షారుక్ ఖాన్ కి చంపుతామంటూ ఫోన్ కాల్స్

షారుక్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక్కదాని తర్వాత మరొకటి హిట్ కొడుతూ అభిమానుల మనసులో మరింత దగ్గరవుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల జవాన్ సినిమా వెయ్యికోట్ల బరిలో నిలిచి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అనుకోని రీతిగా షారుఖ్ ఖాన్ కు ఇటీవల చంపుతామంటూ బెదిరిస్తూ పలు ఫోన్ కాల్స్ వచ్చాయని సమాచారం.  చంపుతామంటూ ఫోన్ కాల్స్:  పఠాన్ మరియు జవాన్ సినిమాల రిలీజ్ అనంతరం షారుక్ ఖాన్ కు పలు బెదిరింపు కాల్స్ […]

Share:

షారుక్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక్కదాని తర్వాత మరొకటి హిట్ కొడుతూ అభిమానుల మనసులో మరింత దగ్గరవుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల జవాన్ సినిమా వెయ్యికోట్ల బరిలో నిలిచి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అనుకోని రీతిగా షారుఖ్ ఖాన్ కు ఇటీవల చంపుతామంటూ బెదిరిస్తూ పలు ఫోన్ కాల్స్ వచ్చాయని సమాచారం. 

చంపుతామంటూ ఫోన్ కాల్స్: 

పఠాన్ మరియు జవాన్ సినిమాల రిలీజ్ అనంతరం షారుక్ ఖాన్ కు పలు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు స్వయంగా షారుక్ ఖాన్ గవర్నమెంట్ కు తన కంప్లైంట్ విన్నవించాడు. అందుకనే ఇప్పటి వరకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కి ఉన్న సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాలని కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నటుడు షారుఖ్ ఖాన్ కు Y+ కేటగిరి సెక్యూరిటీ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే పలు కారణాలవల్ల ఎవరికైనా సెక్యూరిటీ అందించినప్పుడు.. ఎవరికైతే సెక్యూరిటీ గవర్నమెంట్ తరఫునుంచి అందించడం జరుగుతుందో వాళ్లే సెక్యూరిటీ ఫీజు మొత్తం భరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు షారుక్ ఖాన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. 

ఎవరికైతే Y+ కేటగిరి సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుందో వారికి ఆరుగురు కమాండోస్ 24/7 ఎప్పుడు వెంటే ఉండడం జరుగుతుంది. మొత్తం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది. అందులో నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉండగా, మరో ఆరుగురు కమాండోస్ ఉంటారు. ఇప్పటివరకు బాలీవుడ్ లో కేవలం ఇద్దరికీ మాత్రమే ఇటువంటి 24/7 Y+ కేటగిరి సెక్యూరిటీ అందించడం జరిగింది. సల్మాన్ ఖాన్ మరియు కంగనాకి మాత్రమే Y+ కేటగిరి సెక్యూరిటీ అందించడం జరిగింది. 

జవాన్ సినిమా విశేషాలు: 

‘జవాన్’ సినిమా, భారతీయ వ్యవస్థలోని ఉన్న అనేకమైన లొసుగులను ఎత్తిచూపుతూ సామాజిక రంగంలోకి ధైర్యంగా దూసుకుపోతుంది. అయితే షారుక్ ఖాన్ తన సినీ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది ప్రత్యేకమైన సినిమా అంటున్నారు ఫాన్స్. జవాన్ లో చూపించిన ఒక ప్రత్యేకమైన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది, ఆ సన్నివేశం వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది అని చెప్పుకోవచ్చు. ఆ వీడియో ద్వారా, ఖాన్ తమ ఓటును కులం, మతం మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయకండి అని, కేవలం విద్యా, వైద్యం, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండేలా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ, జవాన్ సినిమాలో షారుక్ చెప్పిన డైలాగ్ లు వైరల్ గా మారుతున్నాయి. ఆ జవాన్ సినిమాలో చెప్పిన డైలాగ్ తాలూకా క్లిప్, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. 

దీని ప్రపంచవ్యాప్త కలెక్షన్ దాదాపు రూ. 966 కోట్లు. దీంతో ఈ సినిమా త్వరలో 1000 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఆ క్లబ్‌లో ఇప్పటివరకు మూడు భారతీయ చిత్రాలు మాత్రమే భాగమయ్యాయి, ఒకటి అమీర్ ఖాన్ దంగల్, RRR, ఇంకోటి పఠాన్. పఠాన్ సినిమాతో ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుక్, ఇప్పుడు జవాన్ సినిమాతో ఆధిపత్యాన్ని దక్కించుకున్నాడని చెప్పుకోవచ్చు. 

జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది నయన తార.. షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఉత్కంఠ భరితంగా సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన జవాన్ సినిమాలో మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది సౌత్ ఇండియా సూపర్ స్టార్ నయనతార. ఒక పోలీస్ ఆఫీసర్ గా అదే విధంగా శారీలో కూడా షారుక్ ఖాన్ పక్కన ఆకట్టుకుంది. జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.