Shraddha Kapoor: రూ. 4కోట్ల లంబోర్ఘినిలో చక్కర్లు కొడుతున్న శ్రద్ధా కపూర్

ఆషికి 2 సినిమా (Cinema)తో అందరి అభిమానాన్ని సంపాదించుకొని, తనదైన శైలిలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఇటీవల ముంబై వీధుల్లో, తాను కొత్తగా కొనుక్కున్నాను రూ. 4కోట్ల విలువైన పెద్దకారు (Car)లో చెక్కర్లు కొడుతూ అభిమానులకు దర్శనమిచ్చింది.  రూ. 4కోట్ల లంబోర్ఘినిలో చక్కర్లు కొడుతున్న శ్రద్ధా కపూర్:  శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఈ సంవత్సరం దసరా వేడుకలను మరపురానిదిగా జరుపుకుంది. తన పెట్టుబడుల గురించి తరచుగా […]

Share:

ఆషికి 2 సినిమా (Cinema)తో అందరి అభిమానాన్ని సంపాదించుకొని, తనదైన శైలిలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఇటీవల ముంబై వీధుల్లో, తాను కొత్తగా కొనుక్కున్నాను రూ. 4కోట్ల విలువైన పెద్దకారు (Car)లో చెక్కర్లు కొడుతూ అభిమానులకు దర్శనమిచ్చింది. 

రూ. 4కోట్ల లంబోర్ఘినిలో చక్కర్లు కొడుతున్న శ్రద్ధా కపూర్: 

శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఈ సంవత్సరం దసరా వేడుకలను మరపురానిదిగా జరుపుకుంది. తన పెట్టుబడుల గురించి తరచుగా పెదవి విప్పని నటి, తనకి తాను కొత్త లంబోర్ఘిని (Lamborghini) హురాకాన్ కారును బహుమతిగా ఇచ్చుకున్నట్లు వెల్లడించింది. నటి స్నేహితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి, నటి రూ. 4 కోట్ల విలువైన ఎరుపు రంగు లంబోర్ఘిని (Lamborghini) హురాకాన్ టెక్నికాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కూడా ఈ విషయాన్ని అవును అంటూ అభిమానులకు స్పష్టం చేస్తుంది. కొద్దిసేపటికే, శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కూడా ముంబై రోడ్లపై తన కొత్త కారుతో దర్శనమిచ్చింది. అంతేకాకుండా కారు (Car)గురించి, ఒక ప్రత్యేకమైన మహిళకు ఈ కారు (Car) అందజేస్తున్నందుకు, సంస్థ యాజమాన్యానికి ఎంతో గర్వకారణంగా ఉందని, ఫోటో షేర్ చేశారు. 

Read More: LEO : ‘లియో’.. థియేటర్‌లో స్క్రీన్‌ చింపేసిన ఎగ్జిబిటర్‌..!

శ్రద్ధా కపూర్ గురించి మరింత: 

శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కపూర్ (Shraddha Kapoor), 1987 మార్చి 3లో జన్మించారు. భారతీయ సినీ నటి, గాయకురాలు. ఆమె బాలీవుడ్ లో నటించింది. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ (Shakthi Kapoor) కుమార్తె కుడా. 2010లో టీన్ పట్టి సినిమా (Cinema)లో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), లవ్ కా ది ఎండ్ (2011) సినిమా (Cinema)లో కథానాయికగా నటించింది.

2013లో విడుదలైన ఆషికి 2 లో గాయని పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను, విమర్శకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా (Cinema)లోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. ఆ తరువాత 2014లో విలియం షేక్‌స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన హైదర్ సినిమా (Cinema)లో కథానాయికగా నటించింది ఆమె. ఏక్ విలన్ (2014), ఏబిసిడి (2015), భాగీ (2016) వంటి సినిమా (Cinema)ల్లో ఆమె నటన ద్వారా ప్రశంసలు అందుకోవడమే కాక, బాలీవుడ్ లో తన స్థానాన్ని దక్కించుకుందానే చెప్పుకోవాలి. ఆమె నటించిన సినిమా (Cinema)లన్నీ కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించాయి. నటించడంతో పాటు, తన సినిమా (Cinema)ల్లో చాలా పాటలు పాడింది శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor). ఆమె చాలా బ్రాండ్ లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా కూడా పనిచేస్తోంది. నటీనటుల కుటుంబం నుండి వచ్చిన కపూర్‌కి చిన్నప్పటి నుంచి నటి కావాలనే కోరిక ఉండేది. తల్లిదండ్రుల బట్టలు వేసుకుని సినిమా(Cinema) డైలాగులు రిహార్సల్ చేస్తూ బాలీవుడ్ పాటలకు అద్దం ముందు డ్యాన్స్ చేసేది. ఆమె తన చిన్నతనంలో తన తండ్రితో పాటు వివిధ షూటింగ్ లొకేషన్‌లకు కూడా వెళ్లింది.

కపూర్ కుటుంబ సభ్యులలో ఆమె తండ్రి శక్తి కపూర్, తల్లి శివంగి కపూర్, ఆమె అన్నయ్య సిద్ధాంత్ కపూర్, ఆమె ఇద్దరు అత్తలు పద్మిని కొల్హాపురే, తేజస్విని కొల్హాపురే, ఆమె తల్లితో పాటు అందరూ భారతీయ సినిమా (Cinema) నటులు. కపూర్ తన స్కూలింగ్ మొత్తం జమ్నాబాయి నర్సీ స్కూల్‌లో చేసింది. 15 సంవత్సరాల వయస్సులో, ఆమె అమెరికన్ స్కూల్ ఆఫ్ బొంబాయికి మారింది, అక్కడ ఆమె టైగర్ ష్రాఫ్ (Tiger Shroff), అథియా శెట్టితో కలిసి స్కూల్లో చదువుకుంది కూడా.