రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న శృతిహాసన్

కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సినిమాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని మంచి మంచి సినిమాలను తన సొంతం చేసుకుంటుంది శృతిహాసన్. స్క్రిప్ట్ ప్రకారంగా తను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న శృతిహాసన్. ఇటీవల కాలంలో వరుస సినిమాలు క్రాక్, వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రత్యేకమైన ఫేమ్ ఒక్కటే కాకుండా, హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చూపించింది.  రెమ్యూనిరేషన్ పెంచేసిన శృతి:  ఇటీవల కాలంలో హ్యాట్రిక్ విజయాలను సాధించి […]

Share:

కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సినిమాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని మంచి మంచి సినిమాలను తన సొంతం చేసుకుంటుంది శృతిహాసన్. స్క్రిప్ట్ ప్రకారంగా తను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న శృతిహాసన్. ఇటీవల కాలంలో వరుస సినిమాలు క్రాక్, వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రత్యేకమైన ఫేమ్ ఒక్కటే కాకుండా, హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చూపించింది. 

రెమ్యూనిరేషన్ పెంచేసిన శృతి: 

ఇటీవల కాలంలో హ్యాట్రిక్ విజయాలను సాధించి క్రాక్, వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డిలో హీరోయిన్ గా నటించి వరుస విజయాలను సాధించిన శృతిహాసన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి గాను రెమినేషన్ అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల తాను నటించిన వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి లో శృతిహాసన్ నటించిన ఆ సినిమాలకు గాను సుమారు రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. అయితే తదుపరిచిత్రానికి గాను తాను మూడు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 

సలార్ సినిమాతో మరో విజయం దగ్గరలో శృతి: 

అయితే రిలీజ్ కి దగ్గరలో ఉన్న సలార్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తున్న శృతి మరో విజయానికి దగ్గరలో ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సలార్ సినిమా కూడా బిగ్ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో శృతిహాసన్ ఎప్పటిలాగే తన నటనతో మరింత అలరించనుంది. శృతిహాసన్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఏ హీరో పక్కన నటించినప్పటికీ, తనదైన శైలిలో హీరోతో ఏమాత్రం తగ్గకుండా తన వంతు కృషి చేస్తుంది శృతి హాసన్. వరస హాట్రిక్ సినిమా విజయాలు అందుకున్న శృతిహాసన్ ఇప్పుడు తన డిమాండ్ మరింత పెరిగిందని రెమ్యూనరేషన్ కూడా పెంచే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

శృతిహాసన్ గురించి మరింత: 

2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన “లక్” సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన “అనగనగా ఓ ధీరుడు” సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది. కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది. 

అదే సంవత్సరంలో “దిల్ తో బచ్చాహై జీ” సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిని శ్రుతి ఆపై ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన “7అం అరివు” సినిమాలో నటించింది. సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. చిరంజీవి నటించిన “ఇద్దరు మిత్రులు” సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రుతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది.