ఎలిమినేషన్ తర్వాత పల్లవి ప్రశాంత్ పై షకీలా సంచలన వ్యాఖ్యలు

షకీలా తన బిగ్ బాస్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ బజ్ లో పాల్గొని సంచలన విషయాలు బయటపెట్టింది. బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ పై ఎంత నెగెటివిటీ వచ్చినా.. షో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 షురూ కాగా ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల నడుమ బిగ్ బాస్ హౌస్‍లో రెండో వారం […]

Share:

షకీలా తన బిగ్ బాస్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ బజ్ లో పాల్గొని సంచలన విషయాలు బయటపెట్టింది. బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ పై ఎంత నెగెటివిటీ వచ్చినా.. షో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 షురూ కాగా ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల నడుమ బిగ్ బాస్ హౌస్‍లో రెండో వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి.

ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఈ సారి అంతా ఉల్టా పుల్టా అంటూ రంగంలోకి దిగారు. ఇది ఏడో సీజన్‌ కాగా.. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్‌గా చేస్తున్నారు. ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్ 3న ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షోలో ప్రియాంక జైన్ తొలి కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజ, రితిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తొలివారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేటి కాగా.. మొదటి వారానికి గాను పవర్ అస్త్ర టాస్కులో సందీప్ మాస్టర్ విజయం సాధించి మొదటి కన్ఫార్మ్‌డ్ కంటెస్టెంట్ గా పేరు లిఖించుకున్నాడు. ఇక రెండో వారంలో షకీలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ లో షకీలా తన బిగ్ బాస్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటిస్టెంట్స్ తో చేస్తున్న బిగ్ బాస్ బజ్ లో పాల్గొని సంచలన విషయాలు బయటపెట్టింది షకీలా.

బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై షకీలా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా రైతు బిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ పై షకీలా చేసిన కామెంట్స్ హాట్ ఇష్యూ అయ్యాయి. పల్లవి ప్రశాంత్ తీరును తప్పుబట్టింది షకీలా.  బిగ్ బాస్ మాజీ కంటిస్టెంట్ గీతూ రాయల్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో షకీలా రెచ్చిపోయింది. మనసులో ఏదీ దాచుకోకుండా అన్నీ కక్కేసింది. హౌస్ లో మీరు శివాజీ బ్యాచా? లేక సీరియల్స్ బ్యాచా ` అని ప్రశ్నించగా, నేను చెప్పానా? అని అంది. దాంతో నేను అడుగుతున్నానంటూ గీతూ అంటే.. నీవేంటి నన్ను అడిగేది అంటూ షకీలా మళ్లీ ప్రశ్న వేయడంతో ఏం చెప్పాలో తెలియలేక తెల్లముఖం వేసింది.

ఈ సందర్భంగా ఒక్కొక్క కంటిస్టెంట్ గురించి చెప్పుకొచ్చిన షకీలా.. కంటెస్టెంట్ల గురించి షకీలా మాట్లాడుతూ.. చిన్న సమస్య ఎదురైతే అమర్ దీప్ తట్టుకోలేకపోతున్నాడు. యావర్ పెద్ద ఎధవ.. బాడీ పెంచితే..ఏదైనా సాధించవచ్చు అనే భ్రమలో ఉన్నాడని తెలిపింది.

ఇక పల్లవి ప్రశాంత్ విషయంలో షాకింగ్‌ కామెంట్స్ చేసింది. అతనిది బ్లడీ రాంగ్‌ యాటిట్యూడ్‌ అనేసింది. అందుకు ఉదాహరణ కూడా చెప్పింది షకీలా. వచ్చిన మొదటి రోజు పల్లవి ప్రశాంత్ తన చెప్పులు బయట తీసేసి వచ్చాడని, రెండో రోజు చెప్పులు కాస్త దూరంగా పెట్టాడని, ఇక మూడో రోజు కాలు పైకెత్తాడని, ఆ తర్వాత నాలుగో రోజు కాలు మీద కాలేసుకుని హౌస్ లో రెచ్చిపోయాడని షకీలా చెప్పడం గమనార్హం. పాపులారిటీ అనే డ్రగ్‌ అతనికి ఎక్కిందని షకీలా చెప్పింది.

ఇదే షోలో షకీలా చెప్పిన ఇంకొన్ని సంగతులు బిగ్ బాస్ షోని హాట్ టాపిక్ చేశాయి. సో.. చుడాలిమరి రానున్న రోజుల్లో షో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది.