ఓటీటీలోకి  ఎంట్రీ ఇచ్చిన ‘స్పై’ మూవీ

నిఖిల్ లేటెస్ట్ మూవీ ‘స్పై. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినప్పుటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్ హీరోయన్ గా నటించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.  కార్తికేయ 2, 18 పేజెస్‌ లాంటి […]

Share:

నిఖిల్ లేటెస్ట్ మూవీ ‘స్పై. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినప్పుటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్ హీరోయన్ గా నటించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. 

కార్తికేయ 2, 18 పేజెస్‌ లాంటి హిట్‌ సినిమాల తర్వాత యంగ్ హీరో నిఖిల్‌ నటించిన చిత్రం స్పై. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ డెత్ మిస్టరీ ఆధారంగా గ్యారీ బీహెచ్ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు.

 ED ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై కే.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన స్పై మూవీలో ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్‌గా నటించగా, దగ్గుబాటి రానా, ఆర్యన్‌ రాజేష్‌ స్పెషల్‌ రోల్స్‌ పోషించారు. జూన్‌29న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఎప్పటిలాగే నిఖిల్‌ నటన అలరించింది. అలాగే సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయని రివ్యూస్‌ వచ్చాయి. 

ఈ క్రమంలో థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్ స్పై మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా ‘స్పై’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే అంచనాలను పెంచేసింది.  అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఈ మూవీ రిజల్ట్ విషయంలో నిఖిల్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.

స్పై కథ ఏంటి అంటే…

 జై(నిఖిల్).. ‘రా’ ఇంటెలిజెన్స్‌లో సీక్రెట్ ఏజెంట్‌. శ్రీలంకలో ఓ మిషన్‌లో ఉండగా స్వదేశంలోని ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ‘రా’ చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. గతంలో చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.

కంటెంట్ వీక్ కావడంతో ‘స్పై’ సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. జూన్ 27న థియేటర్లలోకి వస్తే.. తొలి వీకెండ్‪‌కే సినిమా ఫాట్ అని అర్థమైపోయింది . దీంతో అందరూ ఆ చిత్రాన్నిచూడటానికి ఇష్టపడలేదు.

OTT లో స్పై… 

 అయితే ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా ‘స్పై’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే అంచనాలను పెంచేసింది.  అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఈ మూవీ రిజల్ట్ విషయంలో నిఖిల్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.

ఈ చిత్రంలో ఆర్య‌న్ రాజేష్, స‌న్యా ఠాకూర్, జిషుసేన్‌గుప్తా, అభిన‌వ్ గోమటం, మ‌కరంద్‌దేశ్‌పాండే కీలకపాత్రల్లో నటించారు. రానా ఒక్క సీన్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నిఖిల్‌ స్పై మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.