టాలీవుడ్ లో శ్రీలీల హవా

శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి. శ్రీలీల వరుస సినిమాలు:  శ్రీలీల, వైష్ణవ్ తేజ్‌తో ‘అధికేశవ’ నవంబర్ 20న, […]

Share:

శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి.

శ్రీలీల వరుస సినిమాలు: 

శ్రీలీల, వైష్ణవ్ తేజ్‌తో ‘అధికేశవ’ నవంబర్ 20న, ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అన్నింటికీ మించి వచ్చే జనవరిలో రాబోతున్న మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ అనే పెద్ద ప్రాజెక్ట్, శ్రీలీల చేతిలో ఉంది. ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత శ్రీలీల జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. దర్శకనిర్మాతలు ఆఫర్‌లతో ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. యువ సంచలనం శ్రీలీల ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె సినిమాలు, రాబోయే ఐదు నెలలలో వరుసగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న రామ్ పోతినేని-బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘స్కంద’లో శ్రీలీల కనిపించనుంది. ఆమె నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’లో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

భారీ అంచనాల సినిమా: 

ఆమె పవన్ కళ్యాణ్‌తో మరో మెగా బక్స్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా చేస్తోంది. వచ్చిన కొద్ది కాలంలోనే తన నటనతో, అందంతో, అభినయంతో పెద్ద పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది శ్రీలీల. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే భారీ అంచనాల మధ్యలో వస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఛాన్స్ కొట్టేసింది హీరోయిన్ శ్రీలీల.

తెలుగు మాట్లాడే అమ్మాయి కావడం కూడా ఆమె కెరీర్‌కు కొంత ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మరియు ఇతరుల కంటే ఎక్కువ సినిమాలు, యంగ్ స్టార్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. 

అవకాశాన్ని అందుపుచ్చుకున్న  శ్రీలీల: 

అనుకోకుండా వక్కంతం వంశీతో నితిన్ కొత్త సినిమాలో రష్మిక మందన్న ప్రాజెక్ట్ నుండి తప్పుకోవటంతో, మొదలైన వివిధ కారణాల వల్ల చర్చనీయాంశమైంది ఈ సినిమా. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ అమ్మడుకు టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చాలా హైప్ తో రివీల్ చేశారు టీమ్. 

మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారంలో కూడా పూజా హెగ్డే తప్పుగున్నాక శ్రీలీలా ఎంటర్ అయ్యింది. అది త్రివిక్రమ్ – మహేష్ కాంబో లో వచ్చే మరో హైప్ ఉన్న సినిమా. ఈమధ్య బేబీ సినిమా ని మెచ్చుకున్నా అల్లు అర్జున్ “శ్రీలీలా లాంటి తెలుగు హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో అవసరం” అని కూడా ఈ అమ్మాయిని మెచ్చుకున్నాడు. మరోపక్క నితిన్‌కి 32వ సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రకటించారు, నితిన్ – వక్కంతం – రష్మీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబో అని ప్రకటించినా.. అకస్మాత్తుగా, రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఏది ఏమైనా నితిన్ కి వక్ఖత్తం వంశి కి అలాగే శ్రీలీలా కి మంచి విజయం సాధించి పెట్టాలని ఆశిద్దాం, మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం.