సర్కారు నౌకరి టీజర్ రిలీజ్

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఉపద్రష్ట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకున్నారు.  ఇండస్ట్రీలో కొన్ని వందల పాటలతో సంగీత ప్రియలను మైమరపించింది. ఓవైపు పాటలు పాడుతునే.. మరోవైపు బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు సునీత. ఇక ఇప్పుడు ఆమె తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్నారు.  ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో ప్రైవేట్ […]

Share:

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఉపద్రష్ట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకున్నారు. 

ఇండస్ట్రీలో కొన్ని వందల పాటలతో సంగీత ప్రియలను మైమరపించింది. ఓవైపు పాటలు పాడుతునే.. మరోవైపు బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు సునీత. ఇక ఇప్పుడు ఆమె తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్నారు.

 ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గంగానమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

జాతీయ రాకెట్‌బాల్ ఛాంపియన్ అయిన ఆకాష్, సర్కారు నౌకరి లో  ప్రధాన నటుడిగా తన సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది.. చెప్పండి.  KRRలో అరంగేట్రం చేస్తున్నానని ఆకాష్ చెప్పారు. ఇది నమ్మశక్యం కానిది మరియు నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పుకొచ్చారు…  

దర్శకుడు మరియు పిఆర్‌ఓడియు సి ఈ కథకు ముఖ్యాంశంగా ఒక యువ నటుడి కోసం వెతుకుతున్నారు అని అప్పుడు సోషల్ మీడియాలో నా\ ఫోటోలు చూసిన శేఖర్ అతనిని సంప్రదించారు . అతను కథను వివరించినప్పుడు నాకు అది నచ్చి ఒకే  అని చెప్పాను. తరువాత, మేము కొన్ని నటన మరియు స్క్రిప్ట్ రీడింగ్ వర్క్‌షాప్‌లు చేసాము. ఆపై KRR సార్ దీనిని నిర్మిస్తారని దర్శకుడు వెల్లడించారు  అని ఆకాష్ గుర్తు చేసుకున్నారు.

1996లో కొల్లాపూర్ వద్ద జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సర్కారీ నౌకరి పీరియాడిక్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ లో హీరో గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత అతనికి పల్లెటూరు అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత తన ఉద్యోగం వల్ల అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా అని తెలుస్తోంది.

ఆకాష్ జీవితం రాకెట్‌బాల్ నుండి చలనచిత్రాలకు  మలుపు తిరిగింది, కానీ అతను ఎప్పుడూ కళల వైపు మొగ్గు చూపేవాడని చెప్పారు నేను క్రీడాభిమానిని మరియు వివిధ రకాల క్రీడలు ఆడతాను అని  రాకెట్ బాల్‌ను ఆడడం ఇష్టం అని  మరియు కేలరీలు బర్న్ చేయడానికి ఇది గొప్ప మార్గంగా భావించాను . . కాబట్టి నేను ఫిట్‌నెస్ కోసం ఆడాను. నేను అందులో రాణిస్తున్నందున, నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు 2015-16లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను, అని ఆకాష్  గుర్తు చేసుకున్నారు .

ఈ సినిమాలో ఆకాష్ జోడిగా.. భావన వళపండల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ కీలకపాత్రలలో నటించగా.. శాండిల్య సంగీతం అందించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వమే కాదు.. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు.

 ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో సింగర్ సునీత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. డబ్బింగ్ చెప్పాను. ఇది మాకు హోమ్ బ్యానర్ లాంటింది. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ.. రాఘవేంద్రరావు గారు సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు.. సంస్కారం, మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా జీవితంలో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావచ్చు” అన్నారు సునీత.