బిగ్ బాస్ సీజన్-7లో ఎలిమినేట్ అయిన దామిని 

బిగ్ బాస్ తెలుగు 7 మూడో వారం పూర్తయింది. శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున షోకు హాజరై కంటెస్టెంట్స్‌తో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు. అతను వారం పొడవునా హౌస్‌మేట్‌లకు వారి ఆట తీరు కోసం మరింత మాట్లాడడం జరిగింది. అయితే ఈ వారం అనుకోకుండా ఎలిమినేషన్ తారుమారైన వైనం కనిపిస్తోంది. నిజానికి సింగర్ దామిని ఎలిమినేట్ అయింది.  ఎలిమినేట్ అయిన దామిని:  మూడో వారంలో సింగర్ దామిని షో నుంచి ఎలిమినేట్ అయింది. డేంజర్ జోన్‌లో ఉన్న […]

Share:

బిగ్ బాస్ తెలుగు 7 మూడో వారం పూర్తయింది. శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున షోకు హాజరై కంటెస్టెంట్స్‌తో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు. అతను వారం పొడవునా హౌస్‌మేట్‌లకు వారి ఆట తీరు కోసం మరింత మాట్లాడడం జరిగింది. అయితే ఈ వారం అనుకోకుండా ఎలిమినేషన్ తారుమారైన వైనం కనిపిస్తోంది. నిజానికి సింగర్ దామిని ఎలిమినేట్ అయింది. 

ఎలిమినేట్ అయిన దామిని: 

మూడో వారంలో సింగర్ దామిని షో నుంచి ఎలిమినేట్ అయింది. డేంజర్ జోన్‌లో ఉన్న టేస్టీ తేజని అయితే శివాజీ రక్షించాడు. అయితే ఇదే చివరికి దామిని షో నుండి బయటకు వచ్చేలా చేసింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 హౌస్‌లోకి ప్రవేశించిన 14 మంది కంటెస్టెంట్స్‌లో ముగ్గురు కంటెస్టెంట్లు షకీలా, కిరణ్ రాథోడ్ మరియు దామిని షో నుండి ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవారు. దామిని భట్ల, బాహుబలిలోని పచ్చబొట్టేసిన పాపులర్ పాట మరియు కొండ పొలం చిత్రంలో ధమ్ ఢామ్ పాడారు, దీనికి ఇటీవల చంద్రబోస్ జాతీయ అవార్డును అందుకున్నారు, దామిని వారానికి రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకోగా, పూర్తిగా మూడు వారాలకుగాను 6 లక్షలు తీసుకున్నట్లు సమాచారం

బిగ్ బాస్ తెలుగు 7, నాలుగో వారం నామినేషన్ల ప్రోమో: 

షో మేకర్స్ కొత్త వారంలోని ఎపిసోడ్ కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రోమోను విడుదల చేశారు. నామినేషన్ల జరుగునున్న నాల్గవ వారంలో, కొంతమంది పోటీదారులు నామినేషన్లను ఆమోదించే న్యాయనిర్ణేతలుగా మారారు. ప్రోమో వీడియోలో శోభాశెట్టి, అమర్‌దీప్‌, శివాజీ న్యాయనిర్ణేతలుగా కనిపిస్తున్నారు. టేస్టీ తేజ, ప్రియాంక జైన్‌లను సాక్షుల స్థానాల్లో నిలబెట్టారు. యావర్ మధ్యలో నిలబడి శోభ మరియు టేస్టీ తేజతో తీవ్ర వాగ్వాదం చేస్తూ కనిపించాడు.

ప్రిన్స్ యావర్, రాతిక రోజ్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, టేస్టీ తేజ మరియు శుభశ్రీలు రాబోయే వారం ఎవిక్షన్‌లో నామినేట్ అవుతారని నివేదికల ప్రకారం భావిస్తున్నారు. ఆటా సందీప్, శివాజీ, మరియు శోభా శెట్టి నామినేషన్ల నుండి బయటపడడమే కాకుండా.. మూడు నుండి నాలుగు వారాల ఇమ్యూనిటీ సంపాదించి శాశ్వత హౌస్‌మేట్స్ అయిపోయారు. 

బిగ్ బాస్ సీజన్-7 గురించి మరింత: 

అనుకున్నట్టుగానే, ప్రోమోలో చూపించిన విధంగానే, బిగ్ బాస్ హౌస్ లో అంతా రివర్స్ లో జరుగుతోంది. మొదటి రోజే, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి 5 కంటెస్టెంట్లకు సుమారు 35 లక్షలు ఆఫర్ చేయడం జరిగింది. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్ లో, పాల్గొన్న కంటెస్టెంట్ల లో ఎవరైతే చివరి వరకు ఉంటారో, ఆ ఐదు మందికి మాత్రమే 35 లక్షలు ఆఫర్ చేయడం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ సీజన్-7 మొదలైన మొదటి రోజే జరగడం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి బిగ్ బాస్ సీజన్-7 అన్ని సీజన్ల కన్నా భిన్నంగా ఉంటుంది అని మొదటి నుంచి ప్రోమోలో చూపించిన విధంగానే, ఈ సీజన్ లో అంత తారుమారుగా జరగడం కనిపించింది. కేవలం 15 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ మొదటి రోజున సందడి చేశారు. అయితే మొదటి ఎలిమినేషన్ లో, అనుకోని విధంగా జెమిని మరియు మరెన్నో చిత్రాలలో నటించిన ప్రముఖ నటి..కిరణ్ రాథోడ్ మొదటి వారంలో,, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు.