ఆ అమ్మడు సర్జరీ చేయించుకుందా??

రోజులు మారిపోయాయి. నెటిజన్స్ చాలా స్మార్ట్ గా తయారయ్యారు. మనం ఏం చేసినా కానీ ఇట్టే ఈజీగా దొరికిపోతున్నాం. దీంతో ఒక వేళ దొరికిపోతే నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు దిగుతున్నారు. దీంతో ఉన్న పరువు కాస్త పోయినట్లు అవుతుందని చాలా మంది సెలెబ్రెటీలు అసలు సోషల్ మీడియాను టచ్ కూడా చేయడం లేదు. కానీ కొంత మంది మాత్రం నిత్యం ఏదో ఒక రకమైన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ […]

Share:

రోజులు మారిపోయాయి. నెటిజన్స్ చాలా స్మార్ట్ గా తయారయ్యారు. మనం ఏం చేసినా కానీ ఇట్టే ఈజీగా దొరికిపోతున్నాం. దీంతో ఒక వేళ దొరికిపోతే నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు దిగుతున్నారు. దీంతో ఉన్న పరువు కాస్త పోయినట్లు అవుతుందని చాలా మంది సెలెబ్రెటీలు అసలు సోషల్ మీడియాను టచ్ కూడా చేయడం లేదు. కానీ కొంత మంది మాత్రం నిత్యం ఏదో ఒక రకమైన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని సార్లు నెటిజన్లకు దొరికిపోతున్నారు. ఇలాగే రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శోభితా దూళిపాల్ల కూడా నెటిజన్లకు దొరికిపోయింది. దీంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య శోభితా పేరు చాలా ఎక్కువగా వినిపిస్తోంది. 

చైతో రొమాన్స్??

టాలీవుడ్ బెస్ట్ లవ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య విడిపోయారంటే ఎవరు కూడా నమ్మలేదు. ఇవన్నీ ఫేక్ వార్తలు అని చాలా మంది కొట్టిపారేశారు. కానీ సమంత మాత్రమే కాకుండా నాగ చైతన్య కూడా సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల స్టోరీని పోస్ట్ చేయడంతో కష్టం అయినా కానీ దానిని బిలీవ్ చేసేందుకు అంతా అంగీకరించారు. అయినా కానీ వారి విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నేటికీ వైరల్ అవుతూనే ఉంది. అసలు వారు ఎలా విడాకులు తీసుకున్నారని ఇప్పటికీ బాధపడే వారు ఇండస్ట్రీలో ఉన్నారు. దీంతో అసలు వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటని చాలా మంది ఎంక్వైరీలు చేయడం మొదలు పెట్టారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంలో ఎవరికీ పెద్దగా క్లూ దొరకలేదు. దీంతో చేసేదేం లేక అందరూ సైలెంట్ అయ్యారు. 

శోభితతో కనిపించిన చైతన్య… పట్టేసిన సోషల్ మీడియా

యంగ్ బ్యూటీ శోభితా దూళిపాల్ల టాలీవుడ్ నవ మన్మధుడు నాగ చైతన్యతో ఓ రెస్టారెంట్ లో దొరికిపోయింది. వారిద్దరూ కలిసి ఫొటోలు షేర్ చేసుకోకున్నా కానీ నెటిజన్లు నాగ చైతన్య పోస్ట్ చేసిన ఓ ఫొటోను చూసి అక్కడ శోభిత కూడా ఉందని కనిపేట్టేశారు. ఓ హోటల్ కి వెళ్లిన నాగచైతన్య సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశారు. టేబుల్ నుంచి దూరంగా వచ్చి అతడు సెల్ఫీ తీసుకున్నాడు. విచిత్రమేంటంటే ఆ ఫొటోలో నాగచైతన్యతో పాటు శోభిత కూడా కనిపించింది. ఈ విషయాన్ని పట్టేసిన నెటిజన్స్ ఈ జంటను ఒక రకంగా ట్రోల్ చేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఈ ఫొటో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయినా కానీ ఈ ఫొటో మీద ఈ జంట స్పందించలేదు. కొన్ని రోజుల తర్వాత నెటిజన్లు కూడా విషయాన్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఈ చర్చకు పుల్ స్టాప్ పడింది. 

అమ్మడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా??

శోభితకు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట్లో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. విశాఖలో పెరిగిన శోభిత 2013లో మిస్ ఇండియా ఎర్త్ పోటీల్లో పాల్గొన్నారు. ఆ పోటీలకు సంబంధించి ఒకటి శోభిత వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో శోభిత మరీ ఒక రకంగా ఉంది. ప్రస్తుతం శోభితను చూస్తే అలా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2016లో ఈ భామ ముంబై కి వచ్చి అవకాశాల కోసం వెతకడం స్టార్ట్ చేసింది. ఇక సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాతే అమ్మడు అందం మీద ఫోకస్ చేసి కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది కావొచ్చు అని ట్వీట్లు చేస్తున్నారు. శోభితకు గూఢచారి, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలు మంచి గుర్తింపు ను తీసుకొచ్చాయి. అంతే కాకుండా నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈ బ్యూటీ నటించింది. ఈ కాస్మోటిక్ సర్జరీల విషయంలో మాత్రం శోభిత ఏమీ స్పందించలేదు.