ఉస్తాద్ టీజర్ రివ్యూ: డొక్కు బండి నడిపినోడు విమానానికి పైలెట్ అయిన శ్రీ సింహ మెప్పించాడా?

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు శ్రీ సింహ కోడూరి, చైల్డ్ ఆర్టిస్టుగా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహ “మత్తు వదలరా” సినిమాతో  హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో తన నటనకి  మంచి మార్కులే వేయించుకున్నాడు.  ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహ కోడూరి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్, తాజాగా ఈ ఉస్తాద్ […]

Share:

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు శ్రీ సింహ కోడూరి, చైల్డ్ ఆర్టిస్టుగా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహ “మత్తు వదలరా” సినిమాతో  హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో తన నటనకి  మంచి మార్కులే వేయించుకున్నాడు.  ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహ కోడూరి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్, తాజాగా ఈ ఉస్తాద్ టీజర్‌ను హీరో రానా దగ్గుపాటి విడుదల చేశారు, ఉస్తాద్ టీజర్ ఎలా ఉందో, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. 

“లడ్డు గారు అంత సీరియస్‌గా ఏం చూస్తున్నారు?” అంటూ ఈ టీజర్ మొదలవుతుంది. “ అన్నా మా వాడికి పైనుంచి చూస్తే చక్కర్ వస్తుంది.” అని హీరో ఫ్రెండ్ అనటం, “నువ్వు ఎగరడానికి నీ మాంజా ఎక్కడుంది?” “రేయ్ పిచ్చి లేసిందా ఆ డొక్కు బండి దేనికి పనికి వస్తుంది. నేను రమ్మన్నానా? నేనా రమ్మంది? ఆ డొక్కు బండేసుకుని!” అంటూ ఈ ట్రైలర్ కొనసాగుతుంది. “నీకు మాత్రం రెగ్యులర్ గా సర్వీస్ కావాలి బండ్లకి!” అంటూ ముగిసే ఈ టీజర్ ఇంటరెస్ట్ పుట్టిస్తుంది.

ఈ టీజర్ ను చూస్తుంటే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. మనసులో ఎన్నో భయాలు పెట్టుకునే ఒక కామన్ కుర్రాడి పాత్రలో శ్రీ సింహ కనిపించాడు. కాస్త ఎత్తైన ప్రాంతం నుంచి కిందకి చూడాలంటే భయం అలాంటి కుర్రాడు ఆకాశాన్ని అందుకున్నాడు. చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి ఆనంద పడిన పిల్లాడు, అదే విమానాన్ని నడిపే పైలెట్ అయ్యాడు. డొక్కుబండి మీద తిరుగుతూ అవమానాలు పడిన కుర్రాడు రాజహంస లాంటి విమానాన్ని నడిపాడు. ఇదంతా చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.

ఈ టీజర్ లో సింహ చాలా  ప్రామిసింగ్‌గా కనిపించాడు.‌ ఈ టీజర్ ని చూస్తుంటే ఆకాశమే నీ హద్దురా గౌతమ్ ఎస్ఎస్సి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ టీజర్‌పై కనిపిస్తోంది. ఈ టీజర్‌లో పవన్ కుమార్ ఉప్పల సినిమాటోగ్రఫీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉస్తాద్ టీజర్‌ని ఎలివేట్ చేసింది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే ఆర్ఎక్స్100 బైక్‌ని  ఉస్తాద్ సినిమాలో బాగానే వాడారని చెప్పొచ్చు. టీజర్‌లో ఈ బైక్‌కి మంచి షార్ట్స్ పడ్డాయి, ఓవరాల్ గా టీజర్ అయితే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. మరి ఈ సినిమాతో శ్రీ సింహ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్‌ను అందుకుంటుంది.

ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ బలగం సినిమాలో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ సింహ పక్కన ఆమె కరెక్ట్‌గా సెట్ అయింది.  కాకపోతే టీజర్ కట్ లో మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ యాంగిల్‌ని మాత్రం చాలా తక్కువగా చూపించారు.  ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవా మీనన్ టీజర్‌లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. శ్రీ సింహతో కలిసి ప్రయాణం చేసే కెప్టెన్‌గా వాసుదేవ మీనన్ కనిపించనున్నారు.