పఠాన్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే.?

పఠాన్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..  బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమా ఘన విజయాన్ని అందుకుంది .. చాలా ఏళ్ల నుంచి సరైన హిట్‌లేక బాధపడుతున్న షారుఖ్‌‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎన్నో వండర్స్‌ క్రియేట్ చేసింది. జనవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లను […]

Share:

పఠాన్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. 

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమా ఘన విజయాన్ని అందుకుంది .. చాలా ఏళ్ల నుంచి సరైన హిట్‌లేక బాధపడుతున్న షారుఖ్‌‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎన్నో వండర్స్‌ క్రియేట్ చేసింది. జనవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లను సాధించడమే కాకుండా..  అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు.. పఠాన్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. 

పఠాన్‌ సినిమా కలెక్షన్స్ రికార్డ్..

పఠాన్‌ సినిమా మరో రికార్డును కూడా నెలకొల్పింది. సుమారు 800 స్క్రీన్‌లలో 50రోజులు పూర్తి చేసుకుని కరోనా తర్వాత అత్యధిక సెంటర్‌లలో ఆ ఘనత సాధించిన సినిమాగా పఠాన్‌ నిలిచింది. దాదాపు రూ.250 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 550 కోట్లకు పైగా షేర్‌ను సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1044.50 కోట్ల గ్రాస్ కలెక్ట్‌ చేసి వెయ్యి కోట్ల మార్కు టచ్‌ చేసిన రెండో హిందీ సినిమాగా సరికొత్త క్రియేట్ చేసింది. 

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ వరుస పరాజయాలతో సతమవుతోన్న సమయంలో వచ్చిన పఠాన్‌ సినిమా వచ్చి ఒక్కసారిగా షారుఖ్‌‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ అనుకుంది.. తొలి రోజు నుంచి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అనూహ్య కలెక్షన్స్‌తో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది.  ప్రతీ రోజూ రూ. వంద కోట్లకు తగ్గకుండా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసింది.. దాని ఫలితమే  తొలి వారం పూర్తయ్యేసరికి పఠాన్‌ ఏకంగా రూ. 650 కోట్లు కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్..

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌‌ను సైతం అమెజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తానికి కొనుగోలుచేసింది. ఇక పఠాన్‌ ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ నెలలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే చిత్రాన్ని మార్చి నెలలోనే ఓటీటీలోకి తీసుకురానున్నారు. పఠాన్‌ సినిమాని ఓటీటీలో చూడొచ్చంటూ అమెజాన్‌ ప్రైమ్‌ ట్వీట్ చేసింది. అయితే ఇందులో విడుదల తేదీని మాత్రం ఖరారు చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం పఠాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్ ఏప్రిల్ 25 తేదీ నుంచి మొదలు కానుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త ఎడిటింగ్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేస్తామని దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రకటించారు. ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్స్ వసూలు చేసిన షారుక్ ఖాన్ ఇక ఓటీటీ ప్రపంచంలో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా షారుఖ్ ఖాన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.