Shiva Rajkumar: టీమ్ ఇండియాకు సపోర్ట్ గా కన్నడ హీరో

భారత్- పాక్(Ind -Pak) క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం రెండు దేశాల క్రికెట్(Cricket) అభిమానులే కాకుండా ఇరు దేశాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేక చాలా కాలం అయిన నేపథ్యంలో ఐసీసీ(ICC) ఈవెంట్లలోనే గత కొన్నేళ్లుగా దాయాది దేశాలు తలపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏ ఐసీసీ ఈవెంట్ షెడ్యూల్ విడుదలైనా భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ఉంది అనేది […]

Share:

భారత్- పాక్(Ind -Pak) క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం రెండు దేశాల క్రికెట్(Cricket) అభిమానులే కాకుండా ఇరు దేశాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేక చాలా కాలం అయిన నేపథ్యంలో ఐసీసీ(ICC) ఈవెంట్లలోనే గత కొన్నేళ్లుగా దాయాది దేశాలు తలపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏ ఐసీసీ ఈవెంట్ షెడ్యూల్ విడుదలైనా భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ఉంది అనేది చాలా ఆసక్తిని రేపుతోంది. అయితే ప్రస్తుతం భారత గడ్డపై జరుగుతున్న 2023 క్రికెట్ వరల్డ్ కప్‌(World Cup)లో భాగంగా భారత్, పాక్ జట్లు శనివారం గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ మైదానం క్రికెట్ ఫ్యాన్స్‌తో ఉర్రూతలూగిపోనుంది.

ప్రపంచ కప్‌లో జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రజలను ఉత్తేజపరిచేందుకు స్టార్ స్పోర్ట్స్ కన్నడ ‘క్రికెట్ లైవ్’ (Cricket Live)షోలో శివన్న అని పిలువబడే కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయకులలో ఒకరైన శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar)  హాజరు కానున్నారు. ఈ షోని అక్టోబర్ 14, 2023న స్టార్ స్పోర్ట్స్ కన్నడలో మధ్యాహ్నం 12:30 గంటలకు చూడవచ్చు.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్(Shiva Raj Kumar)  తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్(Cricket) అభిమానులకు భారత్-పాక్ మధ్య పోటీ ఎంత ప్రత్యేకమైనదో పేర్కొన్నాడు. ఈ ఉత్తేజకరమైన ఈవెంట్‌లో స్టార్ స్పోర్ట్స్ కన్నడ(Star Sports Kannada)లో భాగమైనందుకు అతను థ్రిల్‌గా ఉన్నానని, కేఎల్ రాహుల్, కోహ్లి, శర్మ, బుమ్రా వంటి ఆటగాళ్ల గొప్ప ప్రదర్శనల కోసం శివ రాజ్‌కుమార్ ఎదురు చూస్తున్నానని,  టీమ్ ఇండియా(Team India)కు, ముఖ్యంగా కర్ణాటకకు చెందిన వారికి శుభాకాంక్షలను తెలిపారు. అలాగే  ఈ ముఖ్యమైన పోటీ సమయంలో వారికి చీర్స్ బిగ్గరగా ఉంటాయని , స్టార్ స్పోర్ట్స్ కన్నడలో తమ కుటుంబాలు మరియు స్నేహితులతో కలిసి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను చూడాలని కర్ణాటక(Karnataka)లోని అభిమానులందరినీ శివన్నకోరారు. టీమ్ ఇండియాకు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఉత్సాహం నింపాలని, తిరుగులేని మద్దతు ఇవ్వాలని కోరారు. 

ఈ షోలో శివన్న(Shivanna) కనిపించడం భారత క్రికెట్ జట్టుకు అతని బలమైన మద్దతును తెలియజేస్తుంది. అక్టోబరు 19, 2023న థియేటర్లలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘ఘోస్ట్’ (Ghost) గురించి కూడా మాట్లాడనున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రమిది. విజయ దశమి బరిలో విడుదల అవుతోంది.  శ్రీని ఘోస్ట్ (Ghost)చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసి శివన్నకు కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఇక ఈ ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్, శివన్న చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా డైలాగ్స్ మాత్రం అద్భుతంగా, గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. 

యుద్దం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం.. ఇలాంటి యుద్దాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా.. అవి చేసే నష్టాలే ఎక్కువ.. సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండొచ్చు.. కానీ విధ్వంసం సృష్టించే నా లాంటి వాడ్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు..అంటూ శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar) చెప్పిన డైలాగ్ బాగుంది.

నేను ఎవరి జోలికి వెళ్లను.. భయంతో కాదు.. నేను వెళ్తే రణరంగం మారణహోమంలా మారుతుందని అంటూ చివర్లో చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు హైలెట్‌గా ఉంది. ఈ ట్రైలర్‌లో జయరాం, అనుపమ్ ఖేర్‌లను చూస్తుంటే వారికి మంచి పాత్రలే దక్కినట్టుగా కనిపిస్తోంది. చెన్నైలోని లయోలా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు సమక్షంలో ఘోస్ట్(Ghost Movie) సినిమాలో తొలి పాటను ‘ఘోస్ట్’ ఓఎంజి( Ghost OGM) పేరుతో విడుదల చేశారు .ఓఎంజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్ అన్నమాట. ఇది హాలీవుడ్ స్టైల్ లో ఉందని శివన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఘోస్ట్ ఓఎంజి (Ghost OGM) పాటకు అర్జున్ జన్యా(Arjun Janya) సంగీతం అందించగా… ఐశ్వర్యా రంగరాజన్ ఆలపించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎంసీ చేతన్ ర్యాప్ రాయడంతో పాటు సాంగ్ పాడారు. ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, ఆ తర్వాత సూఫీ స్టైల్ మ్యూజిక్… డిఫరెంట్ కంపొజిషన్ & స్టైలిష్ మేకింగ్ విజువల్స్… అన్నీ కలబోతగా ఈ సాంగ్ వెరైటీగా ఉంది.

అక్టోబర్ 19న ‘ఘోస్ట్’ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, తమిళ హీరో విజయ్ ‘లియో’ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.