శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య మూవీకి పెరిగిన బ‌డ్జెట్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది యువతను ఆకట్టుకున్న ఈయన ఇటీవల తన 35వ సినిమాను తన పుట్టినరోజు సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను #Sharwa 35 అనే వర్కింగ్ టైటిల్ తో పీపుల్స్ మీడియా వారు నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.  ముఖ్యంగా […]

Share:

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది యువతను ఆకట్టుకున్న ఈయన ఇటీవల తన 35వ సినిమాను తన పుట్టినరోజు సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను #Sharwa 35 అనే వర్కింగ్ టైటిల్ తో పీపుల్స్ మీడియా వారు నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.  ముఖ్యంగా ఈ సినిమాను.. వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తూ ఉండడంతో మొదట్నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక ఈ సినిమాకి మలయాళీ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ని అందిస్తుండగా.. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ పెరిగిందని వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాను ప్రకటించినప్పుడు రూ.30 కోట్ల లోపే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు 35 కోట్ల రూపాయలకు దీని బడ్జెట్ పెరిగిపోయింది.. దీనికి కారణం లండన్,  స్కాట్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాలలో షూటింగ్ జరుపుకోవాలని.. ఇప్పటికే 35 కోట్ల రూపాయల బడ్జెట్ దాటిపోవడంతో ఈ దేశాలలో షూటింగ్ నిమిత్తం మరింత బడ్జెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ దేశాలలో షూటింగ్ నిర్వహించాల్సి ఉండగా బడ్జెట్ కారణంగా పెండింగ్లో ఉంచారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం శర్వా కేటాయించిన రోజులో 70 రోజులకు చేరుకోవడంతో ఆయన ఇతర సినిమాలపై కూడా చర్చ నడుస్తూ ఉండడం గమనార్హం. ఇందులో  శర్వానంద్ సరసన కీర్తి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. శివ కందుకూరి కీలక పాత్ర లో నటిస్తున్నారు..ఇక  రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.  ఇకపోతే ఇప్పటికే భారీగా ఖర్చు అవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ రోజులను తగ్గించుకుంటే.. ఖర్చు తగ్గించుకోవచ్చని ముఖ్యంగా విదేశాలలో షూటింగ్ చేసేటప్పుడు ఖచ్చితమైన ప్రణాళిక చేసుకోవాలని.. లేకపోతే ఖర్చులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదని ఇటీవల నిర్మాతలు వెల్లడించారు. 

ఇప్పటివరకు తీసిన షూటింగ్ ఔట్పుట్ తో సంతృప్తి చెందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు.. బడ్జెట్ ను కొంచెం తగ్గించాలని భావించారట. అయితే ప్రస్తుతం శర్వానంద్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ..సినిమా నుంచి విడుదలయ్యే టీజర్,  ట్రైలర్ కు వచ్చే రెస్పాన్స్ తో పాటు ప్రమోషన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ఎక్కువ ధరకు అమ్మగలమని నిర్మాతలు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరి అనుకున్న దాని ప్రకారం బడ్జెట్ ను అదుపు చేసి.. సినిమాను పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. మరి దీనిపై అటు శర్వానంద్, ఇటు  శ్రీరామ్ ఆదిత్య ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. ఇకపోతే శర్వా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇటీవలే జూన్ 3వ తేదీన రాత్రి 11 గంటలకు రక్షిత రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను  ఆయన వివాహం చేసుకున్నారు.. శనివారం రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరిద్దరి పెళ్లి చాలా ఘనంగా జరగగా.. ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన వారు సన్నిహితులు, స్నేహితులు,  పలువురు సినీ సెలబ్రిటీలు,  రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. వివాహం అనంతరం ఆయన వరుస సినిమాలతో బిజీగా మారినట్లు తెలుస్తోంది.