందించాల్సి వచ్చింది. తెలుగులో బోయపాటి శ్రీను, వి వి వినాయక్ వంటి యాక్షన్ దర్శకుల లీగ్‌లో చేరాలని శ్రీకాంత్ కోరుకున్నట్లు, అయితే ఆయన ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు చాలా బాగా తీస్తారు కాబట్టి, అటువంటి సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడితే మంచిది అని అభిప్రాయపడ్డారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్.

తెలుగులో ఒరిజినల్ యాక్షన్ సినిమా ‘పెద్ద కాపు’ కథ రాసినా అది ఆకట్టుకోలేకపోయింది. అతని ఫ్యామిలీ డ్రామాలు ‘కొత్త బంగారు లోకం’,’ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు ‘బ్రహ్మోత్సవం’ కుటుంబ భావోద్వేగాలతో, తోబుట్టువుల బాంధవ్యాలు మరియు తల్లితండ్రుల బంధాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా అందర్నీ ఆకట్టుకున్నాయి. నేటికీ, ప్రజలు మంచి విలువలు మరియు నైతికత విలువలతో ఉన్న సినిమాలకు ఆకర్షితులవుతున్నారు కాబట్టి.. టీవీలలో ఎక్కువగా ఆ సినిమాలు చూస్తున్నారు. 

అదే బాటలో మరొక దర్శకుడు: 

తాజా చిత్రం ‘స్కంద’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన విషయాన్ని తెలుసుకుని, స్టార్ బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుని రక్షించవలసి వచ్చింది. వాస్తవానికి, బోయపాటి తమిళ స్టార్ సూర్యను కలుసుకున్నారని, అంతేకాకుండా ‘స్కంద’ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి చర్చ కూడా జరిపినట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం బోయపాటి శ్రీనుతో సూర్య సమావేశమైన మాట నిజమే అని.. భారీ యాక్షన్ అడ్వెంచర్ చేయాలనుకున్నారని.. కానీ ఇప్పుడు సూర్య మరో రెండేళ్లు బిజీగా ఉండడంతో పాటు, ‘స్కంద’ కూడా ఫర్వాలేదనిపించడంతో ఇప్పుడు బోయపాటి మరొక హీరో కోసం హీరో కోసం వెతుకుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

వాస్తవానికి, నందమూరి బాలకృష్ణ ‘స్కంద’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమాన దర్శకుడు బోయపాటిపై ప్రశంసలు కురిపించారు. ప్రతి సినిమాతో ఎప్పుడు కూడా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లడానికి మాత్రమే బోయపాటి శ్రీను ప్రయత్నిస్తారని పేర్కొన్నారు బాలకృష్ణ. గత హిట్‌ల గురించి ఆలోచించకుండా ఒక సినిమా తర్వాత మరొకటి ముందుకు సాగుతూనే ఉన్నామని.. తాము ప్రతి సినిమాను కొత్తగా ప్రారంభించామని.. అంతేకాకుండా’సింహా నుండి ‘అకండ’ వరకు పెద్ద హిట్‌లను అందించడానికి దానిపై పూర్తిగా దృష్టి పెట్టామని అని నందమూరి బాలకృష్ణ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడారు. ఇదే వేదికపై బాలకృష్ణతో ‘అఖండ 2’ సినిమా చేస్తానని బోయపాటి చెప్పడంతో స్టేడియంలో నందమూరి అభిమానుల చప్పట్లు కొట్టారు.

నిజానికి బోయపాటి సినిమా చేసేందుకు బాలకృష్ణ ఎప్పుడు వెనకాడడు. బాలకృష్ణ హిట్లు, ఫ్లాప్‌ల గురించి నిజానికి పట్టించుకోరు. ఫలానా దర్శకుడు చెప్పిన కథ ప్రకారం వెళతాడు.. అతనికి నచ్చితే, సినిమాకి ఓకే చెప్తాడు బాలకృష్ణ. బోయపాటి బాలకృష్ణతో లెజెండ్ తీసి హిట్టు కొట్టాడు. అతను క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ను సైతం ఆకర్షించే కొంత సెంటిమెంట్ టచ్‌తో కూడిన మాస్, మసాలా ఎంటర్‌టైనర్‌ చిత్రాలను అందించడంలో బోయపాటి ఆరితేరిన వ్యక్తి.