మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల గురించి మాట్లాడిన శివరాజ్‌కుమార్

కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ అంటే తెలియని వారంటూ ఉండరేమో. కన్నడ సినీ పరిశ్రమలో సుపరిచితుడైన శివరాజ్‌కుమార్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న మంచి స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ, కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా, ప్రేక్షకులు అడిగిన చురుకైన ప్రశ్నలకు చకచకా సమాధానం ఇచ్చారు శివరాజ్ కుమార్.. ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి.. శివరాజ్ పంచుకున్న ఫొటోస్:  శివరాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద స్టార్‌లలో ఒకరు. ఈ […]

Share:

కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ అంటే తెలియని వారంటూ ఉండరేమో. కన్నడ సినీ పరిశ్రమలో సుపరిచితుడైన శివరాజ్‌కుమార్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న మంచి స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ, కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా, ప్రేక్షకులు అడిగిన చురుకైన ప్రశ్నలకు చకచకా సమాధానం ఇచ్చారు శివరాజ్ కుమార్.. ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి..

శివరాజ్ పంచుకున్న ఫొటోస్: 

శివరాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద స్టార్‌లలో ఒకరు. ఈ నటుడుకి ఎంతోమంది అభిమానులు ఉండడమే కాకుండా.. ఆయన నిజానికి తెలుగు మరియు తమిళ పరిశ్రమలలోని పలువురు ప్రముఖులకు చాలా సన్నిహితంగా ఉంటాడు. గురువారం, అతను తన అభిమానుల కోసం Xలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ లో  పాల్గొన్నారు. అంతేకాకుండా, మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్‌తో తన స్నేహం గురించి ఆసక్తికరమైన విషయాలను ఎన్నో పంచుకున్నాడు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ల గురించి శివరాజ్: 

మహేష్ బాబుతో తన బంధం గురించి, అతను ఆఫ్-స్క్రీన్ ఎలా ఉంటాడో షేర్ చేసుకోమని, ఒక అభిమాని శివరాజ్‌కుమార్‌ను అడిగాడు. జైలర్ నటుడు చాలా చక్కటి సమాధానమిచ్చాడు, మహేష్ బాబు నిజంగా చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి అని.. చాలా మంచిగా,  గౌరవంగా ఉండే వ్యక్తి అని.. అంత మృదువుగా మాట్లాడే వ్యక్తిని మరింత బ్రైట్ లైట్స్ మధ్య తెరపై చూడటం ఆనందంగా ఉంది.. అంటూ ఆల్ ద బెస్ట్ @urstrulyమహేష్ గారూ.. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే ఎంతోమంది అభిమానులు ఉన్నారు అంటూ చాలా చక్కగా మాట్లాడారు శివరాజ్.

ఒక అభిమాని కన్నడ సూపర్ స్టార్‌ని పవన్ కళ్యాణ్‌తో కలిసి ఒక చిత్రాన్ని పంచుకోవాలని కోరాడు.. అంతేకాకుండా వారిని కలిసి చూడాలని కోరికను వ్యక్తం చేశాడు. నటుడు అభిమానుల కోరికను అంగీకరించి, Xలో పవర్‌స్టార్‌తో ఫోటోను పంచుకున్నారు. @TrendPSPK అతను ప్రియమైన స్నేహితుడు అని రాశారు. నా అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి. @PawanKalyan గారు.. ఆయన అభిమానులందరికీ ఆయురారోగ్యాలు మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను. అలాగే, మీరు మీరు కోరుకున్న ఫోటో షేర్ చేశాను చూడండి అంటూ.. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోను షేర్ చేశారా శివరాజ్.

శివరాజ్‌కుమార్ రాబోయే ప్రాజెక్ట్‌లు: 

శివరాజ్‌కుమార్ తన రాబోయే చిత్రం ఘోస్ట్ కోసం ప్రమోషన్స్ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్‌ను అక్టోబర్ 19న విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళంతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, ప్రశాంత్ నారాయణన్, సత్య ప్రకాష్ మరియు అర్చన జోయిస్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మహేష్ బాబు ప్రాజెక్ట్‌లు: 

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే “గుంటూరు కారం” సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే ప్రజెక్టు నుంచి తప్పుకున్నాక ఆమె స్థానంలో మీనాక్షి చౌదరితో టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించింది. శ్రీలీల కథానాయిక. ఎస్ థమన్ సంగీత స్వరకర్త. 

మహేష్ బాబు తన రాబోయే అడ్వెంచర్ SSMB29 సినిమా ఆగస్టు 9న, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ అవ్వడమే కాకుండా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. వి విజయేంద్ర ప్రసాద్, తన స్క్రిప్ట్ గురించి ఇటీవల అప్డేట్ ఇచ్చారు.  మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నారు.