రోమ్‌లో భ‌ర్త‌తో క‌లిసి శ్రియా శ‌ర‌ణ్ వెకేష‌న్

తెలుగు రాష్ట్రాలలో శ్రేయ కి ఉన్న ఫాలోయింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది కుర్రకారు మనసును దోచుకున్న శ్రేయ ఎన్నో సినిమాలతో ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది. ఆమె సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురుచూసేవారు అభిమానులు. రజనీకాంత్ సరసన నటించిన శ్రేయ, శివాజీ సినిమాలో తన నటనతో అభిమానులకు మరింత దగ్గర అయింది. శ్రేయ ప్రస్తుతం ఇటు సినిమాలలో అటు ఫ్యామిలీలో రెండిట్లో బిజీగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి శ్రేయ తన భర్తతో […]

Share:

తెలుగు రాష్ట్రాలలో శ్రేయ కి ఉన్న ఫాలోయింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది కుర్రకారు మనసును దోచుకున్న శ్రేయ ఎన్నో సినిమాలతో ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది. ఆమె సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురుచూసేవారు అభిమానులు. రజనీకాంత్ సరసన నటించిన శ్రేయ, శివాజీ సినిమాలో తన నటనతో అభిమానులకు మరింత దగ్గర అయింది. శ్రేయ ప్రస్తుతం ఇటు సినిమాలలో అటు ఫ్యామిలీలో రెండిట్లో బిజీగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి శ్రేయ తన భర్తతో తీసుకున్న రోమ్ వెకేషన్ ఫొటోస్ వైరల్ గా మారాయి. 

వెకేషన్ ముచ్చట్లు: 

శ్రేయ ఎప్పుడు కూడా తన సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తుంది.. తను ఎప్పుడు ఎక్కడ వెకేషన్ లో ఉంది, ఏ కంట్రీలో సందర్శిస్తుంది, అనే విషయాలు తను ఎప్పటికప్పుడు ఫాన్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా తాను ఎప్పుడు కూడా తన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తుంది. 

తను ఎక్కడ వెకేషన్ లో ఉన్నా సరే, తన ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తూ కనిపిస్తుంది శ్రేయ. తన నటనతో ఎంతగానో ప్రేక్షకులను అలరించిన శ్రేయ వివాహం 2018లో జరిగింది. తర్వాత 2021లో తన బిడ్డకు జన్మనిచ్చింది. 

అయితే వివాహం అనంతరం, శ్రేయ శరన్ తన కుటుంబ విషయాలలో ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తూ కనిపించింది. అప్పట్లో తను సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తనదైన శైలిలో పోస్ట్లు పెడుతూ ఉంటుంది శ్రేయ. ముఖ్యంగా తను వెకేషన్ కి వెళ్ళిన ఫోటోస్ షేర్ చేయడం ఎప్పుడూ మర్చిపోదు. ప్రస్తుతం రోమ్ వెకేషన్ లో ఉన్న శ్రేయ, తను తన హబ్బితో ఎంతగానో హ్యాపీగా గడుపుతున్న సమయాలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులకు ఎంతగానో నచ్చాయి. కూడా తన వెకేషన్ ఎంజాయ్ చేస్తూ, జీవితానికి సరిపడా హ్యాపీనెస్ దొరికింది.. అంటూ ఫోటోలు షేర్ చేస్తూ కొటేషన్ కూడా రాసింది. 

శ్రేయ గురించి మారింత: 

శ్రియా శరణ్ భట్నాగర్ 11 సెప్టెంబర్ 1982లో పుట్టింది. ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో పని చేసింది. శరణ్ డ్యాన్సర్ కావాలని ఎంతగానో ఆశపడింది, అయితే ఆమె నటనతో నటిగా మారింది. తెలుగు చిత్రం ఇష్టం (2001)తో సినీరంగ ప్రవేశం చేసింది. సరన్ నువ్వే నువ్వే (2002)తో తన మొదటి విజయాన్ని సాధించింది.

ఢిల్లీలోని ఎల్‌ఎస్‌ఆర్ కాలేజ్‌లో ఆమె రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, సరన్ నటించిన వీడియో ఒకటి రామోజీ ఫిల్మ్స్ చూసింది, వారు తమ చిత్రం ఇష్టంలో శ్రేయకు ప్రధాన పాత్రను ఇచ్చారు. 

శరణ్ నటించిన నువ్వే నువ్వేలో ఆమె ఒక మధ్యతరగతి వ్యక్తిని ప్రేమించే కోటీశ్వరుడి కూతురిగా నటించింది. 2002లో, ఆమె సంతోషం చిత్రంలో నాగార్జున, ప్రభుదేవా మరియు గ్రేసీ సింగ్‌లతో కలిసి నటించింది, ఇది ఆమె మొదటి విజయం. ఈ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నంది అవార్డును మరియు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డు (తెలుగు) పొందిందిఆమె నటనకు, ఉత్తమ నటిగా సినీమా అవార్డ్‌కు నామినేషన్ సంపాదించింది. ఆమె కెరీర్ ప్రారంభంలో తెలుగు పరిశ్రమలో మంచి పట్టును సాధించింది.