ఆ ఘనత సాధించిన మొదటి యాక్టర్ షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీ జవాన్ ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్ జవాన్ తో మరోమారు ఆ మ్యాజిక్ ను రిపీట్ చేశాడు. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ షారుఖ్ ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తోంది. […]

Share:

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీ జవాన్ ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్ జవాన్ తో మరోమారు ఆ మ్యాజిక్ ను రిపీట్ చేశాడు. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ షారుఖ్ ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తోంది. ఇలా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తున్న సమయంలో షారుఖ్ ఓ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఈ రికార్డును చూసి తెగ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇందులో కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే కాకుండా రొమాంటిక్ సీన్లు, అన్ని ఇతర సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు కెరియర్ లో ప్లాపే చూడని యంగ్ డైరెక్టర్ అట్లీ మరోమారి తన మార్కును చూపెట్టాడు. ఇక ఈ మూవీలో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లోకి నయన తార గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. 

మొదటి ఇండియన్ యాక్టర్ గా

జవాన్ వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. షారుఖ్ నుంచి వచ్చిన లాస్ట్ మూవీ పఠాన్ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. పఠాన్ కూడా ఈ ఏడాదే రిలీజ్ అయింది. ఆ మూవీ లాంగ్ రన్ లో దాదాపు రూ. 1000 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన జవాన్ కూడా వారం కాకముందే రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఒకే ఏడాది రెండు 1000 కోట్ల సినిమాలను చేసిన మొట్టమొదటి ఇండియన్ హీరోగా షారుఖ్ రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేర లిఖించుకున్న కింగ్ ఖాన్ ఇప్పుడు మరో రికార్డును కూడా కైవసం చేసుకున్నాడు. వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ త్వరలోనే రూ. 1000 కోట్ల కలెక్షన్స్ ను సాధిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదే ఏడాది జనవరిలో రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ కూడా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన తొలి హీరోగా షారుఖ్ రికార్డులకెక్కనున్నాడు. 

దీపిక కూడా… 

షారుఖ్ ఖాన్-దీపికా పదుకునే ఒక హిట్ పెయిర్. ఈ ఇద్దరు స్టార్లు తెర మీద రొమాన్స్ చేసినా, యాక్షన్ చేసినా కానీ కనులపండువగా ఉంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన జవాన్ మూవీలో దీపిక హీరోయిన్ గా యాక్ట్ చేయకపోయినా కానీ ఒక చిన్న క్యామియో చేసింది. దీపిక క్యామియోతో షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ట్రైలర్, టీజర్ లను చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంచనా వేశారు. ఇక అంతే కాకుండా ఈ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించాడు. అట్లీకి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ అన్నదే లేదు. అందుకోసమే ఈ మూవీ కూడా తప్పకుండా హిట్ అవుతుందని అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పేరుకు ఇది బాలీవుడ్ మూవీ అయినా కానీ హీరోయిన్, విలన్ ఇద్దరూ తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్లే. ఈ ఇద్దరు మాత్రమే కాకుండా డైరెక్టర్ కూడా తమిళ చిత్రసీమకు చెందిన వాడే కావడం గమనార్హం. రీజనల్ ఇండస్ట్రీకి చెందిన అట్లీ చెప్పిన కథకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఓకే చెప్పి అతడితో సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను క్రియేట్ చేస్తోంది. 

1000 కోట్ల క్లబ్ పక్కా… 

ఎన్నో రికార్డులను తిరగరాస్తున్న అట్లీ డైరెక్ట్ చేసిన షారుఖ్ జవాన్ మూవీ త్వరలోనే రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని పలువురు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాలీవుడ్ లో రికార్డులను తిరగరాసిన పఠాన్ మూవీ కంటే ఎక్కువ రికార్డులను ఈ మూవీ కొల్లగొడుతోంది. అందుకోసమే ఈ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని అంతా అంటున్నారు. ఇటువంటి రేర్ ఫీట్ ను షారుఖ్ తన పేర లిఖించుకోబోతున్నాడు.