వర్క్​మోడ్​లోకి ఎంటరైన సిద్ధార్థ్​–కియారా.. వైరల్ కామెంట్స్ చేసిన సిద్ధార్థ్​

బాలీవుడ్ రొమాంటిక్ కపుల్.. సిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఈ మధ్యనే ఈ ప్రేమ జంట మూడు మళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట ఎవరి షూటింగ్స్​లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ఇద్దరు తాజాగా కెమెరాల కంట పడ్డారు. వారిద్దరూ ఫొటోగ్రాఫర్ల కంటపడటంతో వారిని ఫొటోలకు పోజులివ్వమని ఫొటోగ్రాఫర్లు అడిగారు. దీనికి సరేనన్న ఈ రొమాంటిక్ కపుల్ ఫొటోలకు పోజులిస్తూ నిలబడ్డారు. ఇంతలో అక్కడ సిద్ధార్థ్​కు […]

Share:

బాలీవుడ్ రొమాంటిక్ కపుల్.. సిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఈ మధ్యనే ఈ ప్రేమ జంట మూడు మళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట ఎవరి షూటింగ్స్​లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ఇద్దరు తాజాగా కెమెరాల కంట పడ్డారు. వారిద్దరూ ఫొటోగ్రాఫర్ల కంటపడటంతో వారిని ఫొటోలకు పోజులివ్వమని ఫొటోగ్రాఫర్లు అడిగారు. దీనికి సరేనన్న ఈ రొమాంటిక్ కపుల్ ఫొటోలకు పోజులిస్తూ నిలబడ్డారు. ఇంతలో అక్కడ సిద్ధార్థ్​కు ఒక విచిత్ర ప్రశ్న ఎదురైంది. సిద్ధార్థ్​ను ఒక ఫొటోగ్రాఫర్ ఒంటరిగా (సోలోగా) ఫోటోలకు పోజులివ్వమని.. అడగడంతో సిద్ధార్థ్​ అతడికి ఫన్నీ వేలో కామెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్ తెగ వైరల్ అవుతోంది. అతడు చేసిన ఈ ఫన్నీ కామెంట్​ను బాలీవుడ్ ప్రియులు తెగ లైక్​ చేస్తూ షేర్ చేస్తున్నారు. 

నేనిప్పుడు ఒంటరి కాదుగా – సిద్ధార్థ్ మల్హోత్రా

సిద్ధార్థ్​ను ఓ ఫొటోగ్రాఫర్ ఒంటరిగా స్టిల్స్​ ఇవ్వమని అడగ్గా, అతడు దానికి సమాధానమిస్తూ అబ్ మేన్ సోలో నహీ రహీ (నేనిప్పుడు ఒంటరిని కాదుగా అని అన్నాడు). ఇలా సిద్ధార్థ్​ ఫన్నీ ఆన్సర్ ఇవ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.  ఒక ఫొటోగ్రాఫర్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలలో సిద్ధార్థ్ చాలా స్టైలిష్​ లుక్​లో కనిపించాడు. అతడు ఎరుపు, నలుపు రంగు చెక్ షర్ట్ మరియు బ్రౌన్ ప్యాంటులో కనిపించాడు. అతడు మునుపటి కంటే కూడా హ్యాండ్​సమ్​గా కనిపిస్తున్నాడంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా అతడు ఫొటోగ్రాఫర్లతో మాట్లాడేటపుడు అతడి స్లీవ్స్​ను మడతేస్తూ కనిపించాడు. అభిమానులు.. ఈ రొమాంటిక్ హీరో చేసిన కామెంట్లను తెగ లైక్ చేస్తూ వారికి ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లను జత చేస్తున్నారు.

పెళ్లి తర్వాత మరింత అందం

పెళ్లి తర్వాత సిద్ధార్థ్​ మల్హోత్రాకు మరింత అందం వచ్చిందని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. అతడు మరింత అందంగా ఎలా కనిపిస్తున్నాడో కనుక్కోవాలని కూడా అంటున్నారు. అంతే కాకుండా అతడు ఇప్పుడు మరీ నాజూగ్గా కనిపిస్తున్నాడని కూడా కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి తర్వాత సిద్ధార్థ్ బలహీనంగా మారాడని కూడా కొంత మంది కామెంట్లు చేశారు.

అలా పిలవడం సంతోషంగా ఉంది – సిద్ధార్థ్​ 

కియారాను భార్య అని పిలవడం చాలా సంతోషంగా ఉందని నటుడు సిద్ధార్థ్ తెలిపారు. గత వారం జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ జంట కలిసే పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమంలో వీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా అక్కర్లేదు. ఇక ఈ అవార్డుల్లో వీరిద్దరూ కలిసి గతేడాది నటించిన షేర్షా చిత్రానికి అవార్డు వచ్చింది. దీంతో కియారా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సిద్ధార్థ్​ పేరును అనౌన్స్ చేయగానే కియారా గట్టిగా అరిచింది. దీంతో సిద్ధార్థ్​ కూడా హ్యాపీగా ఫీలవుతూ కియారాను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.  చాలా రోజుల పాటు ప్రేమాయణం నడిపిన ఈ జంట.. రీసెంట్​గా జైసల్మీర్​​లోని ఒక కోటలో జరిగిన పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి ఎక్కడో కోటలో చేసుకున్న ఈ జంట.. సిద్ధార్థ్ సొంతూరయిన ఢిల్లీతో పాటుగా బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో కూడా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. కియారాను భార్యగా పొందడం తన అదృష్టమని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.