ఆ సినిమా అంచనాలకు మించి ఉంటుంది: సందీప్ రెడ్డి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. తానిప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన పాన్ ఇండియా స్టార్​గా స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఆయన నుంచి చివరగా వచ్చిన రెండు సినిమాలు ఆశించినంత మేర ఆకట్టుకోపోయినా కానీ అభిమానుల్లో ఆయన సినిమాల పట్ల అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇక అది మాత్రమే కాకుండా ప్రభాస్ లుక్ డ్యామేజ్ అయిందంటూ […]

Share:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. తానిప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన పాన్ ఇండియా స్టార్​గా స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఆయన నుంచి చివరగా వచ్చిన రెండు సినిమాలు ఆశించినంత మేర ఆకట్టుకోపోయినా కానీ అభిమానుల్లో ఆయన సినిమాల పట్ల అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇక అది మాత్రమే కాకుండా ప్రభాస్ లుక్ డ్యామేజ్ అయిందంటూ బాలీవుడ్ మీడియా తెగ గగ్గోలు పెడుతోంది. వారి ఆరోపణలకు తగ్గట్లుగానే రాధేశ్యామ్ సినిమాలో లవర్ బాయ్​గా ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

అంచనాలను మించి – సందీప్ రెడ్డి 

అవన్నీ గత విషయాలు. కానీ ఇప్పుడు ప్రభాస్ చేసేవి ఎక్కువ యాక్షన్ ఎంటర్​టైనర్ మూవీలే కావున లుక్​తో పెద్ద సంబంధం ఉండదు. యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయనే అంతా చూస్తారు. టాలీవుడ్ యువ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ కమిట్​మెంట్ జరిగి దాదాపు ఏడాది పూర్తవుతున్నా.. ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లెక్క అలా ఉంది. ఆయన ప్రస్తుతం అరడజన్ కంటే ఎక్కువ సినిమాలతో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా ఉన్నారు. ఇక ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ అంచనాలకు తగ్గకుండా సినిమా ఉంటుందని డైరెక్టర్ తెలిపారు. ఈ విషయాన్నే ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ గత సినిమాలు ఆశించిన మేర ఆడకపోయేసరికి ఆకలి మీదున్న అభిమానులకు సందీప్ చెప్పిన విషయం ఫుల్ మీల్స్ పెట్టినంత కిక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. 

తొలి సారి ఖాకీ డ్రెస్ లో కనబడనున్న ప్రభాస్

ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాల పైనే అయింది కానీ, ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌‌గా ఖాకీ చొక్కా వేసుకుని కనిపించలేదు. కానీ సందీప్ రెడ్డితో ఉండబోయే స్పిరిట్ సినిమాలో తొలి సారిగా ప్రభాస్ పోలీస్ వేషధారణలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇది ప్రభాస్ కెరియర్లో 25వ సినిమా కావడం విశేషం. కాగా టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్​కు అనేక మంది అభిమానులు ఉన్నారు.

ఆకలి మీద

గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రభాస్ సినిమాలు ఆశించిన రేంజ్​లో ఆడక ఆయన ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు. ఇక ఈ వార్త విని వారు తెగ సంబరపడిపోతున్నారు. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ మూవీ తెరకెక్కించిన సందీప్ రెడ్డితో సినిమా అంటే మినిమం హిట్ గ్యారంటీ అని.. సినిమా బ్లాక్ బస్టర్ అయితే రికార్డులు తిరగరాయడం ఖాయం అని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా.. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్​గా (సీతగా) నటించింది. మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు.