సౌత్ ఇండియ‌న్ యాక్ట‌ర్ల ఎఫైర్లు.. నిజ‌మేనా?

సౌత్ ఇండియన్ నటీనటులు ముఖ్యంగా ఎఫైర్లు వంటి రూమర్స్ లో అప్పుడప్పుడు కనిపించడం సహజంగా జరుగుతూనే ఉంది. ప్రముఖ నటీనటులు తమతో సినిమాలో నటించిన వారితో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నారు అని కోణంలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకప్పుడు నాగార్జున, నయనతార, ధనుష్, శృతిహాసన్ ఇలా పలువురు నటీనటులు ఇటువంటి వివాదాల్లో చెక్కుకున్నారు. అంతేకాకుండా వారి గురించి షాకింగ్ వివాహేతర సంబంధాల గురించి గతంలో నివేదికలు వచ్చాయి. నాగార్జున-టబు మరియు ప్రభుదేవా-నయనతార మధ్య ప్రారంభమైన […]

Share:

సౌత్ ఇండియన్ నటీనటులు ముఖ్యంగా ఎఫైర్లు వంటి రూమర్స్ లో అప్పుడప్పుడు కనిపించడం సహజంగా జరుగుతూనే ఉంది. ప్రముఖ నటీనటులు తమతో సినిమాలో నటించిన వారితో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నారు అని కోణంలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకప్పుడు నాగార్జున, నయనతార, ధనుష్, శృతిహాసన్ ఇలా పలువురు నటీనటులు ఇటువంటి వివాదాల్లో చెక్కుకున్నారు. అంతేకాకుండా వారి గురించి షాకింగ్ వివాహేతర సంబంధాల గురించి గతంలో నివేదికలు వచ్చాయి. నాగార్జున-టబు మరియు ప్రభుదేవా-నయనతార మధ్య ప్రారంభమైన స్నేహం ప్రేమ వరకు వెళ్లిందని పుకార్లు వినిపించడం జరిగాయి. 

నాగార్జున-టబు: 

నాగార్జున గురించి సౌత్ ఇండియా సినిమాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఆయన శివ సినిమాలో నటించిన అమలను వివాహం చేసుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా, సిల్వర్ స్క్రీన్ మీద నాగార్జున టబు పెయిర్ అభిమానులను మరింత ఆకట్టుకునేలా చేసేది. అంతేకాకుండా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచిందని, ముఖ్యంగా వాళ్ళిద్దరూ కలిసి తీసిన నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడలో నాగార్జున టబు సహజం నటులుగా నిజమైన భార్య భర్తలు గా కనిపించే చాలా బాగా ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇదే క్రమంలో, నాగార్జున-టబు ఏదో ఉందని రూమర్ కూడా మొదలైంది. అయితే నిజానికి నాగార్జున-టబులు మంచి ఫ్రెండ్స్. 

ప్రభుదేవా-నాయనతార: 

ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది ప్రభుదేవా-నాయనతార రిలేషన్షిప్ విషయం.  వెళ్ళు సినిమా షూటింగ్ తర్వాత నయనతార ప్రభుదేవా మధ్య సీక్రెట్ ఎఫైర్ నడిచిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే నిజానికి ఆ వార్త నిజమైంది అంటూ ప్రభుదేవా నోరు విప్పి, తను నయనతారన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుదేవాకు లత అనే ఆవిడతో వివాహమైన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ వార్త వచ్చిన అనంతరం ప్రభుదేవా భార్య డివోర్స్ తీసుకోవడానికి అంగీకరించలేనట్లు తెలిసింది. తర్వాత అనేకమైన వార్తలు వచ్చిన తరువాత.. ప్రభుదేవా అదే విధంగా తన భార్య లత డివోర్స్ తీసుకొని విడిపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత మరో ట్విస్ట్ ఏంటంటే ప్రభుదేవా నాయనతారాలు శాశ్వతంగా దూరమయ్యారు. అయితే చాలాకాలం వరకు నడిచిన ఈ వార్త కేవలం వాళ్ళ పర్సనల్ లైఫ్ కాకుండా కెరీర్ పరంగా కూడా చాలా నష్టం వాటిలిందని చెప్పుకోవాలి. 

ధనుష్- శృతిహాసన్: 

వై దిస్ కొలవరి డి, ఈ పాట వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే సినిమా 3. ఈ సినిమాలో ధనుష్ అదే విధంగా హీరోయిన్గా నటించిన శృతిహాసన్ చాలా బాగా నటించి అభిమానులకు దగ్గరయ్యారు. అంతేకాకుండా ఈ సినిమాలో వారి ఇద్దరి మధ్య రిలేషన్ చాలా బాగుందని, అంతేకాకుండా వారి ఇద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ నిజానికి సహజంగా అనిపించిందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు అనే పుకార్లు కూడా వినిపించాయి. నిజానికి, ధనుష్- శృతిహాసన్ నటించిన సినిమా 3కి డైరెక్టర్ మరి ఎవరో కాదు ధనుష్ భార్య ఐశ్వర్య రజనీకాంత్. చాలాకాలం వరకు ఈ సినిమా 3 లో నటించిన ధనుష్- శృతిహాసన్ మధ్య రిలేషన్షిప్ రూమర్ల గురించి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. ఈ వార్తలు గురించి క్లారిఫై ఇచ్చారు ధనుష్- శృతిహాసన్లు, తాము కేవలం ప్రొఫెషనల్ పరంగానే సినిమాలో నటించడం జరిగిందని, అంతకుమించి, వారి మధ్య మరి ఎటువంటి రిలేషన్ అనేది లేదు అని చెప్పడంతో ఈ రూమర్ కి ఫుల్ స్టాప్ పడింది.