గ్రాండ్‌గా సితార 11వ బ‌ర్త్‌డే

టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు-నమ్రత. ‘వంశీ’ అనే చిత్రం తో పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్లిద్దరి వివాహం జరిగి 18 ఏళ్ళు అవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఈ జంట ఇన్నేళ్ల నుండి దాంపత్య జీవితం కొనసాగిస్తుంది అంటే సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఈమధ్య సినీ తారలు పెళ్లి చేసుకున్న రెండు మూడేళ్ళ లోపే విడాకులు తీసేసుకుంటున్నారు. చిన్న […]

Share:

టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు-నమ్రత. ‘వంశీ’ అనే చిత్రం తో పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్లిద్దరి వివాహం జరిగి 18 ఏళ్ళు అవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఈ జంట ఇన్నేళ్ల నుండి దాంపత్య జీవితం కొనసాగిస్తుంది అంటే సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఈమధ్య సినీ తారలు పెళ్లి చేసుకున్న రెండు మూడేళ్ళ లోపే విడాకులు తీసేసుకుంటున్నారు. చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు. అలాంటిది ఇన్నేళ్ల దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్ మధ్య గొడవలు రాని సందర్భం లేకుండా ఉండదు. అయినప్పటికీ కూడా ఇంత సర్దుకుపోయి జీవిస్తున్న వీళ్లిద్దరు ఎంతో మందికి ఆదర్శ దంపతులు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ దంపతులిద్దరికీ గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

తల్లితండ్రులు మరియు స్నేహితులతో కలిసి  పుట్టినరోజు జరుపుకున్న సితార :

గౌతమ్ మరియు సితార ఇద్దరు కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చాలా కాలం నుండి అభిమానులకు అందుబాటులో ఉన్నారు. తమ జీవితం లో జరిగే కొన్ని వ్యక్తిగత విషయాలను, ఫోటోలను,వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే రీసెంట్ గానే సితార తన 11 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. చాలా సింపుల్ గా మహేష్, నమ్రత, గౌతమ్ లతో పాటుగా తన బెస్ట్ ఫ్రెండ్స్ తో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సితార ఫోటోలను నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి. నిన్నగాక మొన్న పుట్టినట్టు అనిపిస్తున్న సితార అప్పుడే 11 ఏళ్ళు పూర్తి చేసుకుందా? , కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తుంది అని అనుకుంటున్నారు అభిమానులు. ఇకపోతే సితార తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తనకి సంబంధించిన డ్యాన్స్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ని షేర్ చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

కమర్షియల్ యాడ్ లో సితార :

అయితే రీసెంట్ గా ఈ క్యూట్ పాప నటించిన మొదటి కమర్షియల్ యాడ్ విడుదలైంది. ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి సితార నటించిన ఈ యాడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 11 ఏళ్ళ వయస్సులోనే కమర్షియల్ యాడ్స్ చేసే రేంజ్ కి ఎదిగింది అంటే సితార పాపకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా సితార అంటే ఎంతో ఇష్టం. చిన్నతనం లోనే ఇంత క్యూట్ గా నటిస్తున్న ఈ చిన్నారి, భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సితార కి మొదటి నుండి నటన పై మంచి ఆసక్తి ఉందట. చైల్డ్ ఆర్టిస్టుగా వెళ్ళడానికి ఆసక్తి చూపించింది కానీ, మహేష్ బాబు అందుకు అంగీకరించలేదు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తైన వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం ముహూర్తం ఆగష్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుంది.