బాలీవుడ్ సినిమాల్లో సీమా హైదర్ కి నటించే అవకాశం

ప్రేమికుడి కోసం పాకిస్థాన్ నుంచి పిల్లలతో సహా భారత్ కు వచ్చిన సీమా హైదర్ గురించి అందరికి తెలిసిందే.. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన తన ప్రియుడు సచిన్ కోసం పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చారు సీమా కానీ అప్పట్నుంచి వార్తలలో నిలుస్తుంది  ఇప్పుడు అయితే’ఏకంగా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ పాకిస్తాన్ మహిళా  అందులోనూ ఆమె రా ఏజెంట్ గా దర్శనం ఇవ్వబోతుందని సమాచారం. సినిమా దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్ మంగళవారం […]

Share:

ప్రేమికుడి కోసం పాకిస్థాన్ నుంచి పిల్లలతో సహా భారత్ కు వచ్చిన సీమా హైదర్ గురించి అందరికి తెలిసిందే.. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన తన ప్రియుడు సచిన్ కోసం పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చారు సీమా కానీ అప్పట్నుంచి వార్తలలో నిలుస్తుంది 

ఇప్పుడు అయితే’ఏకంగా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ పాకిస్తాన్ మహిళా 

అందులోనూ ఆమె రా ఏజెంట్ గా దర్శనం ఇవ్వబోతుందని సమాచారం. సినిమా దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్ మంగళవారం రోజు గ్రేటర్ నోయిడాలో సచిన్ తో కలిసి ఉంటున్న సీమా హైదర్ ను కలిశారు. జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం సీమాకు ఆడిషన్స్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

 ఉదైపూర్‌లో కన్హయ్య లాల్ అనే ఒక టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు నరికి చంపిన ఉదంతంపై ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’ అనే సినిమా రూపొందుతోంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోని ఆ టైలర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తన మద్దతు తెలిపిన పాపానికి.. ఇద్దరు ఇస్లాం మద్దతుదారులు ఆయన్ను కత్తితో పొడిచి చంపారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఉదంతంపై ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు

పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు కలుసుకున్నాం…. 

కరోనా సమయంలో పబ్ జీ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల భారతీయ వ్యక్తి సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ చెప్పారు. ఇప్పటికే గులాం హైదర్‌తో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ను విడిచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. 

ఆమె మొదట మార్చిలో నేపాల్‌లో సచిన్‌ను కలుసుకుంది. ఆ తర్వాత ఆమె హిందూ మతంలోకి మారిన తర్వాత హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మే 13న ఆమె పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. జులై 4వ తేదీన సీమా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమె అరెస్టు కూడా చేశారు. అలాగే ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్, అతని తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత సీమా, సచిన్, అతడి తండ్రి బెయిల్‌పై విడుదలైనప్పటికీ.. ఈ జంటను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఆమె నిజంగానే ప్రేమ కోసమే దేశం దాటిందా లేక ఆమె రా ఏజెంటా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే సౌదీ అరేబియాలో పని చేస్తున్న సీమా మాజా భర్త గులామ్ తన భార్య, పిల్లలను తిరిగి పాకిస్థాన్ పంపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే తనకు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని, సచిన్‌తో కలిసి జీవించాలనుకుంటున్నట్లు సీమా చెప్పింది. ప్రస్తుతం ఇక్కడే కలిసి ఉంటున్నారు. 

అయితే.. ఈ సినిమాలో నటించేందుకు సీమా హైదర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తనకు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నుంచి క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే ఈ సినిమాలో నటిస్తానని ఆమె తెలిపింది. అటు.. కన్హయ్య భార్య, అతని కుమారుడు నుంచి నిర్మాత అమిత్ జానీకి ఈ సినిమాపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ వచ్చింది. ఇదిలావుండగా.. సీమా హైదర్ హిందూ మతాన్ని స్వీకరించినప్పుడు, అమిత్ ఆమెకు కాషాయ శాలువను అందించి స్వాగతించారు. ఆ సమయంలో జానీ పాదాలు తాకి, సీమా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ బృందం, సీమా హైదర్ ఇద్దరూ ఏటీఎస్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు.