Sitara: జాతీయ సినిమా దినోత్సవం నాడు సితార ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ(Krishna) తనయుడు మహేష్ బాబు(Mahesh babu) ఇప్పటికే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. అంతే కాకుండా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సినిమా(Cinema)లు అందించి తనదైన శైలిలో అభిమానులకు దగ్గరయ్యారు. అయితే ఇటీవల మహేష్ బాబు(Mahesh babu) కూతురు సితార (Sitara) తన మంచి పనులతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాకుండా ఆటపాటలతో తనదైన శైలిలో డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు హ్యాపీగా ఆక్టివ్ గా ఉంటున్నారు. ఈ […]

Share:

సూపర్ స్టార్ కృష్ణ(Krishna) తనయుడు మహేష్ బాబు(Mahesh babu) ఇప్పటికే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. అంతే కాకుండా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సినిమా(Cinema)లు అందించి తనదైన శైలిలో అభిమానులకు దగ్గరయ్యారు. అయితే ఇటీవల మహేష్ బాబు(Mahesh babu) కూతురు సితార (Sitara) తన మంచి పనులతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాకుండా ఆటపాటలతో తనదైన శైలిలో డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు హ్యాపీగా ఆక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ సినిమా డే రోజున, సితార(Sitara) తనదైన శైలిలో సినిమా(Cinema) గురించి సోషల్ మీడియాలో రాసుకోవచ్చు. 

సితార ఎమోషనల్ పోస్ట్: 

సితార(Sitara) నిజానికి సూపర్ స్టార్ కృష్ణ(Krishna) తనయుడు మహేష్ బాబు(Mahesh babu) కూతురైనప్పటికీ, తన జీవన శైలి ఎప్పుడూ కూడా సింపుల్ గా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. చాలామంది సితారను ఒక ప్రిన్సెస్ గా అభివర్ణిస్తూ ఉంటారు. జాతీయ చలనచిత్ర దినోత్సవం నాడు సీతారాతన ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది. తన తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ(Krishna), తల్లితండ్రులు, అన్నయ్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకుంది. అంతేకాకుండా సినిమా గురించి ప్రత్యేకంగా తన శైలిలో రాసుకొచ్చింది. ముఖ్యంగా సినిమా అంటే కేవలం ఒక పదం కాదని, తన జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని మాట్లాడింది సితార. అంతేకాకుండా సినిమా(Cinema) అంటే తనకి ఒక ఇండస్ట్రీ కాదని, తనలో ఉండే డిఎన్ఏ అంటూ సినిమా(Cinema) గురించి చాలా గొప్పగా మాట్లాడింది సితార(Sitara). 

ముఖ్యంగా తన తండ్రి సినిమాలు చూస్తూ పెరిగిన తనకి, తన తండ్రి ఒక ఇన్స్పిరేషన్ అంటూ మాట్లాడింది. అంతేకాకుండా సితార తాతగారు సూపర్ స్టార్ కృష్ణ(Krishna) గురించి తను ఎప్పుడూ గర్వంగా ఉంటుందని, ముఖ్యంగా అతను ఒక ఎవర్గ్రీన్ లెజెండ్ అంటూ సూపర్ స్టార్ కృష్ణ(Krishna) గురించి ప్రస్తావించింది సితార(Sitara). ఇటువంటి కుటుంబంలో పుట్టడం తనకి అదృష్టంగా భావించింది. తన కుటుంబానికి ఎంతో గుర్తింపుని తీసుకువచ్చిన తాత గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని, తన కుటుంబ అభిమానుల కోసం తనదైన శైలిలో సినిమా(Cinema) గురించి ప్రస్తావించింది మహేష్ బాబు(Mahesh babu) కూతురు సితార(Sitara). 

జాతీయ సినిమా దినోత్సవం: 

జాతీయ సినిమా దినోత్సవాన్ని 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) రూపొందించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత సినిమా హాళ్లను తిరిగి తెరిచిన జ్ఞాపకార్థం MAI జాతీయ సినిమా దినోత్సవాన్ని ప్రారంభించింది. COVID-19 మహమ్మారి సమయంలో భారీ నష్టాలను చవిచూసిన సినిమా(Cinema) హాల్ యజమానులకు మద్దతుగా సినీ ప్రేక్షకులను ప్రోత్సహిస్తూ ఈ రోజున సినిమా(Cinema) టిక్కెట్లపై గణనీయమైన తగ్గింపులను అందించాలని అసోసియేషన్ నిర్ణయించింది.

సితార గురించి మరింత: 

12 ఏళ్ల సితార(Sitara) తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఉంది. స్టార్ కిడ్ డ్యాన్స్‌ని చాలామంది అభిమానిస్తూ ఉంటారు.. మరి ముఖ్యంగా సితార(Sitara) ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల, సితార ఒక నగల బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది.

2019లో, ఇంగ్లీష్ ఫాంటసీ చిత్రం ఫ్రోజెన్ 2 తెలుగు వెర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు సితార తన వాయిస్ అందించింది. ఆమె దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి ఆద్య & సితార(Sitara) అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతోంది.. ఈ ఛానల్ కు సుమారు 280K మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు.