ప్లాప్ మొహం చూడని డైరెక్టర్లు

మూవీ ఇండస్ట్రీ అనేది హిట్లు, ప్లాపుల మీద ఆధారపడి ఉంటుంది. హిట్ లేకపోతే ఇక్కడ ఎవరినీ పట్టించుకోరు. సక్సెస్ వెనకే ఇండస్ట్రీ పరుగెడుతుందనే విషయం అందరికీ తెలుసు. అటువంటి ఇండస్ట్రీలో హిట్ పర్సంటేజ్ చాలా తక్కువ. కానీ కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నుంచి ప్లాప్ అనేది లేకుండా తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. అగ్ర హీరోలనే కాకుండా కుర్ర హీరోలకు కూడా మర్చిపోలేని హిట్లు అందిస్తున్నారు. వారి టాలెంట్ కు సౌత్ […]

Share:

మూవీ ఇండస్ట్రీ అనేది హిట్లు, ప్లాపుల మీద ఆధారపడి ఉంటుంది. హిట్ లేకపోతే ఇక్కడ ఎవరినీ పట్టించుకోరు. సక్సెస్ వెనకే ఇండస్ట్రీ పరుగెడుతుందనే విషయం అందరికీ తెలుసు. అటువంటి ఇండస్ట్రీలో హిట్ పర్సంటేజ్ చాలా తక్కువ. కానీ కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నుంచి ప్లాప్ అనేది లేకుండా తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. అగ్ర హీరోలనే కాకుండా కుర్ర హీరోలకు కూడా మర్చిపోలేని హిట్లు అందిస్తున్నారు. వారి టాలెంట్ కు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఫిదా అవుతోంది. వారే టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌలి మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ… 

అది హాట్ సీటే… 

సినిమా అనేది షిప్ వంటిది అనుకుంటే డైరెక్టర్ అనేవాడు ఆ షిప్ ను నడిపే కెప్టెన్. అందుకే సినిమాకు డైరెక్టర్ ను కెప్టెన్ అని వ్యవహరిస్తుంటారు. అటువంటి డైరెక్టర్ మంచి ఫామ్ లో ఉంటే ఇక ఆ మూవీ కి సంబంధించి అందరూ ఎటువంటి చింతా లేకుండా వర్క్ చేసుకుంటారు. అదే ఆ డైరెక్టర్ ప్లాపుల్లో ఉంటే ఎంత పెద్ద హీరోతో ఎంత మంచి కథకు వర్క్ చేసినా కానీ చాలా మంది చాలా టెన్షన్ పడుతుంటారు. అందుకోసమే డైరెక్టర్ షిప్ అనేది చాలా ముఖ్యం. డైరెక్టర్ కు వేసే చెయిర్ కు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో ఉండే 24 క్రాఫ్ట్స్ ను డైరెక్టర్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. అందుకోసమే అతడు కెప్టెన్. అతడి పర్యవేక్షణ 24 క్రాఫ్ట్స్ మీద కొరవడితే సినిమాలో ఎంత పెద్ద హీరో యాక్ట్ చేసినా కానీ అది ఎంత పెద్ద బడ్జెట్ ఫిలిం అయినా కానీ అవుట్ పుట్ విషయంలో మాత్రం ప్రేక్షకులు అంతలా సాటిస్ఫై కాలేరు. అందుకోసమే ప్రొడ్యూసర్లు కూడా డైరెక్టర్ అన్నింటా ఇన్వాల్వ్ కావాలని అనుకుంటూ ఉంటాడు. అందుకు తగిన వాతావరణాన్ని ప్రొడ్యూసర్ క్రియేట్ చేస్తుంటాడు. కానీ కొన్ని సార్లు డైరెక్టర్లు కొన్ని విషయాలను పట్టించుకోరు. అటువంటి సమయంలో సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. 

