లిటిల్ మెగా ప్రిన్స్ పోలికలపై రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ రిప్లై

పెళ్లి అయిన 11 సంవత్సరాలకు రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులుకు జూన్ 20న ఆడబిడ్డ పుట్టింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా రామ్ మరియు ఉపాసన దంపతులు తమ కూతురిని చేతులలో పట్టుకొని ఎంతో ఆనందంగా కనిపించారు. పాప ముఖాన్ని కెమెరా యాంగిల్ కి కనపడనివ్వకుండా జాగ్రత్త తీసుకున్న వీరు కెమెరాలకు చక్కగా ఫోజులిచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత తమ కోరిక నెరవేరడంతో ఈ దంపతులు ఎంతో  సంతోషంగా ఉన్నారు. మెగా లిటిల్ ప్రిన్సెస్  ఈ […]

Share:

పెళ్లి అయిన 11 సంవత్సరాలకు రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులుకు జూన్ 20న ఆడబిడ్డ పుట్టింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా రామ్ మరియు ఉపాసన దంపతులు తమ కూతురిని చేతులలో పట్టుకొని ఎంతో ఆనందంగా కనిపించారు. పాప ముఖాన్ని కెమెరా యాంగిల్ కి కనపడనివ్వకుండా జాగ్రత్త తీసుకున్న వీరు కెమెరాలకు చక్కగా ఫోజులిచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత తమ కోరిక నెరవేరడంతో ఈ దంపతులు ఎంతో  సంతోషంగా ఉన్నారు.

మెగా లిటిల్ ప్రిన్సెస్ 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ తనకు తన కుటుంబానికి తమ ఆశీర్వాదాలు పంపినటువంటి మెగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మెగా కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు అన్న విషయం తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఆ కుటుంబంలో చాలామంది పేరు ఆంజనేయ స్వామి పేరుతో పెట్టబడిందే. ఉపాసన తల్లి కాబోతోంది అన్న వార్తను కూడా బాలాంజనేయ స్వామి ఫోటోతో అటాచ్ చేసి మరీ అనౌన్స్ చేశారు.

ఆంజనేయ స్వామికి ఎంతో ముఖ్యమైన మంగళవారం నాడు పాప పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెగా కుటుంబం గత 11 సంవత్సరాలుగా ఇంటి వారసురాలి కోసం ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో పుట్టిన పాప ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వైరల్ టాపిక్ అయింది. ఇటు మెగా అభిమానులు కూడా రామ్ చరణ్ ఉపాసన హాస్పిటల్ బయటకు వస్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పోస్టులు పెడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ పాప ఎవరి పోలిక?

తనకోసం తన కుటుంబం కోసం ప్రార్ధించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’ పోలిక ఎవరిదని  ఒక విలేకరి అడగడంతో.. పాప అచ్చం తనలాగే ఉందని రామ్ చరణ్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు పాపకు సంబంధించిన ఏ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పాప పేరుని మాత్రం ప్రస్తుతం ఎవరికీ వెల్లడించడానికి రామ్ చరణ్ నిరాకరించారు.

తమ సాంప్రదాయం ప్రకారం పాప పుట్టిన 21వ రోజున ఆమె పేరును వెల్లడించడం జరుగుతుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. పుట్టిన తర్వాత మొదటిసారి బిడ్డను చేతిలోకి తీసుకున్నప్పుడు తాను పొందిన అనుభూతిని మాటలతో వర్ణించలేనని రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పారు. రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్.సి రెడ్డి మనవరాలు. ఆమె కూడా అపోలోకి సంబంధించిన పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.

ఉపాసన అడ్మిట్ అయినటువంటి హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ ఆమెకు బిడ్డ పుట్టిన సందర్భంగా ప్రత్యేకంగా ఒక మెడికల్ బులెటిన్‌ను షేర్ చేశారు.”  ఉపాసన కామినేని కొణిదల మరియు రామ్ చరణ్ దంపతులకు జూన్ 22న హైదరాబాద్లోని మా అపోలో హాస్పిటల్స్ నందు ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు.”అని ఈ బులెటిన్‌‌లో పేర్కొన్నారు.

పాప పుట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా కుటుంబ సభ్యులు అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి ఈరోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నానని.. మా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉందని.. రామ్ చరణ్ మరియు ఉపాసనలను తల్లిదండ్రులుగా చూడాలి అన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని.. దైవానుగ్రహం మరియు అభిమానుల ఆశీర్వాదాల వల్ల తమ ఇంటిలో లక్ష్మీదేవి కాలు పెట్టిందని అన్నారు.