Divorce: సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు

చాలామంది అనుకుంటున్న విధంగా సినీ ఇండస్ట్రీలో విడాకులు (divorce) తీసుకున్న జంటలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అన్యోన్యంగా కనిపించిన కొంతమంది దంపతులు కూడా హఠాత్తుగా విడాకులు తీసుకుని ప్రతి ఒక్కరిని షాక్కుకి గురి చేశారు.  ఐశ్వర్య రజినీకాంత్- ధనుష్:  ఐశ్వర్య రజనీకాంత్, రజినీకాంత్ కూతురు మరియు ధనుష్ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలు తన ప్రత్యేకమైన శైలిలో చేసే అబ్బురపరిచిన హీరో. అయితే ఈ జంటకు 2004లో వివాహం […]

Share:

చాలామంది అనుకుంటున్న విధంగా సినీ ఇండస్ట్రీలో విడాకులు (divorce) తీసుకున్న జంటలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అన్యోన్యంగా కనిపించిన కొంతమంది దంపతులు కూడా హఠాత్తుగా విడాకులు తీసుకుని ప్రతి ఒక్కరిని షాక్కుకి గురి చేశారు. 

ఐశ్వర్య రజినీకాంత్- ధనుష్: 

ఐశ్వర్య రజనీకాంత్, రజినీకాంత్ కూతురు మరియు ధనుష్ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలు తన ప్రత్యేకమైన శైలిలో చేసే అబ్బురపరిచిన హీరో. అయితే ఈ జంటకు 2004లో వివాహం జరగగా, సుమారు 18 సంవత్సరాల వైవాహిక జీవితానికి, 2022లో డివోర్స్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. నిజంగా ఈ వార్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ తమ పిల్లల్ని ఎప్పటిలాగే తల్లిదండ్రులుగా చేసుకుంటారని చెప్పడం జరిగింది. 

అమలా పాల్-AL విజయ్: 

నటి అమలా పాల్, చిత్రనిర్మాత AL విజయ్ 2014లో వివాహం చేసుకున్నారు. రెండు సంవత్సరాల తర్వాత 2016లో విడిపోయారు. వారు అధికారికంగా 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమల ముంబైకి చెందిన గాయకుడు భావనీందర్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ, తర్వాత విడిపోయారు. అయితే. మరోవైపు, AL విజయ్ ఇప్పుడు R. ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. 

ప్రభుదేవా-రమ్ లతా: 

ప్రభుదేవా 1995లో రమ్ లతాను వివాహం చేసుకున్నారు. 2010లో విడాకులు తీసుకున్నారు. రమ్ లతా ముస్లిం అయినందున ప్రభుదేవాను వివాహం చేసుకోవడానికి హిందూ మతాన్ని స్వీకరించారు. పెళ్లి తర్వాత తన పేరును లతగా మార్చుకుంది కూడా. 

నిహారిక కొణిదెల-చైతన్య జె.వి: 

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ 2020లో జైపూర్‌లోని డెస్టినేషన్ వెడ్డింగ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కొణిదెల కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత 2023లో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వారి విడాకులకు ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, వారి విడాకులకు విభేదాలు ప్రధాన కారణాలని సమాచారం. 

సమంత రూత్ ప్రభు-నాగ చైతన్య: 

వీరిద్దరూ 2010లో కలుసుకున్నారు, 2017లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. 2021లో నాలుగు సంవత్సరాల తర్వాత, ఇద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే ఊహాగానాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఈ విషయం గురించి చర్చి జరుగుతుంది. వాస్తవానికి, నాగ చైతన్య తండ్రి నాగార్జున అక్కినేని తన కొడుకు మళ్లీ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారని, మొత్తం ప్లాన్ చేస్తున్నారని కొన్ని నివేదికలు చెప్పడం కూడా జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదు! నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని అతని సన్నిహిత వర్గాలు కన్ఫామ్ చేశారు. 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని ఆయన సన్నిహిత వర్గాలు కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నిజానికి నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు అని, ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు అని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 

2017లో సమంత తన భర్త నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా పెళ్లి ఫోటో షేర్ చేస్తూ, హ్యాపీ బర్త్డే అంటూ, అనుకున్నవన్నీ సాధించాలి అంటూ,తనని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అంటూ.. #happybirthdaychay అని సమంత రాసుకోవచ్చింది. అయితే ఇటీవల ఈ ఫోటోని మళ్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం నేటిజెన్లకు అయోమయానికి గురి చేసినట్లు అవుతోంది. సమంత పోస్ట్ చూసిన అనంతరం ప్రతి ఒకరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ కలుసుకుంటున్నారా? మీ జంట అంటే మాకు ఎంతో ఇష్టం.. మీరు మళ్ళీ కలిస్తే చూడాలని ఉంది అంటూ నేటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ పెట్టారు.