చనిపోయిన ఏడాది తరువాత సిద్దు మూసేవాలా పాట విడుదల

సంగీత ప్రియులకు పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా సుపరిచితమే. అతని పాటలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ అతి చిన్న వయసులోనే దుండగుల చేతిలో దుర్మరణం పాలయ్యాడు. అప్పటివరకు తమతో ఎంతో సంతోషంగా ఉన్న ఈ గాయకుడు ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో అభిమానులు ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్దు మూసేవాలా పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే అతని మరణానంతరం కూడా తన పాట లకు భారీగా రెస్పాన్స్ […]

Share:

సంగీత ప్రియులకు పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా సుపరిచితమే. అతని పాటలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ అతి చిన్న వయసులోనే దుండగుల చేతిలో దుర్మరణం పాలయ్యాడు. అప్పటివరకు తమతో ఎంతో సంతోషంగా ఉన్న ఈ గాయకుడు ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో అభిమానులు ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్దు మూసేవాలా పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే అతని మరణానంతరం కూడా తన పాట లకు భారీగా రెస్పాన్స్ రావడం విశేషం. 2023 ఏప్రిల్ 7న సిద్దు కొత్త పాట విడుదల అయింది. యూట్యూబ్ ఛానల్ లో విడుదలైన ఈ పాట కేవలం 5 గంటలలోనే మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది. 29 ఏళ్ల వయసులోనే మరణించిన సిద్దు చనిపోయే నాటికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పటికీ తన యూట్యూబ్ రాయాలిటీలు, డీల్స్ ద్వారా కోట్లు సంపాదించాడు.

పంజాబీ గాయకులలో అత్యధిక అభిమానుల ఫాలోయింగ్ కలిగిన ఈ యూట్యూబర్ 2023 ఏప్రిల్ 7 న సిద్దు కొత్త సాంగ్  యూట్యూబ్లో రిలీజ్ అయింది.  29 సంవత్సరాల వయసున్న సిద్దు మూసేవాలా దుండగుల చేతిలో దుర్మరణం పాలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇతను పాడిన పాటలకు ఇప్పటికీ కూడా యూట్యూబ్ నుంచి భారీగా ఆదరణ వస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇతని ఆస్తులు సుమారుగా 14 మిలియన్ల డాలర్లని మన భారతీయ కరెన్సీ లెక్క ప్రకారం 100 కోట్ల కంటే ఎక్కువే! అయితే ఈ ఆస్తి మొత్తాన్ని సిద్దు తల్లిదండ్రులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. సిద్దు మూసేవాలా  ఖరీదైన కార్లు ఇతరత్రా వస్తువులు కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల సిద్దు మూసేవాలా యూట్యూబ్లో చాలా ఫేమస్ సింగర్. తాజాగా విడుదలైన ఒక సాంగ్ లో నైజీరియన్ పాప్ సింగర్ ‘బర్న బాయ్ ‘రాప్ అందించడంతో సాంగ్ మరింత పాపులర్ అయింది. “మేరా నా” పాటను శుక్రవారం తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు ఈ పాట విడుదలైన ఎనిమిది గంటల్లోనే 7 మిలియన్ల వ్యూస్ అందుకొని సంచలనాన్ని సృష్టించింది.  

 సిద్దు మూసేవాలాకి మంచి పేరుతో పాటు, యువతలో కూడా బాగా క్రేజ్ ఉంది. సిటీలో గోడల మీద బైకుల మీద సిద్దు పోస్టర్లే ఎక్కువగా ఉంటాయి. మరణాంతరం కూడా సిద్దు క్రేజ్ తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం. సిద్దు యూట్యూబ్ ద్వారా రెండు కోట్లకు పైగా సంపాదించినట్లు తెలుస్తుంది.

కెనడియన్ రాపర్ డ్రేక్ సిద్దు మూసేవాలా ఫొటో ఉన్న షర్టు ధరించిన వీడియో కూడా ఈ సాంగ్ వీడియోలో కనిపిస్తోంది. ఇక వీడియో చివరిలో సిద్దు మూసేవాలా  మరణానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నట్లుగా చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సిద్దు మూసేవాలా యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో రిలీజ్ చేసిన 8 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. మూసే వాలా ప్రస్తుతం లేకపోయినా కానీ ఈ పాటతో మరోసారి అందరి హృదయాల్లో సజీవంగా నిలిచిపోయాడు.