మనసు దోచుకున్న షారుక్ ఖాన్

ఇటీవల షారుక్ ఖాన్ తన బాలీవుడ్ జవాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు చేరుకున్న క్రమంలో, విజే తళపతి ఫ్యాన్స్ తళపతి తరపు నుంచి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో షారుక్, దళపతి గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు.  షారుఖ్ ఖాన్ అభిమానం:  జవాన్ సినిమా ప్రత్యేకించి హిట్ కొట్టినందుకు, బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు వసూలు చేసినందుకు తలపతి విజయ్ ఫ్యాన్స్ తమ […]

Share:

ఇటీవల షారుక్ ఖాన్ తన బాలీవుడ్ జవాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు చేరుకున్న క్రమంలో, విజే తళపతి ఫ్యాన్స్ తళపతి తరపు నుంచి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో షారుక్, దళపతి గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. 

షారుఖ్ ఖాన్ అభిమానం: 

జవాన్ సినిమా ప్రత్యేకించి హిట్ కొట్టినందుకు, బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు వసూలు చేసినందుకు తలపతి విజయ్ ఫ్యాన్స్ తమ అభినందనలు షారుక్ ఖాన్ కి తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయానికి గాను బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అభినందనలు తెలియజేసినందుకు థాంక్స్ చెప్పుకుంటూ..ఐ లవ్ విజయ్ సర్ అంటూ, అక్టోబర్ 19న రిలీజ్ అవ్వబోయే లియో సినిమా గురించి ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. 

బర్త్డే నాడు రిలీజ్ అయిన లియో ఫస్ట్ లుక్: 

విజయ్ లియో పోస్టర్ షేర్ చేస్తూ ట్విట్టర్ లో లోకేష్ కనకరాజ్ ‘హ్యాపీ బర్త్డే తలపతి విజయ్ అన్నా, మీ పుట్టినరోజు సందర్భంగా లియో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది, మీతో ఇంకా చాలా చిత్రాలు చేయాలని ఉంది అన్నా’ అని అన్నాడు. లియోలో కొంత భాగాన్ని కాశ్మీర్లో కూడా షూట్ చేశారు. ఇది ఖైదీ, విక్రమ్ లాగానే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇంక తలపతి విజయ్ విషయానికి వస్తే తను సంక్రాంతికి విడుదల చేసిన వారిసూ( తెలుగులో వారసుడు) తనకి పెద్ద విజయాన్ని అందించింది. ఆ విజయంతో లియో మీద ఇంకా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇంతకుముందు తలపతి విజయ్ తోమాస్టర్ అనే సినిమా తీశాడు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్. తలపతి విజయ్ లియో తో పెద్ద విజయాన్ని అందుకోవాలని ఈ సినిమా దసరాకి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ చాలామంది అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తమ అభిమానాన్ని తెలియజేశారు.. లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో పాటు వెంక‌ట్ ప్ర‌భు తీయ‌బోతున్న సినిమాలోనూ విజయ్ న‌టిస్తున్నారు. సినిమాల ప‌రంగా వెంక‌ట్ ప్ర‌భుతో తీసే సినిమానే లాస్ట్ అని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. 

జవాన్ సినిమా బెస్ట్ సీన్: 

‘జవాన్’ సినిమా, భారతీయ వ్యవస్థలోని ఉన్న అనేకమైన లొసుగులను ఎత్తిచూపుతూ సామాజిక రంగంలోకి ధైర్యంగా దూసుకుపోతుంది. అయితే షారుక్ ఖాన్ తన సినీ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది ప్రత్యేకమైన సినిమా అంటున్నారు ఫాన్స్. జవాన్ లో చూపించిన ఒక ప్రత్యేకమైన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది, ఆ సన్నివేశం వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది అని చెప్పుకోవచ్చు. ఆ వీడియో ద్వారా, ఖాన్ తమ ఓటును కులం, మతం మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయకండి అని, కేవలం విద్యా, వైద్యం, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండేలా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ, జవాన్ సినిమాలో షారుక్ చెప్పిన డైలాగ్ లు వైరల్ గా మారుతున్నాయి. ఆ జవాన్ సినిమాలో చెప్పిన డైలాగ్ తాలూకా క్లిప్, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఆ క్లబ్‌లో ఇప్పటివరకు మూడు భారతీయ చిత్రాలు మాత్రమే భాగమయ్యాయి, ఒకటి అమీర్ ఖాన్ దంగల్, RRR, ఇంకోటి పఠాన్. పఠాన్ సినిమాతో ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుక్, ఇప్పుడు జవాన్ సినిమాతో ఆధిపత్యాన్ని దక్కించుకున్నాడని చెప్పుకోవాలి.