దక్షిణాదిన ఆ ఇద్దరే

మన భారతదేశంలో ఉన్న చాలా భాషల్లో ఏడాదికి చాలా మూవీస్ వస్తుంటాయి. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. కాబట్టి చాలా తక్కువ సినిమాలు హిట్ సాధిస్తుంటాయి. అందుకోసమే ఇండస్ట్రీలో హిట్ వచ్చిందంటే ఆ డైరెక్టర్ కు క్రేజ్ వేరేలా ఉంటుంది. ఈ హిట్టు ప్లాపులకు ఎవరూ అతీతులు కారు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ప్లాప్ పలకరిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు మాత్రం ప్లాప్ అనే పదమే లేకుండా తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. వారే తెలుగు డైరెక్టర్ రాజమౌలి మరియు తమిళ డైరెక్టర్ అట్లీ. వీరిద్దరూ సినిమా తీస్తున్నారంటే చాలు అటు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇటు మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. సినిమా రిజిల్ట్ విషయంలో ప్రొడ్యూసర్స్ ఏ మాత్రం బెంగ లేకుండా ఉంటారు. అందుకే చాలా మంది ప్రొడ్యూసర్స్ వీరితో మూవీలు తీసేందుకు క్యూ కడుతుంటారు. వీరు ఎంత బడ్జెట్ పెట్టినా కానీ ఆ మూవీలు తీస్తుంటారు. అప్పు చేసి మరీ ప్రొడ్యూసర్స్ తమ డైరెక్టర్ అనుకున్న అవుట్ పుట్ ను తీసుకొచ్చేందుకు తాపత్రయపడుతుంటారు. తమ మీద నమ్మకంతో సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించిన ప్రొడ్యూసర్ల నమ్మకం వమ్ము కాకుండా ఈ ఇద్దరు డైరెక్టర్లు చూసుకుంటున్నారు. అందుకోసమే ఎంత పెద్ద స్టార్లు కానీ వీరు అడిగినన్ని రోజుల కాల్షీట్లను అందిస్తున్నారు. 

వీరు కూడా అదే బాటలో.. 

కేవలం రాజమౌలి మరియు అట్లీ అనే కాకుండా ఇలా ప్లాప్ మొహం లేని దర్శకులు చాలా మందే ఉన్నారు. తమిళ చిత్రసీమను చూసుకుంటే లోకేశ్ కనగరాజ్ వంటి వారు అనేక మంది ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి హిట్టు మొహం చూడకుండా ఉన్న సీనియర్ హీరో కమల్ వంటి వారికి కూడా లోకేశ్ హిట్ ఇచ్చాడు. లోకేశ్ ఎవరితో సినిమా తీసినా కానీ అందులో ఏదో ఒక విషయం ఉంటుందని అందరూ నమ్ముతారు. అందుకోసమే ఈ యువ డైరెక్టర్ కు హిట్లు వస్తుంటాయి. ఇక ఇదే కోవలోకి చేరే దర్శకుల జాబితా ఉంది. ఇక మలయాళ ఇండస్ట్రీ విషయానికొస్తే బాసిల్ జోసెఫ్, సమీర్ తాహిర్, అంజలి మీనన్ వంటి వారు ఉన్నారు. ఇక కన్నడ చిత్రపరిశ్రమ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్, రిషభ్ శెట్టి, రాజ్ బీ. శెట్టి వంటి వారు అనేక మంది ఉన్నారు. అదే మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే.. చాలా మంది దర్శకులు ఈ కోవలోకి చెందుతారు. అందుకే ఇటువంటి దర్శకులు వస్తే ఎంత బడ్జెట్ పెట్టేందుకు అయినా కానీ ప్రొడ్యూసర్స్ వెనకడుగు వేయరు. ఏ సినిమా అయినా తీస్తుంటారు. అందుకోసమే ఇటువంటి దర్శకుల నుంచి ఎటువంటి జానర్ లో సినిమా వచ్చినా కానీ చూసేందుకు కూడా ప్రేక్షకులు రెడీగా ఉంటారు. 

బాలీవుడ్ గడప తొక్కిన అట్లీ.. 

తమిళ నాట ఎన్నో హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ అట్లీ…. ఇటీవలే బాలీవుడ్ గడప తొక్కారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమాకు అట్లీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ మూవీ కూడా హిట్ టాక్ ను అందుకుంది. ఈ మూవీలో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. తనకు అచ్చొచ్చిన ఫార్ములాలోనే అట్లీ ఈ మూవీని తెరకెక్కించాడు. బాలీవుడ్ బాద్ షా స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని అట్లీ ఈ మూవీని తెరకెక్కించాడు. అందుకోసమే ఈ మూవీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.