మళ్లీ పుంజుకున్న బాలీవుడ్ హ‌వా

గతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు బాలీవుడ్ చిత్రాలు అంతంతమాత్రంగానే ఆడిన సందర్భాలు చూసే ఉంటాం. 2019 నుంచి 2022 వరకు బాలీవుడ్ పెద్దగా సక్సెస్ అందుకోలేదని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయి అంటున్నారు సినీ రంగాలు. బాలీవుడ్ సక్సెస్ వెనక ఉన్న ముఖ్య కారణాలు ఇవే అంటూ కొంతమంది వాదిస్తున్నారు.  సక్సెస్ సీక్రెట్స్ ఇవే:  ఒకప్పుడు జీవితం స్లోగా ఉండేది, ఆరు బయట కూర్చుని చక్కగా మాట్లాడుకునేందుకు, సినిమా హాలుకు వెళ్లి సినిమాలు చూసే […]

Share:

గతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు బాలీవుడ్ చిత్రాలు అంతంతమాత్రంగానే ఆడిన సందర్భాలు చూసే ఉంటాం. 2019 నుంచి 2022 వరకు బాలీవుడ్ పెద్దగా సక్సెస్ అందుకోలేదని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయి అంటున్నారు సినీ రంగాలు. బాలీవుడ్ సక్సెస్ వెనక ఉన్న ముఖ్య కారణాలు ఇవే అంటూ కొంతమంది వాదిస్తున్నారు. 

సక్సెస్ సీక్రెట్స్ ఇవే: 

ఒకప్పుడు జీవితం స్లోగా ఉండేది, ఆరు బయట కూర్చుని చక్కగా మాట్లాడుకునేందుకు, సినిమా హాలుకు వెళ్లి సినిమాలు చూసే సమయం దొరికేది. బస్సుల కోసం రిక్షాల కోసం ఎదురు చూస్తూ, అందరూ కలిసి సినిమా హాల్ కి వెళ్లే సినిమా చూసే సమయం దొరికేది. అప్పట్లో సినిమా హాల్లో మాత్రమే సినిమాలు చూసే అవకాశం ఉండేది.

2023లో పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఇప్పుడు నిజానికి తక్కువ సమయం.. ఎక్కువ స్క్రీన్‌లు మన చేతుల్లోనే ఉంటున్నాయి, నిజానికి ప్రతి జేబులో ఒక్కొక్కటి. ఓటిటి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలోనే వినోదం అనేది దొరుకుతుంది. అంతేకాకుండా బాలీవుడ్ జోరు ఓటిటి ఉన్నప్పటికీ చాలా బాగా కొనసాగుతూ వచ్చింది.. కానీ తర్వాత 2019 నుంచి 2022 మధ్యలో బాలీవుడ్ ఎక్కువ విజయాలు చూడలేదని చెప్పుకోవాలి.

కొంత కాలం ప్రశాంతంగా ఉన్న తర్వాత, బాలీవుడ్ మళ్లీ బ్యాంగ్‌తో తిరిగి వచ్చింది. ఈ ఏడాది మూడు హిందీ సినిమాలు ఇండియాలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా రాబోయే రెండు నెలల్లో కూడా అనేక బాలీవుడ్ చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మహమ్మారి లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్ డౌన్: 

నిజానికి 2019లో తీసిన సినిమాలు 2020, 2021, 2022లో రిలీజ్ అయినప్పటికీ, లాక్ డౌన్ కరోనా సమయాలు కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఓటిటిలోనే సినిమాలు చూసేందుకు మక్కువ చూపించారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలామంది పాటించడం వల్ల చాలా సినిమాలు ఓటిటికి మాత్రమే పరిమితమయ్యాయి. అందువల్ల చాలా సినిమాలు అంతంత మాత్రంగానే ఆడిన సందర్భాలు కనిపించాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

మరోవైపు కొంతమంది మల్టీప్లెక్స్ లో చూసే ఎక్కువ మంది బాలీవుడ్ అభిమానులు, మల్టీప్లెక్స్ సినిమా హాల్లో టికెట్ల రేట్లు పెరగడంతో ఎక్కువ శాతం అభిమానులు ఓటిటిలో చూసేందుకు మక్కువ చూపించినట్లు మరి కొంతమంది మాట్లాడుతున్నారు. 

మళ్లీ థియేటర్లకు వస్తున్న జనం: 

గత మూడు సంవత్సరాలుగా ఓటిటికి అంకితం అయిపోయిన అభిమానులు చాలామంది కూడా, తమ అభిమాన నటీనటులను చిన్న స్క్రీన్ లో చూసేందుకు ఇష్టపడకపోవడం, ఓటిటిలో చూసి చూసి బోర్ కొట్టి ఇప్పుడు థియేటర్లకు వెళ్లి చూడాలి అనుకునే జనం ఎక్కువ అయ్యారని.. అందుకే బాలీవుడ్ హవా మళ్లీ మొదలైందని కొంతమంది ఊహిస్తున్నారు. మరోపక్క ఆడియన్స్ కి కావాల్సిన మాస్ ఎంటర్టైనర్స్ చిత్రాలు వరుసగా రిలీజ్ అవ్వడం కూడా బాలీవుడ్ హవా కొనసాగించేందుకు ఒక ముఖ్యమైన కారణం అంటున్నారు. వరుసగా రిలీజ్ అయిన పట్టాన్, గాదర్-2, జవాన్ సినిమాలు మాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్న అభిమానులకు పండుగల అనిపించడం కారణంగానే.. వరుస సినిమాలు 500 కోట్ల బరిలో నిలిచాయని సినిమా వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

రాబోతున్న మరిన్ని బాలీవుడ్ చిత్రాలు: 

2023 ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన మూడు హిందీ చిత్రాలను ప్రేక్షకులకు అందించగా, ‘ది కేరళ స్టోరీ’ మరియు ‘డ్రీమ్ గర్ల్ 2’ వంటి అనేక చిత్రాలు రూ. 100 కోట్ల బరిలో నిలిచాయి. మరో మూడు నెలలు వరుసగా బాలీవుడ్ హవా నడిచే అవకాశం ఉందని సినీ వర్గాలు ఊహిస్తున్నాయి.

‘టైగర్ 3’, ‘యానిమల్’ మరియు ‘డంకీ’ వంటి విడుదలకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక ‘జరా హత్కే..’, ‘ది కేరళ స్టోరీ’ లాగానే మరిన్ని ప్రేక్షకులను తమ కథనాలతో మరింత ఆకట్టుకునేందుకు మరిన్ని సినిమాలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.