లక్కీ అలీ బ్రాహ్మణులపై వివాదాస్పద పోస్టు,‌ మళ్లీ క్షమాపణలు

ఇటీవల పలువురు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్స్ పోస్టులు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొంతమంది వివాదాలు అయ్యేటటువంటి పోస్టులే చేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ సింగర్ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ గతంలో సినిమాల్లో పాటలు పాడినా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బయట ప్రదర్శనలు ఇస్తున్నాడు‌. దివంగత బాలీవుడ్ నటుడు మొహమ్మద్ తనయుడిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ మొదలుపెట్టి ఆ తరువాత సంగీతంలోకి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా మారాడు. లక్కీ అలీ ప్రస్తుతం […]

Share:

ఇటీవల పలువురు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్స్ పోస్టులు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొంతమంది వివాదాలు అయ్యేటటువంటి పోస్టులే చేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ సింగర్ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ గతంలో సినిమాల్లో పాటలు పాడినా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బయట ప్రదర్శనలు ఇస్తున్నాడు‌. దివంగత బాలీవుడ్ నటుడు మొహమ్మద్ తనయుడిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ మొదలుపెట్టి ఆ తరువాత సంగీతంలోకి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా మారాడు. లక్కీ అలీ ప్రస్తుతం మన దేశంతో పాటు విదేశాల్లో ప్రైవేట్ ప్రదర్శనలు ఇస్తున్నారు.  తాజాగా రెండు రోజుల క్రితం లక్కీ అలీ తన ఫేస్‌బుక్‌లో బ్రాహ్మణుల గురించి ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే దానిని డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పారు. దీని వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ బ్రాహ్మణులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ అనే పదం అబ్రహం అనే పదం నుంచి వచ్చిందని, దాని మూలం ఇబ్రహీం అంటూ ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఈ పోస్ట్ వైరల్ కావడంతో లక్కీ అలీపై నెటిజెన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దాంతో వెనక్కి తగ్గిన ఆయన ఆ తరువాత ఆ పోస్టును డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు. లక్కీ అలీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడుతూ బ్రాహ్మణ అనేది బ్రహ్మ నుంచి వచ్చిందని అది అబ్రహం నుంచి వచ్చిందని పేర్కొన్నారు. అబ్రహం అనేది అబ్రహం లేదంటే ఇబ్రహీం నుంచి వచ్చిందన్నారు. కాబట్టి బ్రాహ్మణులు ఇబ్రహీం వంశం అని వివరించారు. అన్ని దేశాలకు అలైహిసలాం తండ్రి అని పేర్కొన్నారు. ఎవరూ తమలో తాము తర్కించుకోకుండా ఎందుకు వాదించుకుంటున్నారని, ఎందుకు పోట్లాడుకుంటున్నారని ఆ పోస్టులో ప్రశ్నించారు. ఆ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగిన 64 ఏళ్ల లక్కీ అలీ.. క్షమాపణలు చెబుతూ బాధించడం, కోపాన్ని తప్పించడం, తన ఉద్దేశం కాదని.. అందరినీ ఒక చోటకు చేర్చాలన్నదే తన అభిమతం అని అన్నారు. అయితే తాను అనుకున్నట్లుగా రాయలేకపోయానని పేర్కొన్నారు. తన పోస్టుతో హిందూ సోదరులు, అక్క, చెల్లెళ్లను బాధించానని అందుకు బాధపడుతున్నానని, అందరికీ క్షమాపణలు చెప్తూ, “ఇప్పుడు నేను రాసే విధానం గురించి మరింత తెలుసుకున్నాను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను” అని తెలిపారు.

దుష్మన్ దునియా కా చిత్రంలో “నషా నషా” పాటతో అలీ బాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతను కహో నా ప్యార్ హై,  ఏక్ పాల్ కా జీనా, నా తుమ్ జానో నా హమ్ పాడాడు. ఏక్ పల్ కా జీనా పాట కి 2001లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును అందుకున్నాడు. అతను 48 వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సుర్‌లో ఆ భీ జా పాట కోసం ఉత్తమ నేపథ్య గాయకుడిగా నామినేట్ అయ్యాడు. కానీ సోనూ నిగమ్ చేతిలో ఓడిపోయాడు. సుర్, బచ్నా ఏ హసీనో, అంజానా అంజని, తమాషా వంటి చిత్రాలకు పాటలను అందించాడు.